Grant Thornton
-
గేమింగ్ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధితో రూ.23,100 కోట్లకు చేరుకుంటుందని గ్రాంట్ థాంటన్ భారత్, ఈ–గేమింగ్ ఫెడరేషన్ నివేదిక వెల్లడించింది. అయిదేళ్లలో ఈ రంగం దేశ, విదేశ ఇన్వెస్టర్ల నుంచి 2.8 బిలియన్ డాలర్ల నిధులను అందుకుందని వివరించింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం ఆన్లైన్ గేమర్స్ సంఖ్య దేశంలో 44.2 కోట్లకు చేరుకుందని తెలిపింది. సంఖ్య పరంగా చైనాను మించిపోయినట్టు వివరించింది. భారత్‌లోని డైనమిక్ గేమింగ్ పరిశ్రమ శక్తివంతమైన యువ జనాభా ద్వారా ఆజ్యం పోసిందని.. అపూర్వ వృద్ధికి సిద్ధంగా ఉందని నివేదిక పేర్కొంది. 2021–22లో సగటున ఒక్కో గేమర్ ప్రతి వారం ఎనమిదిన్నర గంటల సమయం వెచి్చంచారు. ప్రధాన ఆదాయ వనరు.. రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) విభాగం పరిశ్రమలో ప్రధాన ఆదాయ వనరులలో ఒకటిగా అభివృద్ధి చెందుతోందని నివేదిక వివరించింది. ‘భారత్‌లోని ఆర్ఎంజీ రంగం 2023లో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ప్రభుత్వం 28 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు చేయడం ఈ రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. పన్ను భారం కారణంగా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు, కొన్ని స్టార్టప్‌లు మూసివేయడానికి దారితీసింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ గేమింగ్ పరిశ్రమ ఆదాయంలో ఆర్ఎంజీ రంగం 83–84 శాతం వాటాను కొనసాగిస్తోంది. ఈ విభాగంలో ప్రతిరోజూ డబ్బులు చెల్లించి ఆడుతున్న 9 కోట్ల మందితోసహా మొత్తం సుమారు 10 కోట్ల మంది ఆన్లైన్ గేమర్లు ఉన్నారు. ఈ స్థాయి గేమర్ల కారణంగా పరిశ్రమ విస్తరణ కొనసాగుతుంది. మొత్తం దీర్ఘకాలిక వృద్ధిపై పన్ను ప్రభావం పరిమితంగా ఉంటుంది. 28 శాతం జీఎస్టీ ప్రభావం తర్వాత కూడా పరిశ్రమలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలంగా ఉంది. నమోదవుతున్న లావాదేవీలు ఆర్ఎంజీ విభాగం స్థిర వృద్ధిపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి’ అని నివేదిక తెలిపింది. సమగ్ర ప్రవర్తనా నియమావళి.. ఈ–గేమింగ్ ఫెడరేషన్ సమగ్ర ప్రవర్తనా నియమావళిని ఈ సందర్భంగా విడుదల చేసింది. జవాబుదారీతనం, పారదర్శకతను నిర్ధారించడానికి నైతిక ప్రవర్తనకు స్పష్టమైన ప్రమాణాలను పొందుపరిచింది. సైబర్ బెదిరింపులు, నియంత్రణ అనిశి్చతులు, ఆర్థిక ప్రమాదాల వంటి కీలక ప్రమాదాలను ప్రవర్తనా నియమావళి పరిష్కరిస్తుందని గేమింగ్ ఫెడరేషన్ తెలిపింది. ఈ సవాళ్లను తగ్గించడానికి, పరిశ్రమ యొక్క స్థిరత్వం, వృద్ధిని నిర్ధారించడానికి ఉత్తమ అభ్యాసాలను అందిస్తుందని వివరించింది. స్వీయ–నియంత్రణను పెంపొందించడానికి, పరిశ్రమ ఉన్నతంగా ప్రమాణాలను నిర్వహించడానికి థర్డ్ పార్టీ ధృవీకరణ అవసరమని నివేదిక స్పష్టం చేసింది. సైబర్ బెదిరింపులు, మోసం, ఇతర అన్యాయమైన పద్ధతుల నుండి గేమర్స్‌ను రక్షించడానికి బలమైన నియంత్రణ యంత్రాంగాలు ఉండాలని అభిప్రాయపడింది. -
జూలైలో కార్పొరేట్ డీల్స్ 3.1 బిలియన్ డాలర్లు
ముంబై: కార్పొరేట్ డీల్స్ (ఒప్పందాలు) విలువ జూలై నెలలో 58 శాతం పెరిగి 3.1 బిలియన్ డాలర్లుగా (రూ.25,730 కోట్లు) నమోదైంది. మొత్తం మీద డీల్స్ సంఖ్య తగ్గింది. ఈ వివరాలను గ్రాంట్ థార్న్టన్ విడుదల చేసింది. జూలైలో మొత్తం 3.1 బిలియన్ డాలర్ల కార్పొరేట్ ఒప్పందాలు నమోదయ్యాయి. విలువ పరంగా 58 శాతం పెరిగినా, సంఖ్యా పరంగా చూస్తే 46 శాతం తగ్గాయి. అంతర్జాతీయంగా మందగమనం కార్పొరేట్ డీల్స్‌పై ప్రభావం చూపించినట్టు గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ శాంతి విజేత తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి కార్పొరేట్ డీల్స్ విభాగంలో స్తబ్ధత ఉన్నట్టు చెప్పారు. సీమాంతర లావాదేవీలు డీల్స్ విలువ పెరగడానికి దోహదపడినట్టు చెప్పారు. అదే సమయంలో ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లలో అప్రమత్తత ఉండడంతో డీల్స్ సంఖ్య తగ్గినట్టు తెలిపారు. ముఖ్య డీల్స్.. ► 29 డీల్స్ విలువ 2 బిలియన్ డాలర్లుగా ఉంది. ► రూట్ మొబైల్లో 58 శాతం వాటా కొనుగోలుకు 721 మిలియన్ డాలర్లతో ప్రాక్సిమస్ ఓపల్ కుదుర్చుకున్న డీల్ అతిపెద్దదిగా ఉంది. ► అదానీ క్యాపిటల్, అదానీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 90 శాతం వాటా కొనుగోలుకు బెయిన్ క్యాపిటల్ 176 మిలియన్ డాలర్లతో డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. ► నాలుగు క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) విలువ 668 మిలియన్ డాలర్లుగా ఉంది. -
క్యూ1లో 35 శాతం తగ్గిన డీల్స్
ముంబై: ప్రస్తుత కేలండర్ ఏడాది(2023) తొలి త్రైమాసికంలో డీల్స్ 35 శాతం క్షీణించినట్లు గ్రాంట్ థార్న్టన్ నివేదిక పేర్కొంది. జనవరి–మార్చి(క్యూ1)లో 9.7 బిలియన్ డాలర్ల విలువైన 332 లావాదేవీలు జరిగినట్లు తెలియజేసింది. ప్రపంచ ఆర్థిక మాంద్య భయాలు, కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం డీల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపినట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం మొత్తం డీల్స్‌లో సగభాగానికిపైగా ఆక్రమించిన విలీనాలు, కొనుగోళ్లు(ఎంఅండ్ఏ) విలువ 21 శాతం నీరసించి 4.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. 46 శాతం తక్కువగా 76 డీల్స్ నమోదయ్యాయి. ప్రధానంగా ఐపీవో మార్కెట్ క్షీణించడం ప్రభావం చూపింది. 2022 క్యూ1లో బిలియన్ డాలర్లు నమోదుకాగా.. తాజా సమీక్షా కాలంలో 84.4 మిలియన్ డాలర్లకు తగ్గింది. మరోపక్క క్విప్ విభాగంలో స్పైస్‌జెట్ కార్గో లాజిస్టిక్స్ బిజినెస్ 30.1 కోట్ల డాలర్లు, డేటా ప్యాటర్న్స్ 6 కోట్ల డాలర్లు చొప్పున సమీకరించాయి. అయితే 2022 క్యూ1లో 54.1 కోట్ల డాలర్ల సమీకరణతో పోలిస్తే తక్కువే. కాగా.. మొత్తం డీల్స్‌లో స్టార్టప్ రంగం వాటా 22 శాతంకాగా.. 6.9 కోట్ల డాలర్ల విలువైన 17 లావాదేవీలు జరిగాయి. అయితే ఇవి 2022 క్యూ1తో పోలిస్తే 71 శాతం క్షీణించడం గమనార్హం. -
ఈ తరహా కార్లను కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు..ఎందుకంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత కార్ల మార్కెట్ 2025–26 నాటికి దేశంలో 82 లక్షల యూనిట్లకు చేరుతుందని గ్రాంట్ థాంటన్ భారత్ తన నివేదికలో తెలిపింది. ‘2020–21లో ఈ సంఖ్య 40 లక్షల యూనిట్లుగా ఉంది. చిన్న పట్టణాల నుంచి డిమాండ్, నూతన వాహనాల ధరలు పెరుగుతుండడం, వినియోగదార్లలో వస్తున్న ధోరణి వెరశి పాత కార్ల జోరుకు కారణం. 14.8 శాతం వార్షిక వృద్ధితో 2030 నాటికి పరిశ్రమ విలువ రూ.5.3 లక్షల కోట్లకు చేరుతుంది. కొత్త కారుతో పోలిస్తే పాత వాహనం కొనుగోలు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. 2020–21లో కొత్త వాహన వ్యవస్థ ఆర్థిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక మార్పులను చూసింది. అదే సమయంలో వినియోగదార్ల ప్రాధాన్యతలలో మార్పు పాత కార్ల మార్కెట్‌ను వృద్ధి మార్గంలో వేగంగా నడిపించింది. ప్రస్తుతం పాత కారు కొనేందుకు కస్టమర్లు ఎప్పుడూ లేనంత ఉత్సాహం చూపిస్తున్నారు. చిన్న పట్టణాలు పరిశ్రమను ముందుకు నడిపిస్తాయి. మెట్రోయేతర ప్రాంతాల వాటా ప్రస్తుతమున్న 55–70 శాతానికి చేరుతుంది. కొత్త కార్లతో పోలిస్తే 2024–25 నాటికి పాత కార్ల మార్కెట్ రెండింతలు ఉండనుంది’ అని నివేదిక వివరించింది. చదవండి: 2021లో విడుదలైన దిగ్గజ కంపెనీల టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..! -
3 శాతం పెరిగి, జులైలో కార్పొరేట్ డీల్స్ రూ.97,680 కోట్లు
ముంబై: దేశీయంగా కార్పొరేట్ డీల్స్ (ఒప్పందాలు) జూలై నెలలో 3 శాతం పెరిగి 13.2 బిలియన్ డాలర్లు (రూ.97,680 కోట్లు)గా నమోదైనట్టు గ్రాంట్ థార్న్టన్ భారత్ ఓ నివేదిక రూపంలో తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3 శాతం పెరగ్గా.. ఈ ఏడాది జూన్ నెలతో పోలిస్తే 6 శాతం పురోగతి కనిపించింది. కరోనా తర్వాత కంపెనీలు తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగా చౌకగా నిధులు సమీకరించడంతోపాటు.. నగదు నిల్వలను ఖర్చు పెట్టడంపై దృష్టి సారించినట్టు గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ శాంతి విజేత తెలిపారు. రానున్న నెలల్లోనూ ఒప్పందాలు సానుకూలంగానే ఉంటాయని అంచనా వేశారు. జూలై నెలలో విలీనాలు, కొనుగోళ్లకు సంబంధించి (ఎంఅండ్ఏ) 36 ఒప్పందాలు నమోదయ్యాయి. వీటి విలువ 5.6 బిలియన్ డాలర్లుగా ఉంది. సంఖ్యా పరంగా చూస్తే 13 శాతం పెరిగాయి. కానీ విలువ పరంగా ఎంఅండ్ఏ ఒప్పందాల విలువ 37 శాతం తగ్గింది. ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులకు సంబంధించి 145 ఒప్పందాలు నమోదు కాగా.. వీటి విలువ 7.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐటీ సొల్యూషన్స్, ఈ కామర్స్, కన్జ్యూమర్ రిటైల్, డిజిటల్ హెల్త్‌కేర్, ఫిన్‌టెక్, ఎడ్టెక్ కంపెనీల విభాగాల్లో లావాదేవీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లు పెరగడం, నగదు లభ్యత అధికంగా ఉండడం, కరోనా కారణంగా ప్రయోజనం పొందే రంగాల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడం సానుకూలించినట్టు గ్రాంట్ థార్న్టన్ పేర్కొంది. చదవండి: భవిష్యత్తులో ఏం జరుగుతుందో, కనిపెట్టే పనిలో అమెరికా -
ఐఎల్ఎఫ్ఎస్లో 13 వేల కోట్ల అవకతవకలు
న్యూఢిల్లీ: ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపులో రూ.13,000 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నట్టు గ్రాంట్ థార్న్టన్ సంస్థ ఆడిట్లో వెలుగుచూసింది. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపునకు 24 డైరెక్ట్ సబ్సిడరీలతోపాటు, 135 పరోక్ష సబ్సిడరీలున్నాయి. అలాగే, ఆరు జాయింట్ వెంచర్ కంపెనీలు, నాలుగు అసోసియేట్ కంపెనీలతో కూడిన ఈ గ్రూపునకు రూ.94,000 కోట్ల రుణ భారం ఉంది. మంజూరైన రుణాలను గ్రూపు కంపెనీలు అప్పటికే ఉన్న రుణాల చెల్లింపులకు 29 సందర్భాల్లో వినియోగించినట్టు ఆడిటింగ్‌లో తేలింది. ఈ మొత్తం రూ.2,502 కోట్లు అని గ్రాంట్ థార్న్టన్ నివేదిక పేర్కొంది. 2013 ఏప్రిల్ 1 నుంచి 2018 సెప్టెంబర్ 30 వరకు జరిగిన అధిక విలువ లావాదేవీలను ఈ నివేదిక ప్రస్తావించింది. రిస్క్ టీమ్ ప్రతికూల అంచనాలను పేర్కొన్నప్పటికీ రూ. 2,400 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేయ డం జరిగినట్టు పేర్కొంది. అక్రమంగా జరిగిన పలు లావాదేవీల మొత్తం రూ.13,290 కోట్లని వెల్లడించింది. స్వల్పకాల అవసరాల కోసం తీసుకున్న రూ.541 కోట్ల రుణాలను దీర్ఘకాల అవసరాల కోసం వినియోగించినట్టు ఈ సంస్థ గుర్తించింది. ‘‘అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశ వివరాలను సమీక్షించడం ద్వారా నిధుల్లో అంతరాలను గుర్తించాం. ఈ వివరాల ఆధారంగా చూస్తే 2013 మే నుంచి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అప్పటికే తీసుకున్న రుణాల చెల్లింపుల కోసం మరిన్ని రు ణాలను తీసుకునే ఒత్తిడిలో ఉందని తెలిసింది’’ అని గ్రాంట్ థార్న్టన్ నివేదిక పేర్కొంది. 2018 జూలైలో నిధుల పరంగా మరింత ఎక్కువ అంతర ం ఉందని తెలిపింది. ఐఎల్ఎఫ్ఎస్ చైర్మన్ రవి పార్థసార«థి 2018 జూలై 21న రాజీనామా చేయ డం గమనార్హం. గతేడాది ఆగస్టు నుంచి ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు రుణ చెల్లింపులు చేయలేకపోవడంతో అక్రమాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. -
వ్యాపారాల్లో మహిళా నాయకత్వం పెరుగుతోంది
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీల్లో నాయకత్వ స్థానాల్లో మహిళల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదిక పేర్కొంది. లింగ సమానత్వానికి సంబంధించి భారత్ ర్యాంకింగ్ ఇంకా అట్టడుగునే ఉన్నప్పటికీ, క్రమంగా మెరుగుపడుతోందని తెలిపింది. అత్యున్నత స్థానాల్లో మహిళలు 2018లో 20 శాతానికి పెరిగారని గ్రాంట్ థార్న్టన్ ‘వ్యాపారాల్లో మహిళలు: ప్రగతి దిశగా విధానాలు’ పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2017లో ఈ పరిమాణం 17 శాతంగా ఉంది. ఇక 2014లో 14 శాతం మాత్రమే. గతేడాది జూలై–డిసెంబర్ మధ్య 35 దేశాల్లో మధ్య స్థాయి వ్యాపార సంస్థలకు చెందిన దాదాపు 4,995 మంది సీఈఓలు, ఎండీలు, ఇతరత్రా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను తయారు చేసింది. ఇప్పటికీ తమ సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో మహిళలు లేరని సర్వేల్లో పాల్గొన్న 30 శాతం భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పడం గమనార్హం. భారత్‌లో వ్యాపారాలను నడిపిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోందని. అయితే, ఈ పెరుగుదల చాలా నెమ్మదిగా ఉందని గ్రాంట్ థార్న్టన్ అడ్వయిజరీకి చెందిన కవితా మాథుర్ పేర్కొన్నారు. దేశీ వ్యాపార సంస్థల్లో స్త్రీ, పురుష సమానత్వానికి సంబంధించిన విధానాలు మెరుగ్గానే ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది. భారత్‌లోని దాదాపు 64 శాతం వ్యాపార సంస్థలు ఒకే పనికి సంబంధించి మహిళలు, పురుషులకు సమాన వేతనాలను ఇస్తున్నాయని.. అదేవిధంగా నియామకాల్లో కూడా 55 శాతం సంస్థలు వివక్షకు తావులేని విధానాలను అనుసరిస్తున్నాయని వివరించింది. కాగా, నాయకత్వ స్థానాల్లో మహిళలకు సంబంధించి సమానత్వాన్ని తీసుకురావాలంటే ప్రభుత్వం చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని సర్వేలో పాల్గొన్న 57 శాతం భారతీయ వ్యాపార సంస్థలు పేర్కొన్నాయి. -
మహిళా లీడర్‌షిప్‌లో చివరి మూడో స్థానంలో భారత్
న్యూఢిల్లీ: మహిళా లీడర్‌ఫిఫ్‌లో ప్రపంచంలో భారత్ చివరి నుంచి మూడో ర్యాంకు పొందింది. 47 శాతం మహిళలు ఉన్నత పదవులు నిర్వహిస్తుండటంతో రష్యా తొలి ర్యాంకు సాధించింది. గ్రాంట్ తోర్నటన్ సర్వే కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో మహిళలు ఉన్నత పదవుల్లో ఉండటాన్ని పరిగణలోకి తీసుకొని ర్యాంకులు ప్రకటించింది. రష్యా (47%), ఇండోనేషియా(46%), ఎస్టోనియా (40%)లు వరుసుగా మూడు ర్యాంకులు సాధించాయి. ర్యాంకుల్లో భారత్ ముందు అర్జెంటీనా (15%) తర్వాత జపాన్ (7%)లు ఉన్నాయి. ఈ సర్వేలో 5,500 వ్యాపారాలు, 36 ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నత పదవుల్లో మహిళల పాత్రలను పరిశీలించారు. గత సంవత్సరం కన్నా 7 శాతం మహిళలు ఉన్నత పదువుల్లో ఉండటం పెరిగిందని సర్వేలో తేలిపారు. ఈ సర్వేలో భారత్‌లో కేవలం 7 శాతం మహిళలే ఉన్నత పదవుల్లో పనిచేస్తున్నారని, ఎక్కువ శాతం హెచ్ఆర్, కార్పోరేట్ కంట్రోలర్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. లింగ వివక్ష లేనపుడే మహిళలు ఉన్నత పదవులు నిర్వహిస్తారనే విషయాన్ని తోర్నటన్ సర్వేకంపెనీ ప్రస్తావించింది. తూర్పు ఐరోపాలో 37 శాతం మహిళలు ఉన్నత పదవులు నిర్వహిస్తున్నారని, కేవలం 9 శాతం మహిళలే ఉన్నత పదవుల్లో లేరని చెప్పారు. మెక్సికో, నైజీరియా, ఇండోనేషియా, టర్కీలు ఈ విషయంలో మెరుగుదల కనబర్చాయని సర్వేలో పేర్కొన్నారు. -
‘స్మార్ట్’గా కొనేస్తున్నారు..
- వచ్చే ఏడాదికల్లా స్మార్ట్ఫోన్లతో షాపింగ్ 4 కోట్ల డాలర్లకు... - అసోచాం, గ్రాంట్ థార్న్టన్ నివేదిక ముంబై: స్మార్ట్ఫోన్ల ద్వారా జరిపే ఆన్లైన్ కొనుగోలు లావాదేవీలు 2016 నాటికి 4 కోట్ల డాలర్లకు చేరనున్నాయి. ప్రస్తుతం ఇది 3 కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. పరిశ్రమల సమాఖ్య అసోచాం, కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం వచ్చే మూడేళ్లలో మరో 20 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. వీరిలో చాలా మంది స్మార్ట్ఫోన్ల ద్వారానే నెట్‌కు చేరువ కానున్నారు. అంతర్జాతీయంగా ఈ-కామర్స్ మార్కెట్లో ఆన్లైన్ ట్రావెల్ వ్యాపార విభాగం వాటా తక్కువగానే ఉన్నప్పటికీ భారత ఈ-కామర్స్ మార్కెట్లో మాత్రం దీనిదే సింహభాగం కానుంది. ఆన్లైన్ లావాదేవీలు జరిపే వారి సంఖ్య 2011లో 1.1 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాదికి ఈ సంఖ్య 3.8 కోట్లకు పెరగనుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. నెట్‌ను ఉపయోగిస్తున్న వారిలో 75 శాతం మంది 15-34 సంవత్సరాల మధ్య వయస్సు గలవారై ఉంటున్నారు. దేశీ ఈకామర్స్‌లో ఆన్లైన్ ట్రావెల్ వాటా 71 శాతంగా ఉంది. 2009-2013 మధ్య ఇది ఏటా 32 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. మరోవైపు, సంఘటిత రిటైల్ అమ్మకాల్లో ఆన్లైన్ రిటైలింగ్ వాటా కేవలం 8.7 శాతమే ఉంది. ఇక మొత్తం రిటైల్ అమ్మకాల్లో దీని వాటా 0.3 శాతమే. 2013లో ఈ-కామర్స్ మార్కెట్లో 26 శాతంగా ఉన్న మహిళల వాటా 2016 నాటికి 35 శాతానికి పెరగనుంది. భారత్‌లో 4,000-5,000 నగరాలు, పట్టణాల్లో ఆన్లైన్ రిటైలింగ్‌కు భారీ డిమాండ్ ఉంది. భారీ రియల్ ఎస్టేట్ వ్యయాల కారణంగా సంఘటిత రిటైల్ రంగం అంచనాలకు అనుగుణమైన స్థాయిలో విస్తరణ చేపట్టలేకపోతున్నాయని నివేదిక వివరించింది. భారత ఈ-కామర్స్ మార్కెట్ 63 శాతం వార్షిక వృద్ధితో 2016 నాటికి 8.5 బిలియన్ డాలర్లకు చేరగలదని పేర్కొంది. -
ఈ ఏడాది విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ అప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2014) తొలి ఐదు నెలల్లో విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) డీల్స్ భారీగా పుంజుకున్నాయి. వెరసి జనవరి నుంచి మే వరకూ 16.37 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. ఇందుకు ఒక్క మే నెలలోనే 4.4 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ జరగడం దోహదపడింది. మేలో మొత్తం 52 లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో అంటే 2013 మే నెలలో 1.7 బిలియన్ డాలర్ల విలువైన 44 లావాదేవీలు మాత్రమే నమోదయ్యాయి. కాగా, జనవరి-మే కాలంలో అత్యధికంగా 230 డీల్స్ జరిగాయి. 2013 ఇదే కాలంలో 216 లావాదేవీలు నమోదుకాగా, వీటి విలువ 8.71 బిలియన్ డాలర్లు మాత్రమే. గ్రాంట్ థార్న్టన్ ఇండియా పార్టనర్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. 100 మిలియన్ డాలర్ల డీల్స్: మే నెలలో 100 మిలియన్ డాలర్ల డీల్స్ 8 జరిగాయి. వీటిలో ఒక్కొక్కటీ 500 మిలియన్ డాలర్ల విలువైన మూడు డీల్స్ ఉన్నాయి. కాగా, ఈ విభాగంలో మరోవైపు దేశీ కంపెనీల విదేశీ లావాదేవీలు సైతం పుంజుకోవడం గమనార్హం. మే నెలలో ప్రధానంగా అదానీ పోర్ట్స్ డీల్ చెప్పుకోదగ్గది. ధామ్రా పోర్ట్‌ను 932 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. యునెటైడ్ స్పిరిట్స్‌కు చెందిన వైట్ అండ్ మెకేను ఫిలిప్పీన్స్‌కు చెందిన ఎంపెరేడర్ 725 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. ఇక రిలయన్స్-నెట్వర్క్18 మధ్య జరిగిన డీల్ విలువ 678 మిలియన్ డాలర్లుకాగా, టాటా కమ్యూనికేషన్స్‌కు చెందిన నియోటెల్‌లో 68% వాటాను వొడాకామ్ కొనుగోలు చేసింది. ఇందుకు 455 మిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇదే విధంగా వదీనర్ పవర్లో 74% వాటాను ఎస్సార్ ఆయిల్ 356 మిలియన్ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకుంది.