ముంబై: ప్రస్తుత కేలండర్ ఏడాది(2023) తొలి త్రైమాసికంలో డీల్స్ 35 శాతం క్షీణించినట్లు గ్రాంట్ థార్న్‌టన్ నివేదిక పేర్కొంది. జనవరి–మార్చి(క్యూ1)లో 9.7 బిలియన్ డాలర్ల విలువైన 332 లావాదేవీలు జరిగినట్లు తెలియజేసింది. ప్రపంచ ఆర్థిక మాంద్య భయాలు, కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం డీల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపినట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం మొత్తం డీల్స్‌లో సగభాగానికిపైగా ఆక్రమించిన విలీనాలు, కొనుగోళ్లు(ఎంఅండ్‌ఏ) విలువ 21 శాతం నీరసించి 4.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
46 శాతం తక్కువగా 76 డీల్స్ నమోదయ్యాయి. ప్రధానంగా ఐపీవో మార్కెట్ క్షీణించడం ప్రభావం చూపింది. 2022 క్యూ1లో బిలియన్ డాలర్లు నమోదుకాగా.. తాజా సమీక్షా కాలంలో 84.4 మిలియన్ డాలర్లకు తగ్గింది. మరోపక్క క్విప్ విభాగంలో స్పైస్‌జెట్ కార్గో లాజిస్టిక్స్ బిజినెస్ 30.1 కోట్ల డాలర్లు, డేటా ప్యాటర్న్స్ 6 కోట్ల డాలర్లు చొప్పున సమీకరించాయి. అయితే 2022 క్యూ1లో 54.1 కోట్ల డాలర్ల సమీకరణతో పోలిస్తే తక్కువే. కాగా.. మొత్తం డీల్స్‌లో స్టార్టప్ రంగం వాటా 22 శాతంకాగా.. 6.9 కోట్ల డాలర్ల విలువైన 17 లావాదేవీలు జరిగాయి. అయితే ఇవి 2022 క్యూ1తో పోలిస్తే 71 శాతం క్షీణించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment