న్యూఢిల్లీ: ఐఎల్‌ఎఫ్‌ఎస్ గ్రూపులో రూ.13,000 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నట్టు గ్రాంట్ థార్న్‌టన్ సంస్థ ఆడిట్‌లో వెలుగుచూసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్ గ్రూపునకు 24 డైరెక్ట్ సబ్సిడరీలతోపాటు, 135 పరోక్ష సబ్సిడరీలున్నాయి. అలాగే, ఆరు జాయింట్ వెంచర్ కంపెనీలు, నాలుగు అసోసియేట్ కంపెనీలతో కూడిన ఈ గ్రూపునకు రూ.94,000 కోట్ల రుణ భారం ఉంది. మంజూరైన రుణాలను గ్రూపు కంపెనీలు అప్పటికే ఉన్న రుణాల చెల్లింపులకు 29 సందర్భాల్లో వినియోగించినట్టు ఆడిటింగ్‌లో తేలింది. ఈ మొత్తం రూ.2,502 కోట్లు అని గ్రాంట్ థార్న్‌టన్ నివేదిక పేర్కొంది. 2013 ఏప్రిల్ 1 నుంచి 2018 సెప్టెంబర్ 30 వరకు జరిగిన అధిక విలువ లావాదేవీలను ఈ నివేదిక ప్రస్తావించింది. రిస్క్ టీమ్ ప్రతికూల అంచనాలను పేర్కొన్నప్పటికీ రూ. 2,400 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేయ డం జరిగినట్టు పేర్కొంది.
అక్రమంగా జరిగిన పలు లావాదేవీల మొత్తం రూ.13,290 కోట్లని వెల్లడించింది. స్వల్పకాల అవసరాల కోసం తీసుకున్న రూ.541 కోట్ల రుణాలను దీర్ఘకాల అవసరాల కోసం వినియోగించినట్టు ఈ సంస్థ గుర్తించింది. ‘‘అస్సెట్ లయబిలిటీ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశ వివరాలను సమీక్షించడం ద్వారా నిధుల్లో అంతరాలను గుర్తించాం. ఈ వివరాల ఆధారంగా చూస్తే 2013 మే నుంచి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అప్పటికే తీసుకున్న రుణాల చెల్లింపుల కోసం మరిన్ని రు ణాలను తీసుకునే ఒత్తిడిలో ఉందని తెలిసింది’’ అని గ్రాంట్ థార్న్‌టన్ నివేదిక పేర్కొంది. 2018 జూలైలో నిధుల పరంగా మరింత ఎక్కువ అంతర ం ఉందని తెలిపింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్ చైర్మన్ రవి పార్థసార«థి 2018 జూలై 21న రాజీనామా చేయ డం గమనార్హం. గతేడాది ఆగస్టు నుంచి ఐఎల్‌ఎఫ్‌ఎస్ గ్రూపు రుణ చెల్లింపులు చేయలేకపోవడంతో అక్రమాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment