calendar year
-
పదేళ్లలో ఇదే ప్రచండ బంగారం! కొత్త ఏడాదిలోనూ కొనసాగుతుందా?
ఈ ఏడాది ఇప్పటివరకు 30 శాతానికి పైగా పెరిగిన బంగారం ధరలు భారతీయ మార్కెట్లలో గ్రాముకు రూ. 7,300కి చేరుకున్నాయి. ఒక క్యాలెండర్ ఇయర్లో ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే గడిచిన 10 సంవత్సరాలలో ఈ ఏడాది పెరుగుదలే అత్యధిక కానుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదిక వెల్లడించింది.అయితే ఆర్థిక, భౌగోళిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ స్థాయి పరుగు 2025 చివరి వరకు కొనసాగకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడానికి కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు, పెట్టుబడిదారుల కొనుగోళ్లే కారణమని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొందిడబ్ల్యూజీసీ డేటా ప్రకారం.. 2022లో చూసిన స్థాయిలతో పోలిస్తే 2024 క్యాలెండర్ ఇయర్ మూడో త్రైమాసికం నాటికి బంగారం కొనుగోలు 694 టన్నులకు చేరుకోవడంతో సెంట్రల్ బ్యాంక్ డిమాండ్ బలంగా ఉంది. 2024 అక్టోబర్ నాటికి తుర్కియే, పోలాండ్ సెంట్రల్ బ్యాంకులు వరుసగా 72 టన్నులు, 69 టన్నుల బంగారు నిల్వలను జోడించి బంగారం మార్కెట్లో ఆధిపత్యం ప్రదర్శించాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్‌లో 27 టన్నులను జోడించింది. ఈ నెల వరకు దాని మొత్తం బంగారం కొనుగోళ్లు 77 టన్నులకు చేరుకున్నాయి. అక్టోబర్ వరకు భారత్ నికర కొనుగోళ్లు దాని 2023 కార్యకలాపాలపై ఐదు రెట్లు పెరిగాయని నివేదిక పేర్కొంది.వచ్చే ఏడాది ఎలా ఉంటుంది?2025 బంగారానికి సవాలుగా ఉండే సంవత్సరంగా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అనేక ఎదురుగాలులను వారు చూస్తున్నారు. వాటిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లపై దాని ప్రభావం ఉన్నాయి. బంగారం అతిపెద్ద వినియోగదారులలో ఒకటైన చైనాలో కూడా పరిణామాలు కీలకంగా ఉన్నాయి. -
2023లో క్విప్ నిధుల జోరు
న్యూఢిల్లీ: ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2023)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) జోరుమీదుంది. కంపెనీలు నిధుల సమీకరణకు క్విప్‌ను అత్యధికంగా ఆశ్రయిస్తున్నాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకూ క్విప్ ద్వారా రూ. 50,218 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇది గతేడాది(2022) నమోదైన రూ. 8,196 కోట్లతో పోలిస్తే ఆరు రెట్లు అధికంకావడం గమనార్హం! ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపడం సానుకూల ప్రభావం చూపుతోంది. ఇక రైట్స్, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలోనూ నిధుల సమీకరణ సైతం 2022తో పోలిస్తే భారీగా ఎగసింది. ఎన్ఎస్ఈ వివరాల ప్రకారం 2023లో రైట్స్ ఇష్యూల ద్వారా రూ. 8,017 కోట్లు అందుకున్నాయి. గతేడాది ఇవి రూ. 3,646 కోట్లుకాగా.. ఓఎఫ్ఎస్ ద్వారా 44 శాతం అధికంగా రూ. 15,959 కోట్లు లభించాయి. 2022లో ఇవి రూ. 11,110 కోట్లు మాత్రమే. కారణాలివీ క్విప్ ద్వారా నిధుల సమీకరణ వృద్ధికి ప్రధానంగా ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలంగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నంతకాలం ఇన్వెస్టర్లకు రిటర్నులు లభిస్తుంటాయని తెలియజేశారు. అందులోనూ వేగవంతంగా పెట్టుబడుల సమీకరణకు వీలుండటంతో కంపెనీలు క్విప్ చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తుంటాయని వివరించారు. లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడి వ్యయాల కోసం, పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనల అమలు కోసం సాధారణంగా కంపెనీలు క్విప్‌నకు తెరతీస్తుంటాయని విశ్లేషకులు తెలియజేశారు. లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే వీలున్న క్విప్ ద్వారా సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వేగంగా నిధులను అందుకునేందుకు వీలుండటం మరొక సానుకూల అంశమని తెలియజేశారు. దిగ్గజాలు సై ఈ ఏడాది క్విప్ ద్వారా ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ రూ. 8,800 కోట్లు అందుకుంది. ఈ బాటలో యూనియన్ బ్యాంక్(యూబీఐ) రూ. 5,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) రూ. 4,500 కోట్లు చొప్పున సమీకరించాయి. బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ సైతం క్విప్ ద్వారా రూ. 2,305 కోట్లు సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ అంశం! ఈ జాబితాలో చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చేరాయి. రైట్స్, ఎఫ్‌పీవో తదితరాలతో పోలిస్తే.. తక్కువ సమయం, సులభ నిబంధనల కారణంగా క్విప్ చేపట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. -
5.5 శాతం నుంచి 6.7 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2023 క్యాలెండర్ ఇయర్ వృద్ది రేటు 5.5 శాతం అంచనాలను రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ భారీగా 6.7 శాతానికి పెంచింది. ఆర్థిక క్రియాశీలత గణనీయంగా మెరుగుపడ్డం దీనికి కారణమని తన తాజా అంతర్జాతీయ స్థూల ఆర్థిక అవుట్‌లుక్ (ఆగస్టు అప్డేట్)లో తెలిపింది. కాగా 2023 హై బేస్ నేపథ్యంలో 2024లో వృద్ధి రేటును 6.5 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. పటిష్ట సేవల రంగం, మూలధన వ్యయాలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 7.8 శాతం పెరుగుదలకు కారణంగా పేర్కొంది. 2023 ద్వితీయార్థంలో, 2024 ప్రారంభంలో ఎల్‌నినో పరిస్థితులు బలంగా ఉంటే వ్యవసాయ వస్తువుల ధరలు పెరగవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉంటుందని, ద్రవ్యోల్బణం దేశంలో తట్టుకునే రీతిలోనే ఉండే అవకాశం ఉందని అంచనావేసిన మూడీస్, ఈ నేపథ్యంలో ఆర్బీఐ రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాత) రేట్ల పెంపు ఉండకపోవచ్చని అంచనా వేసింది. జీ20 వృద్ధి తీరు ఇది... జీ–20 దేశాల వృద్ధి 2023లో 2.5 శాతంగా ఉండవచ్చని, 2024లో 2.1 శాతానికి తగ్గవచ్చని అభిప్రాయపడింది. 2022లో ఈ రేటు 2.7 శాతం. 2024 చైనా వృద్ధి రేటును 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించడం గమనార్హం. భారత్‌కు మూడీస్ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ‘బీఏఏ3’ సావరిన్ రేటింగ్‌ను అందిస్తోంది. 2023–24లో వృద్ధి రేటును 6.1 శాతంగా అంచనావేస్తోంది. 2022–23 7.2 శాతం కన్నా ఇది భారీ తగ్గుదల కావడం గమనార్హం. -
క్యూ1లో 35 శాతం తగ్గిన డీల్స్
ముంబై: ప్రస్తుత కేలండర్ ఏడాది(2023) తొలి త్రైమాసికంలో డీల్స్ 35 శాతం క్షీణించినట్లు గ్రాంట్ థార్న్టన్ నివేదిక పేర్కొంది. జనవరి–మార్చి(క్యూ1)లో 9.7 బిలియన్ డాలర్ల విలువైన 332 లావాదేవీలు జరిగినట్లు తెలియజేసింది. ప్రపంచ ఆర్థిక మాంద్య భయాలు, కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం డీల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపినట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం మొత్తం డీల్స్‌లో సగభాగానికిపైగా ఆక్రమించిన విలీనాలు, కొనుగోళ్లు(ఎంఅండ్ఏ) విలువ 21 శాతం నీరసించి 4.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. 46 శాతం తక్కువగా 76 డీల్స్ నమోదయ్యాయి. ప్రధానంగా ఐపీవో మార్కెట్ క్షీణించడం ప్రభావం చూపింది. 2022 క్యూ1లో బిలియన్ డాలర్లు నమోదుకాగా.. తాజా సమీక్షా కాలంలో 84.4 మిలియన్ డాలర్లకు తగ్గింది. మరోపక్క క్విప్ విభాగంలో స్పైస్‌జెట్ కార్గో లాజిస్టిక్స్ బిజినెస్ 30.1 కోట్ల డాలర్లు, డేటా ప్యాటర్న్స్ 6 కోట్ల డాలర్లు చొప్పున సమీకరించాయి. అయితే 2022 క్యూ1లో 54.1 కోట్ల డాలర్ల సమీకరణతో పోలిస్తే తక్కువే. కాగా.. మొత్తం డీల్స్‌లో స్టార్టప్ రంగం వాటా 22 శాతంకాగా.. 6.9 కోట్ల డాలర్ల విలువైన 17 లావాదేవీలు జరిగాయి. అయితే ఇవి 2022 క్యూ1తో పోలిస్తే 71 శాతం క్షీణించడం గమనార్హం. -
భారత్ వృద్ధి అంచనాలకు మూడీస్ కోత!
న్యూఢిల్లీ: అధిక ద్రవ్యోల్బణాన్ని కారణంగా చూపిస్తూ, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం 2022 క్యాలెండర్ ఇయర్ భారతదేశ ఆర్థిక వృద్ధి వృద్ధి అంచనాను 9.1 శాతం నుండి 8.8 శాతానికి కుదించింది. ఈ మేరకు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం వెలువరించిన 2022–23 గ్లోబల్ స్థూల ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. ► డిసెంబర్ త్రైమాసికం 2021 (2021 అక్టోబర్–డిసెంబర్) నుండి ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో వృద్ధి ఊపందుకున్నట్లు హై–ఫ్రీక్వెన్సీ డేటా సూచిస్తోంది. ► అయితే ముడి చమురు, ఆహారం, ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం రాబోయే నెలల్లో గృహ ఆర్థిక, వ్యయాలపై ఉంటుంది. ఇంధనం, ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరక్కుండా సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్న రేట్ల పెంపు విధానం డిమాండ్ రికవరీ వేగాన్ని తగ్గిస్తుంది. ► 2022 ఎకానమీ స్పీడ్‌ను 8.8 శాతానికి తగ్గిస్తున్నా, 2023 వృద్ధి అంచనాలను 5.4 శాతంగా యథాతథంగా కొనసాగిస్తున్నాం. ► పటిష్ట రుణ వృద్ధి, కార్పొరేట్ రంగం ప్రకటించిన పెట్టుబడి ప్రణాళికలు, ప్రభుత్వం మూలధన వ్యయానికి అధిక బడ్జెట్ కేటాయింపుల వంటి అంశాలు పెట్టుబడుల పక్రియ బలపడుతున్నట్లు సూచిస్తున్నాయి. ► అంతర్జాతీయంగా ముడి చమురు, ఆహార ధరలు మరింత పెరగకపోతే ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి వేగాన్ని కొనసాగించేంత బలంగా కనిపిస్తోంది. ► 2022, 2023 క్యాలెండర్ సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం సగటున వరుసగా 6.8 శాతం, 5.2 శాతంగా ఉంటుందని అంచనా. ► అనేక ప్రతికూల కారకాల కారణంగా 2022, 2023 ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం అంచనాలను పెంచాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. ► సరఫరాల సమస్యలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణించేట్లు చేస్తున్నాయి. ఆయా అంశాలతో సెంట్రల్ బ్యాంకులు కఠిన ద్రవ్య విధానానికి మొగ్గుచూపే పరిస్థితికి దారితీస్తున్నాయి. దీనితోపాటు ఆర్థిక మార్కెట్ అస్థిరత, ఆస్తుల రీప్రైసింగ్, కఠిన ద్రవ్యపరిస్థితుల వంటి అంశాలు ఎకానమీల మందగమనానికి ప్రధాన కారణం. ► మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. అనంతరం రికవరీకి పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా కనబడుతోంది. జీరో–కోవిడ్ విధానంతో చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. వచ్చే ఏడాదినాటికి ప్రధాన ద్రవ్యోల్బణం రేట్లు (శాతాల్లో) తగ్గుతాయని మేము భావిస్తున్నప్పటికీ, ధర స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. ఆయా అంశాలు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ► చైనా వృద్ధి రేటు 2022లో 4.5 శాతం, 2023లో 5.3 శాతం ఉంటాయని భావిస్తున్నాం. అమెరికా, బ్రిటన్ ఎకానమీల వృద్ధి రేటు దాదాపు 2.8 శాతంగా ఉంటుందని అంచనా. కట్టుతప్పిన ద్రవ్యోల్బణం... ఈ సంవత్సరం ప్రారంభం నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి నమోదవుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో నమోదుకావాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్టం 7.79 శాతానికి చేరడంతో జూన్ మొదటి వారంలో జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఎంపీసీ మరో దఫా రేట్ల పెంపు ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారం ఆర్బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. అయితే ఈ లెక్కలు తప్పే అవకాశాలు స్పష్టమవడంతో నేపథ్యంలో ఈ నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధాన మధ్యంతర కమిటీ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రెపో రేటును అనూహ్య రీతిలో 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ పాలసీ రేటు పెంపు ఇది. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది.వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల కాలంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. 4.4 శాతానికి రెపో రేటును పెంచడంతోపాటు వ్యవస్థలో నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వెనక్కు మళ్లే విధంగా... రెపో రేటుతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని కట్టడి చేసి తద్వారా ద్రవ్యోల్బణం స్పీడ్‌ను తగ్గించాలన్నది ఈ ఇన్‌స్ట్రమెంట్ల ప్రధాన ఉద్దేశ్యం. వచ్చే నెల్లో అరశాతం రేటు పెంపు ఖాయం బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ విశ్లేషణ ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జూన్‌లో జరిగే ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు రెపోను మరో 0.50 శాతం పెంచే అవకాశాలు అధికంగా ఉన్నాయని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ విశ్లేషించింది. అలాగే వృద్ధి రేటు అంచనాలనూ 7.2 శాతం నుంచి 7 శాతానికి కుదించే అవకాశం ఉందని పేర్కొంది. ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల బ్యాండ్‌ను 6.2–6.5 శాతం శ్రేణిగా సవరించే వీలుందని అంచనావేసింది. ద్రవ్యోల్బణం కట్టడి, మధ్య కాలిక ఆర్థిక స్థిరత్వం లక్ష్యాలుగా పాలసీ సమీక్ష ఉంటుందని అభిప్రాయపడింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)కట్టడి లక్ష్యంగా క్యాష్ రిజర్ రేషియో (సీఆర్ఆర్)ను మరో 0.50 శాతం పెంచే అవకాశం ఉందని తెలిపింది. బార్క్లేస్ విశ్లేషణలు నిజమైతే రెపో రేటు 4.90 శాతానికి, సీఆర్ఆర్ 5 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కట్టడి–వృద్ధి సమతౌల్యత ఆర్బీఐ ముందున్న ప్రస్తుత కీలకాంశమని వివరించింది. -
ఎంఅండ్ఏ డీల్స్ జోరు
ముంబై: ఈ క్యాలండర్ ఏడాది క్యూ1(జనవరి–మార్చి)లో దేశీయంగా విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) విభాగం జోరందుకుంది. తొలి క్వార్టర్లో 30.3 బిలియన్ డాలర్ల విలువైన ఎంఅండ్ఏ లావాదేవీలు జరిగాయి. ఇవి గత నాలుగేళ్లలోనే అత్యధికంకాగా.. పరిమాణం రీత్యా 29.6 శాతం జంప్‌చేశాయి. వెరసి 2018లో నమోదైన 31.1 బిలియన్ డాలర్లను అధిగమించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంఅండ్ఏ డీల్స్ క్షీణించగా.. దేశీ మార్కెట్లో ఊపందుకోవడం గమనార్హం! గతేడాది(2021) క్యూ1తో పోలిస్తే డీల్స్ విలువ 5.6 శాతం పుంజుకోగా.. పరిమాణం రీత్యా తొలి క్వార్టర్‌కు కొత్త రికార్డ్ నెలకొల్పాయి. ప్రపంచంలోనే ఫైనాన్షియల్ మార్కెట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణాంకాలు అందించడంలో టాప్ ర్యాంకులో ఉన్న ఎల్ఎస్ఈజీ బిజినెస్(రెఫినిటివ్) రూపొందించిన గణాంకాలివి. దేశీ కంపెనీలు ఎంఅండ్ఏ లావాదేవీలలో దేశీ కంపెనీల డీల్స్ 8.3 శాతం తగ్గి 23.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీ ఎంఅండ్ఏలు 24.5 శాతం క్షీణించి 12.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇన్‌బౌండ్(దేశంలోకి) డీల్స్ 18 శాతం ఎగసి 11.6 బిలియన్ డాలర్లను తాకాయి. 2017 తొలి క్వార్టర్ తదుపరి ఇవే అత్యధికం. విదేశాలలో 8.2 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌తో యూఎస్ అగ్రపథాన నిలవగా.. 39 శాతం జంప్‌చేశాయి. ఇన్‌బౌండ్ డీల్స్‌లో వీటి వాటా 70 శాతం! ఔట్‌బౌండ్(దేశం వెలుపలకు) డీల్స్ రెట్టింపునకుపైగా పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరాయి. 2010 తదుపరి ఇవి గరిష్టంకాగా.. 3.9 బిలియన్ డాలర్ల విలువైన 21 డీల్స్‌తో యూఎస్ టాప్‌లో నిలిచింది. ఇది 77 శాతం మార్కెట్ వాటాకు సమానం. బయోకాన్ డీల్ యూఎస్ సంస్థ వియాట్రిస్ ఇంక్‌కు చెందిన బయోసిమిలర్స్ బిజినెస్‌ను దేశీ కంపెనీ బయోకాన్ 3.335 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఇది అతిపెద్ద డీల్‌కాగా, యూఎస్ హెల్త్‌కేర్ విభాగంలోని ఔట్‌బౌండ్ డీల్స్‌లో సరికొత్త రికార్డుకావడం విశేషం! హైటెక్నాలజీ రంగంలో మెజారిటీ డీల్స్ జరిగాయి. వీటి మొత్తం విలువ 6.6 బిలియన్ డాలర్లు. గతేడాది క్యూ1తో పోలిస్తే రెట్టింపయ్యాయి. వీటి మార్కెట్ వాటా 21.8 శాతానికి సమానం. ఈ బాటలో హెల్త్‌కేర్ 4.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌తో 15.5 శాతం మార్కెట్ వాటాను సాధించింది. తదుపరి ఫైనాన్షియల్స్ 4.1 బిలియన్ డాలర్లతో 13.5 శాతం వాటాను పొందాయి. అయితే డీల్స్ విలువ 41 శాతానికిపైగా క్షీణించింది. 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా డీల్స్ కనిష్ట స్థాయికి చేరగా.. దేశీయంగా జోరందుకోవడం ప్రస్తావించదగ్గ అంశమని రెఫినిటివ్ సీనియర్ విశ్లేషకులు ఎలయిన్ ట్యాన్ పేర్కొన్నారు. పీఈ పెట్టుబడులు, నగదు నిల్వలు, చరిత్రాత్మక కనిష్టంలోని వడ్డీ రేట్లు వంటి కీలక అంశాలు ప్రభావం చూపినట్లు వివరించారు. పీఈ డీల్స్ పీఈ డీల్స్ భారీగా పెరిగి 9.8 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో హైటెక్నాలజీ విభాగం 28.7 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. అయితే ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్(ఈసీఎం) లావాదేవీలు 64 శాతంపైగా పడిపోయాయి. 2019 తదుపరి ఇవి కనిష్టంకాగా.. ఈసీఎం ఆఫరింగ్స్ 23.3 శాతం నీరసించాయి. దేశీయంగా ఐపీవో యాక్టివిటీ 57 శాతం తిరోగమించింది. వీటి సంఖ్య సైతం దాదాపు 15 శాతం తగ్గింది. క్యూ1లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పీజు 33.5 శాతం వెనకడుగుతో 179.7 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. 2016 తరువాత ఇది కనిష్టంకాగా.. అండర్‌రైటింగ్ 43 శాతంపైగా క్షీణించి 40.9 మిలియన్ డాలర్లను తాకింది. డెట్ క్యాపిటల్ మార్కెట్ అండర్‌రైటింగ్ పీజు 24 శాతం బలహీనపడి 2016 తరువాత కనిష్టంగా 49.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
స్టార్టప్స్‌లో పెట్టుబడుల దూకుడు
న్యూఢిల్లీ: దేశీయంగా స్టార్టప్‌లలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. గత కేలండర్ ఏడాది(2021)లో అత్యంత అధికంగా 42 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్టార్టప్‌లు సమీకరించాయి. అంతక్రితం ఏడాది(2020)లో సమకూర్చుకున్న 11.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి మూడు రెట్లుకంటే ఎక్కువకావడం విశేషం! దీంతో గతేడాది ఏకంగా 46 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా పిలిచే సంగతి తెలిసిందే. ఫలితంగా దేశంలో యూనికార్న్‌ల సంఖ్య 90కు చేరింది. 2021 దేశీ టెక్ యూనికార్న్ నివేదిక పేరుతో ఓరిస్ వెంచర్ పార్టనర్స్ రూపొందించిన వివరాలివి. వీటి ప్రకారం.. టాప్–3 ర్యాంక్.. గతేడాది బిలియన్ డాలర్ల విలువను సాధించిన కంపెనీల జాబితాలో షేర్‌చాట్, క్రెడ్, మీషో, నజారా, మాగ్లిక్స్, ఎంపీఎల్, గ్రోఫర్స్(బ్లింకిట్), అప్‌గ్రాడ్, మమాఎర్త్, గ్లోబల్బీస్, అకో, స్పిన్నీ తదితరాలు చోటు సాధించాయి. దీంతో ప్రపంచంలోనే అమెరికా(487), చైనా(301) తదుపరి భారత్ 90 యూనికార్న్‌లతో మూడో ర్యాంకులో నిలిచింది. వెరసి 39 యూనికార్న్‌లకు ఆవాసమైన యూకేను నాలుగో ర్యాంకులోకి నెట్టింది. 60,000 స్టార్టప్‌లకు నిలయంకావడం ద్వారా భారత్ మూడోపెద్ద స్టార్టప్ ఎకోవ్యవస్థగల దేశంగా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 13 యూనికార్న్‌లలో ఒకటి దేశీయంగానే ఊపిరి పోసుకుంటుండటం విశేషం! ఉపాధి సైతం భారీగా పుట్టుకొస్తున్న స్టార్టప్‌లు కొత్తతరహా సొల్యూషన్స్, సాంకేతికతలను అందించడమేకాకుండా భారీ స్థాయిలో ఉపాధి కల్పనకూ దారి చూపుతున్నాయి. దారి చూపుతున్నాయి. ఫిన్‌టెక్, ఈకామర్స్, ఎస్ఏఏఎస్(సాస్) విభాగాల నుంచి అత్యధికంగా స్టార్టప్‌లు ఆవిర్భవిస్తున్నాయి. వీటి తదుపరి హెల్త్‌టెక్, ఎడ్టెక్, డీ2సీ, గేమింగ్, క్రిప్టో విభాగాలు నిలుస్తున్నాయి. అత్యధిక స్టార్టప్‌లకు బెంగళూరు నెలవుకాగా.. విలువలో 37.6 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్ అగ్రపథాన్ని పొందింది.3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించడం ద్వారా గత జులైలో ఈ విలువను అందుకుంది. ఇక ఆరు నెలల్లోనే యూనికార్న్ హోదాను పొందిన సంస్థగామెన్సా బ్రాండ్స్ గుర్తింపు పొందింది. 2021 మే నెలలో 5 కోట్ల డాలర్లు సమకూర్చుకోవడంతో ఈ విలువను సాధించింది. డెకాకార్న్లు.. 10 బిలియన్ డాలర్లు అంతకుమించిన విలువను అందుకున్న కంపెనీలను డెకాకార్న్‌లుగా వ్యవహరిస్తుంటారు. దేశీయంగా ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, బైజూస్, ఓయో రూమ్స్ డెకాకార్న్‌లుగా ఆవిర్భవించాయి. గతేడాది అత్యధికంగా 11 స్టార్టప్‌లు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. వీటిలో 8 యూనికార్న్ సంస్థలుండటం గమనార్హం! ఐపీవోల ద్వారా 7.16 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్నాయి. వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) కొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 18,300 కోట్లు(2.46 బిలియన్ డాలర్లు) అందుకుంది. మరోపక్క జొమాటో 14.8 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)తో చరిత్ర సృష్టించింది. ఈ బాటలో నైకా 13.5 బిలియన్ డాలర్లు, ఫ్రెష్‌వర్క్స్ 6.9 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించడం విశేషం! మహిళలూ.. యూనికార్న్‌ల వ్యవస్థాపకుల్లో 20 శాతం నాన్ఇంజినీర్స్కాగా.. దాదాపు 67 శాతంవరకూ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఎస్బీ నుంచి ఒకరు లేదా అంతకుమించిన వ్యక్తులున్నారు. జాబితాలో 13 మంది మహిళా వ్యవస్థాపకులకు చోటు లభించగా.. 2021లోనే 8 మంది ఈ హోదాను సాధించారు. వీరిలో ఫాల్గుణి నాయర్(నైకా), గజల్ కల్రా(రివిగో), రుచీ కల్రా(ఆఫ్‌బిజినెస్), దివ్యా గోకుల్‌నాథ్(బైజూస్), ఘజల్ అలఘ్(మమాఎర్త్), సరితా కటికనేని(జెనోటీ) తదితరులున్నారు. -
ఎదురులేని వెర్స్టాపెన్
జాండ్వోర్ట్: సొంత ప్రేక్షకుల మధ్య రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్‌కు తిరుగులేకుండా పోయింది. 36 ఏళ్ల విరామం తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1) క్యాలెండర్లో పునరాగమనం చేసిన డచ్ గ్రాండ్‌ప్రిలో ఈ నెదర్లాండ్స్ డ్రైవరే విజేతగా నిలిచాడు. 72 ల్యాప్‌ల పాటు ఆదివారం జరిగిన ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ఆరంభించిన వెర్స్టాపెన్ ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. ల్యాప్ ల్యాప్‌కు ఆధిక్యాన్ని పెంచుకుంటూ గమ్యాన్ని అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 05.395 సెకన్లలో చేరుకుని విన్నర్‌గా నిలిచాడు. సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది ఏడో విజయం కాగా... ఓవరాల్‌గా 17వది. 20.932 సెకన్లు వెనుకగా రేసును ముగించిన హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో నిలిచాడు. మరో మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా గ్యాస్లీ (ఆల్ఫా టారీ), లెక్లెర్క్ (ఫెరారీ) నిలిచారు. తాజా విజయంతో వెర్స్టాపెన్ డ్రైవర్ చాంపియన్íÙప్లో మళ్లీ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం అతడు 224.5 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. మూడు పాయింట్ల తేడాతో హామిల్టన్ (221.5) రెండో స్థానంలో ఉన్నాడు. -
కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన ధావన్
బ్రిస్బేన్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. బుధవారం జరిగన తొలి టీ20లో కోహ్లి సేన 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే వెస్టిండీస్ సిరీస్‌లో దారణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో మెరిశాడు. లక్ష్యచేదనలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సారథ విరాట్ కోహ్లిలు విఫలమైనా ధావన్(42 బంతుల్లో 76; 10ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ శతకంతో రాణించాడు. అయితే ఆసీస్‌పై ఆడిన చక్కటి ఇన్నింగ్స్‌కు ధావన్ ఖాతాలో సరికొత్త రికార్డు చేరింది. (ఆసీస్ 158, భారత్ 169.. విజేత?) టీ20ల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు(648, 2018లో) చేసిన ఆటగాడిగా ధావన్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు పొట్టి ఫార్మట్ క్రికెట్లో ఒక క్యాలెండ్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి (641 పరుగులు, 2016లో) పేరిట ఉన్న రికార్డును తాజాగా ధావన్ అధిగమించాడు. ఇక 2018లో టీ20 ఫార్మట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఫఖర్ జామన్ (576), రోహిత్ శర్మ(567), బాబర్ అజామ్ (563)లు ధావన్ తర్వాతి స్థానాలలో ఉన్నారు. (ఆసీస్ చేతిలో అనూహ్య పరాజయం) -
మహిళా మణులదే పైచేయి
ఏలూరు (మెట్రో) : ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 15 నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. గత ఏడాది జనవరి 1న తుది జాబితాను ప్రకటించగా.. 2017 సంవత్సరానికి సంబంధించిన జాబితాను సోమవారం ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో 2,30,177 మంది ఓటర్లు పెరిగారు. దీంతోపాటు ఈ ఏడాది 30,426 మంది మహిళా ఓటర్లు పెరిగారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మహిళలే అగ్రస్థానంలో ఉన్నారు. వ్యత్యాసం ఇలా గత ఏడాది జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 26,12,204 కాగా, అందులో 14,35,582 మంది పురుషులు ఉన్నారు. మహిళా ఓటర్లు 11,76,391 మంది. ఆ ఏడాది ఇతర ఓటర్లు (హిజ్రాలు) 231 మంది. ఈ ఏడాది మొత్తం ఓటర్లు 28,42,381 మంది కాగా, ఇందులో పురుషులు 14,04,958 మంది కాగా, మహిళలు 14,37,162 మంది. ఇతరుల జాబితాలో మరో 30 మంది పెరగ్గా, వారి సంఖ్య 261కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 30,624 మంది పురుషు ఓటర్లు తగ్గారు. గత ఏడాదితో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య 2,60,771 పెరిగింది. చింతలపూడి నియోజకవర్గంలో అత్యధికంగా 2,35,379 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా నరసాపురంలో 1,52,489 మంది ఓటర్లు మాత్రమే నమోదయ్యారు. తణుకు నియోజకవర్గంలో ఇతరుల జాబితాలో ఒక్క ఓటరు కూడా నమోదుకాకపోగా, భీమవరం నియోజకవర్గంలో 103 ఇతరుల జాబితాలో తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిలా నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం కొవ్వూరు 75,282 77,349 06 1,52,641 నిడదవోలు 89,826 91,794 18 1,81,638 ఆచంట 75,039 76,354 01 1,51,394 పాలకొల్లు 82,201 83,400 09 1,65,610 నరసాపురం 75,985 76,496 08 1,52,489 భీమవరం 1,08,452 1,11,954 103 2,20,509 ఉండి 96,655 97,528 16 1,94,199 తణుకు 1,01,233 1,06,329 00 2,07,562 తాడేపల్లిగూడెం 90,786 93,615 11 1,84,412 ఉంగుటూరు 88,907 89,191 09 1,78,107 దెందులూరు 96,082 97,677 07 1,93,766 ఏలూరు 90,935 97,276 24 1,88,235 గోపాలపురం 1,05,898 1,05,714 13 2,11,625 పోలవరం 1,10,304 1,14,497 14 2,24,815 చింతలపూడి 1,17,369 1,17,988 22 2,35,379 మొత్తం 14,64,958 14,37,162 261 28,42,381