ఇరాక్‌లో నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు అపహరించిన భారతీయుల కథ విషాదాంతమైంది. ఆ 39 మంది భారతీయులు చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని కేంద్రం ప్రకటించింది. వారిని ఉగ్రవాదులు ఊచకోత కోసి మోసుల్ పట్టణం సమీపంలోని బదోష్ అనే గ్రామంలో పూడ్చిపెట్టినట్లు గుర్తించామని తెలిపింది. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం వారు అపహరణకు గురైన భారతీయులేనని నిర్ధారణకు వచ్చినట్లు మంగళవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభకు తెలిపారు.