ఇజ్రాయెల్‌ హీరో? ఎవరీ అర్నాన్ జమోరా | Who Was Arnon Zamora, Israeli Officer Who Dies While Rescuing Hostages | Sakshi
Sakshi News home page

Who Was Arnon Zamora: ఇజ్రాయెల్‌ హీరో? ఎవరీ అర్నాన్ జమోరా

Published Sun, Jun 9 2024 3:40 PM | Last Updated on Sun, Jun 9 2024 6:45 PM

Who was Arnon Zamora

హమాస్‌ చెరలో బంధీలుగా ఉన్న నలుగురు ఇజ్రాయెల్‌ పౌరులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ కఠినమైన ఆపరేషన్‌ను విజయవంతం చేసేందుకు ఐడీఎఫ్‌ కమాండర్‌ అర్నాన్ జమోరా ప్రాణాల్ని ఫణంగా పెట్టారు. హమాస్‌ మెరుపు దాడుల నుంచి విరోచిత పోరాటం చేసి ప్రాణాలొదిన అర్నాన్‌ జమెరాను ఇజ్రాయెల్‌ ప్రభుత్వంతో పాటు ఆ దేశ పౌరులు హీరోగా కీర్తిస్తున్నారు.  

శనివారం హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న నావో అర్గమణి, అల్మోగ్‌ మీర్‌ జాన్‌, ఆండ్రీ కోజ్లోవ్‌, ష్లోమి జివ్‌లను ఇజ్రాయెల్‌ నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం యూనిట్‌ (యమమ్)కమాండర్‌, టాటికల్‌ ఆపరేటర్‌ అర్నాన్ జమోరా నుసిరత్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి వారిని రక్షించారు. ఈ తరుణంలో ప్రత్యర్ధుల దాడిలో కమాండర్‌ అర్నాన్‌ జమెరా ప్రాణాలొదారు. తాజాగా, ఆయన మరణంపై ఇజ్రాయెల్‌ మరణంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది.

బాధకలిగించింది
ప్రతి రెస్క్యూ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌ సైనికులు తమ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ పౌరుల్ని రక్షించే క్రమంలో తీవ్రంగా గాయపడిన యమమ్ (నేషనల్ పోలీస్ కౌంటర్-టెర్రరిజం యూనిట్)లో కమాండర్,టాక్టికల్ ఆపరేటర్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆర్నాన్ జమోరా ప్రాణాలొదలడం బాధకలిగించిందని ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ట్వీట్‌లో పేర్కొంది.

అర్నాన్ జమోరా ఎవరు?
ఇజ్రాయెల్‌ మీడియా సంస్థ హారెట్జ్ ప్రకారం..ఇజ్రాయెల్ నగరం స్డెరోట్ సమీపంలో జమోరా స్డే డేవిడ్ గ్రామానికి చెందిన వారు. ఆయనకు భార్య మిచాల్‌ ఇద్దరు పిల్లలు, అతని తల్లిదండ్రులు రూవెన్ రూతీలతో కలిసి ఉంటున్నారు.ఇక జమెరా గతేడాది అక్టోబర్ 7 న యాద్ మొర్దెచాయ్ ప్రాంతంలో అనేక మంది హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు.  

ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ జామెరా ధైర్య సహాసాల్ని గుర్తు చేసుకున్నారు. గాజాలో హమాస్ చేతిలో ఉన్న 4 మంది బందీలను రక్షించడానికి సాహసోపేతమైన ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన అర్నాన్‌ జమోరా మృతిపై విచారం వ్యక్తం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement