ముంబై: కార్పొరేట్ డీల్స్ (ఒప్పందాలు) విలువ జూలై నెలలో 58 శాతం పెరిగి 3.1 బిలియన్ డాలర్లుగా (రూ.25,730 కోట్లు) నమోదైంది. మొత్తం మీద డీల్స్ సంఖ్య తగ్గింది. ఈ వివరాలను గ్రాంట్ థార్న్‌టన్ విడుదల చేసింది. జూలైలో మొత్తం 3.1 బిలియన్ డాలర్ల కార్పొరేట్ ఒప్పందాలు నమోదయ్యాయి. విలువ పరంగా 58 శాతం పెరిగినా, సంఖ్యా పరంగా చూస్తే 46 శాతం తగ్గాయి.
అంతర్జాతీయంగా మందగమనం కార్పొరేట్ డీల్స్‌పై ప్రభావం చూపించినట్టు గ్రాంట్ థార్న్‌టన్ పార్ట్‌నర్ శాంతి విజేత తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి కార్పొరేట్ డీల్స్ విభాగంలో స్తబ్ధత ఉన్నట్టు చెప్పారు. సీమాంతర లావాదేవీలు డీల్స్ విలువ పెరగడానికి దోహదపడినట్టు చెప్పారు. అదే సమయంలో ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లలో అప్రమత్తత ఉండడంతో డీల్స్ సంఖ్య తగ్గినట్టు తెలిపారు.
ముఖ్య డీల్స్..
► 29 డీల్స్ విలువ 2 బిలియన్ డాలర్లుగా ఉంది.
► రూట్ మొబైల్‌లో 58 శాతం వాటా కొనుగోలుకు 721 మిలియన్ డాలర్లతో ప్రాక్సిమస్ ఓపల్ కుదుర్చుకున్న డీల్ అతిపెద్దదిగా ఉంది.
► అదానీ క్యాపిటల్, అదానీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 90 శాతం వాటా కొనుగోలుకు బెయిన్ క్యాపిటల్ 176 మిలియన్ డాలర్లతో డీల్ కుదుర్చుకోవడం గమనార్హం.
► నాలుగు క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) విలువ 668 మిలియన్ డాలర్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment