బందీల విడుదల..జెలెన్‌స్కీ కీలక ట్వీట్‌ | Zelenskyy Key Tweet On Release Of Ukrainians From Russia | Sakshi
Sakshi News home page

రష్యా నుంచి బందీల విడుదల..జెలెన్‌స్కీ కీలక ట్వీట్‌

Jan 4 2025 8:28 AM | Updated on Jan 4 2025 10:19 AM

Zelenskyy Key Tweet On Release Of Ukrainians From Russia

కీవ్‌:గత ఏడాదిలో తమ దేశానికి చెందిన 1358 మంది సైనికులు,పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ వెల్లడించారు. వారిని విడిపించేందుకు ఉక్రెయిన్‌ అధికారులు తీవ్రంగా శ్రమించారని కొనియాడారు. కొత్త ఏడాది 2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉందని జెలెన్‌స్కీ తాజాగా ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు.

రష్యా వద్ద బందీలుగా ఉన్న తమ సైనికులు,పౌరుల విడుదలలో మిత్ర దేశాల పాత్ర కీలకమని తెలిపారు. రష్యాతో యుద్ధం కూడా ఈ ఏడాది ముగియాలని ఈ సందర్భంగా జెలెన్‌స్కీ ఆకాంక్షించారు.

2022లో ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా,ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది.ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన 30 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు.ఉక్రెయిన్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగింది.

 ఇదీ చదవండి: షినవత్రకు అన్ని ఆస్తులా..?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement