దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో ఓ సొరంగంలో ఆరుగురి బంధీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు వీరిని బంధీలు గాజా తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. కార్మెల్ గాట్, ఈడెన్ యెరుషల్మి, హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్, అలెగ్జాండర్ లోబనోవ్, అల్మోగ్ సరుసి, ఒరి డానినో మృతదేహాలను ఇజ్రాయెల్‌కు తీసుకువచ్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది.
వీరు తాము స్వాధీనం చేసుకునే కొంత సమయం ముందు హమాస్ మిలిటెంట్ల చేతిలో దారుణంగా హత్యకు గురైనట్లు ఆర్మీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. దక్షిణ గాజాలోని భూగర్భ సొరంగం నుంచి 52 ఏళ్ల ఇజ్రాయెల్ బంధీ ఖైద్ ఫర్హాన్ అల్కాడిని సైన్యం రక్షించి వారం రోజులు గడవక ముందే ఒకేసారి ఆరుగురి మృతి దేహాలను స్వాధీనం చేసుకోవటం గమనార్హం. ఈ ఆరుగురిలో ఇజ్రాయెలీ-అమెరికన్ హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్ అన్నారు.
గోల్డ్‌బెర్గ్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు రోజు.. గాజా యుద్ధాన్ని ముగించాలని బైడెన్ పిలుపునిచ్చారు. బందీల విడుదల, విధ్వంసమైన గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ కోసం పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌తో కొనసాగుతున్న చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు.‘ గాజా ఒప్పందాన్ని ముగించగలమని భావిస్తున్నాం. ఇరువురు సంబంధిత ఒప్పందాలను అంగీకరిస్తున్నట్లు చెప్పారాయన.
ఇదిలాఉండగా.. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 40,691 మంది మరణించగా.. 94,060 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం.. హమాస్ మిలిటెంట్ గ్రూప్ చేసిన 1,200 మందిని మృతి చెందగా.. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment