impropriety
-
రాజధాని దందా నిగ్గు తేలుస్తాం
సాక్షి, అమరావతి: ‘రాజధాని ముసుగులో అమరావతి వేదికగా గత సర్కారు పాలనలో అంతులేనన్ని అక్రమాలు చోటు చేసుకోవడంపై లోకాయుక్త, సీఐడీ, సీబీఐలలో ఏదో ఒక సంస్థతో దర్యాప్తు చేయించాలని శుక్రవారం రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని గత పాలకులు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని మంత్రివర్గ ఉపసంఘం నిగ్గు తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పలు రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు లభ్యం కావడంతో మరింత లోతుగా సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో జరిగిన కుంభకోణంపై మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని చెప్పారు. రాజధాని వ్యవహారంలో చాలా తప్పులు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రికి వాటాలు ఉన్న సంస్థ కూడా ఈ ప్రాంతంలో 2014 డిసెంబర్‌కు ముందు (రాజధాని ఈ ప్రాంతంలో వస్తుందని అధికారికంగా ప్రకటించడానికి ముందు) భూములు కొనుగోలు చేసిన విషయం బట్టబయలైందని చెప్పారు. రాజధాని ప్రకటించడానికి కొంత ముందు అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరెవరు ఆ ప్రాంతంలో భూములు కొన్నారో పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కచ్చితంగా బయట పెడతాం ‘రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసినందున గత పాలకులు.. డ్రైవర్లు, పనివాళ్లు, బంధువుల పేర్లతో కారు చౌకగా భూములు కొన్నారు. నైతిక విలువలు వదిలేసి అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేలింది. 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ నెలాఖరు మధ్య (రాజధాని ఎక్కడ పెడతారో ప్రకటించక ముందు) టీడీపీ నేతలు ఇక్కడ 4,075 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఇలా చేయరాని తప్పులు చేసిన వారే ఇప్పుడు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. రైతులను రెచ్చగొడుతున్నారు. దమ్ముంటే అక్రమాలు నిరూపించాలని సవాలు చేస్తున్నారు. జరిగిన తప్పును ఎవరూ దాచలేరు. అందుకే మొత్తం వ్యవహారంపై లోకాయుక్త లేదా సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెచ్చగొడుతూ.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేస్తున్న పెద్ద మనుషుల కోరికను తప్పకుండా మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఎవరెవరు ఏమేరకు అక్రమాలకు పాల్పడ్డారో అన్ని విషయాలు విచారణలో బయటకు వస్తాయి’ అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. -
ఈ మోసం ఇంతటితో ఆగలేదు
-
రాజధాని ముసుగులో అంతులేని అక్రమాలు
సాక్షి, అమరావతి: అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం అంతులేనన్ని అక్రమాలు, లెక్కలేనన్ని మోసాలకు పాల్పడటమే కాకుండా చట్టాలను చట్టబండలుగా మార్చేసి రాజధానిని కుంభకోణాలమయం చేశారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. రాజధానిని ఎక్కడ ఎంపిక చేశారో ముందుగానే తమ వారికి ఉప్పందించి కారుచౌకగా భూములు కొనుగోలు చేసి అధికార రహస్యాల పరిరక్షణ చట్టాన్ని చంద్రబాబు ఉల్లంఘించారన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, పేదలకు కేటాయించిన భూముల రక్షణ కోసం తెచ్చిన పీవోటీ (బదిలీ చేయడానికి వీలులేని) చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించారని తెలిపారు. రాజధానిపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా బుగ్గన ఆధార సహితంగా గత పాలకుల మోసాలను బట్టబయలు చేశారు. రాజధాని అంశంపై కేంద్రం నిపుణులతో శివరామకృష్ణన్ కమిటీని నియమిస్తే కనీసం నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని మండిపడ్డారు. క్యాన్సర్‌తో బాధపడుతూ కూడా శివరామకృష్ణన్ స్వయంగా తిరిగి సవివరమైన నివేదిక గత ప్రభుత్వానికి అందజేశారని చెప్పారు. గుంటూరు, నూజివీడు ఇలా పలు ప్రాంతాల పేర్లు ప్రచారంలోకి తెచ్చి చంద్రబాబు, ఆయన సన్నిహితులు అమరావతి ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా కారుచౌకగా భూములు కొనుగోలు చేశారని చెప్పారు. ‘2014 జూన్ 1 నుంచి డిసెంబరు వరకు కేవలం ఆర్నెళ్ల వ్యవధిలో 4,070 ఎకరాలను చంద్రబాబు, ఆయన సన్నిహితులు కొనుగోలు చేశారు. ఇది ఇప్పటి వరకూ బయటపడిన లెక్కలు మాత్రమే ఇంకా ఎన్ని ఎకరాలు బయటపడతాయో? స్పీకర్ అనుమతిస్తే ఎవరెవరు ఎంతెంత భూమి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రాజధాని ప్రాంతంలో కొన్నారో ప్రజెంటేషన్ ఇస్తా’ అని బుగ్గన తెలిపారు. సభాపతి అనుమతించడంతో పేర్లతో సహా వెల్లడించారు. ఆ వివరాలు మంత్రి మాటల్లోనే... ఇన్సైడర్ ట్రేడింగ్ కాక మరేంటి? ‘చంద్రబాబు మనుషులు లింగాయపాలెం, ఉద్దండరాయపాలెం లాంటి మారుమూల గ్రామాల్లో భూములు కొనడానికి కారణం అక్కడ రాజధాని వస్తుందని ఉప్పందడం వల్లే. లేదంటే మారుమూల పల్లెల్లో భూములు ఎందుకు కొంటారు? దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనక మరేమని అంటారు? కోర్ క్యాపిటల్‌కు 1,681 ఎకరాల మన భూమిని ఇచ్చి, అభివృద్ధికి మన నిధులిచ్చి ప్లాట్లు వేసుకోవడం కోసం కన్సార్టియంకు ఇస్తామా? వచ్చే ఆదాయంలో వాళ్లకు 52 శాతం, ప్రభుత్వానికి 48 శాతమా? రాజధానిని రియల్ ఎస్టేట్ వ్యాపారంలా మార్చి కామధేనువులా మార్చుకుని నిరంతరం పిండుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నారు. ఈ మోసం ఇంతటితో ఆగలేదు జగ్గయ్యపేటలో ఎకరా రూ. లక్ష చొప్పున 498 ఎకరాలను వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు కేటాయించిన తర్వాత దాని ధర పెంచడం కోసం ఆ ప్రాంతాన్ని సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చారు. దీనివల్ల బాగుపడింది వీబీసీ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ యజమాని ఎంఎస్బీ రామారావు. ఆయన చంద్రబాబు వియ్యంకుడైన బాలకృష్ణకు వియ్యంకుడు. ఇలా చేస్తే కోటీశ్వరులు ఎందుకు కారు?’ ఆయన లోకేష్ బినామీ ఎస్సీ, ఎస్టీల నుంచి అసైన్డ్ భూములు కొన్న వారిపై చర్యలు తీసుకోవాలి. కొల్లి శివరాం 47.39 ఎకరాలు కొన్నారు. ఆయన నారా లోకేశ్‌కు అసోసియేట్ అని బయట ఎవరిని అడిగినా చెబుతారు. గుమ్మడి సురేష్ 42.92 ఎకరాలు, బరసు శ్రీనివాసరావు (నారా లోకేష్ మనుషులు) 14.07 ఎకరాలు ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూమి కొన్నారు. (ఇంకా ఎవరెవరు కొన్నారో మంత్రి బుగ్గన పేర్లతో సహా వివరించారు) తమవారికి అప్పనంగా భూములు భూకేటాయింపుల్లోనూ గత ప్రభుత్వం అన్యాయమే చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్బీఐ, సిండికేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు తదితరాలకు ఎకరం రూ. 4 కోట్లు చొప్పున కేటాయించారు. కాగ్‌కు రూ .4కోట్లుకి గత పాలకులు తమకు కావాల్సిన వారికి మాత్రం ఎకరం రూ. 40 లక్షలకు, రూ. 20 లక్షలకు అప్పనంగా ఇచ్చేశారు. ప్రైవేట్ సంస్థలతో ఎంవోయూ ప్రతిపక్ష నాయకుడు ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ అని చెప్పారు. కానీ ఎంవోయూ ప్రైవేట్ సంస్థలైన సింగపూర్ కన్సార్టియంతో ఉంది. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కాలేదు. బాబు బినామీల భూముల చిట్టా ఇదిగో ►బాబు సొంత సంస్థ హెరిటేజ్ 14.22 ఎకరాలు కొనుగోలు చేసింది. మొత్తం 14.22 ఎకరాలు డైరెక్ట్‌గా హెరిటేజ్‌ఫుడ్స్ పేరు మీదే ఉన్నాయి. ►ఆవుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, ప్రమీల అనే బినామీల పేరు మీద అప్పటి మంత్రి నారాయణ కొనుగోలు చేశారు. బంధువులు, తన దగ్గర పనిచేసే ఉద్యోగుల పేరుతో నారాయణ 55.27 ఎకరాల భూమి కొన్నారు. ►ప్రత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలు బినామీ పేర్లతో కొన్నారు. ►పరిటాల సునీత కూతురు భర్త పేరు మీద భూమి కొనుగోలు చేశారు. ►రావెల కిషోర్ బాబు 40.85 ఎకరాలు మైత్రీ ఇన్ఫ్రా సంస్థ ద్వారా కొనుగోలు చేశారు. ►కొమ్మాలపాటి శ్రీధర్ 68.60 ఎకరాలను అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కొన్నారు. ►అప్పటి ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు 37.84 ఎకరాలు బినామీ పేరుతో కొన్నారు. ►పయ్యావుల కేశవ్ 15.30 ఎకరాలు పయ్యావుల శ్రీనివాసులు అండ్ వేం నరేందర్ రెడ్డి పేరుతో కొన్నారు. ►వేమూరు రవికుమార్ ప్రసాద్ 25.68 ఎకరాలు కొన్నారు. ఆయన నారా లోకేష్ వ్యాపార భాగస్వామి అని అందరికీ తెలుసు. ►లింగమనేని రమేష్ 351 ఎకరాలను సుజనా, ప్రశాంత్ పేరు మీద, ఇతర కంపెనీలు మీద కొనుగోలుచేశారు. ►యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ 7 ఎకరాలు కొనుగోలు చేశారు. ►కోడెల శివప్రసాద్ 17.13 ఎకరాలు శశి ఇన్ఫ్రా పేరు మీద కొన్నారు. ►ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి 13.50 ఎకరాలను ధూళిపాళ్ల వైష్ణవి, దేవురపుల్లయ్య పేర్లతో కొనుగోలు చేశారు. ►వీరంతా మారుమూల పల్లెల్లో ఎందుకు కొన్నారు? టీడీపీ నాయకులు, వారి బంధువులు అక్కడ రాజధాని వస్తుందని తెలిసే 2014 జూన్ 1 నుంచి డిసెంబరు వరకు 4,070 ఎకరాలు కారుచౌకగా కొన్నారు. -
సాగునీటి అక్రమాలపై మూడో కన్ను!
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం మూడో కన్ను తెరిచింది! అంచనా వ్యయాలను భారీగా పెంచేసి చేపట్టిన పనుల్లో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ‘థర్డ్ పార్టీ’తో విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రిటైర్డ్ ఈఎన్సీలు బి.రోశయ్య, నారాయణరెడ్డి, నాక్ డైరెక్టర్ పీటర్, ఐఐటీ ప్రొఫెసర్ రమణ సభ్యులుగా థర్డ్ పార్టీని నియమించాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నాయి. శ్వేతపత్రం సాక్షిగా బాబు దోపిడీ.. రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 8న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అదే ఏడాది జూలై 28న సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగిలిన ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామని శ్వేతపత్రంలో ప్రకటించారు. జలయజ్ఞం కింద చేపట్టిన గుండ్లకమ్మ, గాలేరు–నగరి తొలిదశ, హంద్రీ–నీవా తొలిదశ, తాడిపూడి, తోటపల్లి, ముసురుమిల్లి, వంశధార, గురురాఘవేంద్ర తదితర 11 ప్రాజెక్టుల పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, మిగిలిపోయిన ఐదు శాతం పనులకు రూ.780 కోట్లు ఖర్చు చేస్తే కొత్తగా 2,03,628 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించవచ్చని 2013–14 సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. కానీ శ్వేతపత్రం సాక్షిగా చంద్రబాబు దోపిడీకి తెరతీశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో డీజిల్, సిమెంట్, స్టీలు ధరలు పెరగాయనే నెపంతో ధరల సర్దుబాటు కింద అదనపు బిల్లులు చెల్లించడానికి వీలుగా 2014 ఫిబ్రవరి 7న నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 13) జారీ చేసింది. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ ఉత్తర్వులు జారీ చేశారని గవర్నర్ నరసింహన్‌కు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో దీన్ని ఆయన అభయన్స్(నిలుపుదల)లో పెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ముడుపుల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ ఉత్తర్వులు జారీ చేయించిందని, దీనివల్ల ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోందని, అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉండగా నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్లకు మరింత ప్రయోజనం చేకూర్చేలా జీవో 13లో నిబంధనలు మార్చారు.‘ధరల సర్దుబాటు’ కింద కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు మంజూరు చేసేలా 2015 ఫిబ్రవరి 23న జీవో 22 జారీ చేయించారు. అంతటితో ఆగకుండా ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) మౌలిక సూత్రాలను తుంగలో తొక్కుతూ పనుల పరిమాణాల ఆధారంగా అదనపు బిల్లులు చెల్లించేలా జీవో 63 జారీ చేయించారు. ఈ రెండు ఉత్తర్వుల వల్ల సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం భారీగా పెరుగుతుందని, ఖజానాపై భారం పడుతుందని నాడు ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేసినా లెక్క చేయలేదు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ఈ ఉత్తర్వులు జారీ చేశారని సాగునీటి రంగ నిపుణులు సైతం స్పష్టం చేశారు. పనులు గిట్టుబాటు కాకుంటే కాంట్రాక్టర్లను కొట్టినా పనులు చేయరంటూ వారి తరఫున వకల్తా పుచ్చుకున్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడానికే ఈ జీవోలు జారీ చేసినట్లు నమ్మించే యత్నం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా తప్పుబట్టిన ఉత్తర్వులనే అధికారంలోకి రాగానే సమర్థించడం ద్వారా బాబు తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. అంచనాలు పెంచి కమీషన్లు కాజేయ్.. కోరినంత కమీషన్లు చెల్లించని సాగునీటి కాంట్రాక్టర్లపై ఏపీడీఎస్‌ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్) 60 సీ నిబంధన కింద చంద్రబాబు వేటు వేయించారు. ఆ తర్వాత జీవో 22, జీవో 63లను వర్తింపజేసి అంచనా వ్యయం పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ఇలా గత ఐదేళ్లలో 25 ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని రూ.39,935.34 కోట్ల నుంచి ఏకంగా రూ.96,785.72 కోట్లకు పెంచేశారు. ఆ తర్వాత కమీషన్లు చెల్లించే కాంట్రాక్టర్లకు పనులను కట్టబెట్టి భారీఎత్తున కమీషన్లు వసూలు చేసుకున్నారు. గత ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.75,427.46 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో నీరు–చెట్టు కింద రూ.13,023.49 కోట్లు, అటవీ శాఖ ద్వారా ఖర్చు చేసిన రూ.185.90 కోట్లు పోనూ మిగతా రూ.57,332.91 కోట్లను సాగునీటి ప్రాజెక్టుల పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. అయితే ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేసిన దాఖలాల్లేకపోవడం గమనార్హం. కొత్తగా ఒక్కటంటే ఒక్క ఎకరాకూ నీళ్లందించిన పాపాన పోలేదు. ఈ వ్యవహారంలో రూ.30 వేల కోట్లకుపైగా దోపిడీ జరిగినట్లు అంచనా. అవినీతిపరులపై చర్యలు టీడీపీ హయాంలో కొత్తగా చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం, కొండవీటివాగు వరద మళ్లింపు పథకం నుంచి ఎన్నికలకు ముందు ప్రకటించిన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్–హంద్రీ–నీవా ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, బీటీపీ ఎత్తిపోతల, ఉరవకొండ సీఎల్డీపీ, పత్తికొండ ఎత్తిపోతల, వేదవతి ఎత్తిపోతల, రాజోలిబండ కుడి కాలువ, గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ, ముక్త్యాల ఎత్తిపోతల, కోటపాడు–విస్సన్నపేట ఎత్తిపోతల, వరికపుడిశెల ఎత్తిపోతల, గుంటూరు ఛానల్ విస్తరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ, వంశధార–బాహుదా నదుల అనుసంధానం తదితర ప్రాజెక్టు పనుల అంచనా వ్యయంపై కూడా థర్డ్ పార్టీ విచారణ చేయనుంది. ఎంత అవినీతి జరిగిందో సర్కార్‌కు నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా అవినీతి పరు లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారవర్గాలు తెలిపాయి. మూడు నెలల్లో సర్కారుకు నివేదిక సాగునీటి ప్రాజెక్టుల వారీగా చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు, ఈఈలతో థర్డ్ పార్టీ సమావేశమై అంచనాల లెక్కలు తేల్చి మూడు నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. 2004లో వైఎస్సార్ జలయజ్ఞం పనులు చేపట్టారు. ఒకేసారి రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 సాగునీటి ప్రాజెక్టుల పనులకు శ్రీకారం చుట్టారు. వీటిని పూర్తి చేయడం ద్వారా కొత్తగా 1.21 కోట్ల ఎకరాలకు నీళ్లందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అకుంఠిత దీక్షతో జలయజ్ఞాన్ని కొనసాగించారు. 2004 నుంచి 2009 వరకూ రూ.53,205.29 కోట్లు ఖర్చు చేసి 16 ప్రాజెక్టులను సంపూర్ణంగా, మరో 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసిన వైఎస్సార్ 18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించారు. మరో 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. సాగునీటి రంగ చరిత్రలో ఇదో రికార్డుగా అధికార వర్గాలు అభివర్ణిస్తున్నాయి. గుట్టు విప్పనున్న థర్డ్‌పార్టీ.. సాగునీటి ప్రాజెక్టుల వారీగా చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు, ఈఈలు, డీఈలు, ఏఈలతో థర్డ్ పార్టీ సమావేశం కానుంది. ప్రాజెక్టు చేపట్టినప్పుడు అంచనా వ్యయం ఎంత? 2014 నాటికి ఎంత పరిమాణం పని పూర్తయింది? బిల్లుల రూపంలో ఎంత చెల్లించారు? ఎంత పని మిగిలింది? ఆ పని పూర్తి చేయాలంటే ఎంత అవసరం? 2014లో టీడీపీ అధికారంలోకొచ్చాక మిగిలిన పని అంచనా వ్యయాన్ని ఎంతకు పెంచింది? పనులను ఎవరికి, ఎంత ధరకు అప్పగించారు? ఇప్పటివరకూ ఎంత పని పూర్తయింది? బిల్లుల రూపంలో ఎంత చెల్లించారు? ఎంత పని మిగిలింది? అన్న కోణంలో థర్డ్ పార్టీ వాస్తవ లెక్కలను రాబట్టనుంది. -
ప్రాజెక్టుల్లో అవినీతిపై థర్డ్ పార్టీతో విచారణ
సాక్షి, అమరావతి: అంచనాలు పెంచి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించి వాస్తవ అంచనాలను మదింపు చేసి అక్రమాల నిగ్గు తేల్చుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. థర్డ్ పార్టీ విచారణ ముగిసేవరకు ఎదురు చూడకుండా, వాస్తవాలను బహిర్గతం చేసి భారీగా అంచనాలు పెంచిన ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలోచనా విధానాన్ని మార్చుకుని ప్రభుత్వ నిధులను ఆదా చేసే దిశగా పని చేయాలని అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం మరోసారి జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇవీ.. ప్రజల ఆశలను నెరవేర్చేలా పాలించాలి.. ‘ప్రభుత్వం డబ్బులు తిన్నవారు ఒకరు.. కానీ చెడ్డపేరు మీకు వస్తోంది.. ఆ పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడి నిజాయితీగా పనిచేయండి. వాస్తవ అంచనాలతో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి’ అని సమీక్షలో సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రాజెక్టుల వ్యయాన్ని తగ్గించి ఖజానాకు నిధులు ఆదా చేసే అధికారులను ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానిస్తామని పునరుద్ఘాటించారు. ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో ప్రజలు ఎన్నో విజ్ఞప్తులు చేశారని, వారి ఆశలు ఫలించేలా పాలన అందించాల్సిన బాధ్యత తనపై ఉందని జగన్ స్పష్టం చేశారు. ఐదు కోట్ల మందిలో తనకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, ప్రజలకు జవాబుదారుగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల వారీగా సాగునీటి పనులపై లోతుగా సమీక్షిస్తానని చెప్పారు. ఎమ్మెల్యేలనూ భాగస్వాములుగా చేసి ప్రాజెక్టుల ప్రాధాన్యతను నిర్ధారించి పనులు పూర్తి చేస్తామన్నారు. జలయజ్ఞానికి తూట్లు పొడిచారు.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంనికి చంద్రబాబు పాలనలో తూట్లు పొడిచారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో 2014 నాటికి కొంత భాగం పనులు మాత్రమే మిగిలాయని, వీటి అంచనా వ్యయాన్ని 200 నుంచి 300 శాతం పెంచడంతోపాటు పాత కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేసి టైలర్ మేడ్ నిబంధనల ద్వారా కమీషన్లు చెల్లించిన కాంట్రాక్టర్లకే పనులు కట్టబెట్టారని స్పష్టం చేశారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ నుంచి వంశధార ప్రాజెక్టుల వరకూ అన్నిటిలోనూ అవినీతికి పాల్పడ్డారన్నారు. ‘జలయజ్ఞం కింద చేపట్టినప్పుడు ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత? 2014 నాటికి ఎంత పని పూర్తయింది? ఎంత ఖర్చు చేశారు? ఎంత పని మిగిలింది? 2014 తర్వాత మిగిలిన పని అంచనా వ్యయాన్ని ఎంత పెంచేశారు? ఇప్పటివరకూ ఎంత పని పూర్తి చేశారు? బిల్లుల రూపంలో ఎంత చెల్లించారు? ఇంకా ఎంత పని మిగిలి ఉంది? అది పూర్తి కావాలంటే ఎంత అవసరం? అనే అంశాలపై ప్రాజెక్టుల వారీగా నివేదిక ఇవ్వండి. వాటిపై థర్డ్ పార్టీతో విచారణ చేయిద్దాం. ఇందులో జలవనరుల శాఖ అధికారులు, సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉంటారు. అక్రమాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రాధాన్యతల వారీగా పనులు పూర్తి.. జలవనరుల శాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల వారీగా, ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే అవకాశం ఉన్న ప్రాజెక్టుల ప్రాధాన్యత గుర్తించి పూర్తి చేద్దామని సూచించారు. వంశధార, తోటపల్లి, తారకరామతీర్థసాగరం, చింతలపూడి, వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, గుండ్లకమ్మ, గోదావరి డెల్టా ఆధునికీకరణ, కృష్ణా డెల్టా ఆధునికీకరణ, ఏలేరు డెల్టా ఆధునికీకరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మిగతా ప్రాజెక్టులను ప్రాధాన్యత కింద చేపట్టి పూర్తి చేస్తామన్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ విస్తరణలో కేవలం మట్టి పనుల కోసమే రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశారని, రెండు ప్యాకేజీలు ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించారని, ఇదో పెద్ద కుంభకోణమని స్పష్టం చేశారు. రివర్స్ టెండరింగ్‌తో అక్రమాలు బహిర్గతం టీడీపీ సర్కారు ఎన్నికలకు ముందు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్–హంద్రీ–నీవా ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, బీటీపీ ఎత్తిపోతల, ఉరవకొండ సీఎల్డీపీ, పత్తికొండ ఎత్తిపోతల, వేదవతి ఎత్తిపోతల, రాజోలిబండ కుడి కాలువ, గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ, ముక్త్యాల ఎత్తిపోతల, కోటపాడు–విస్సన్నపేట ఎత్తిపోతల, వరికపుడిశెల ఎత్తిపోతల, గుంటూరు ఛానల్ విస్తరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ, వంశధార–బాహుదా నదుల అనుసంధానం పనులు చేపట్టినట్లు జలవనరుల శాఖ అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు.ఈ ప్రాజెక్టులకు ఫీజుబులిటీ, హైడ్రలాజికల్ క్లియరెన్స్ తీసుకోకపోవడం, కేవలం లైన్ ఎస్టిమేట్ల ఆధారంగా టెండర్లు పిలవడంపై సీఎం విస్మయం వ్యక్తం చేశారు. ఇందులో భారీ కుంభకోణం దాగుందని స్పష్టం చేశారు. బీటీపీ ఎత్తిపోతల పథకం పనులను అంచనా వ్యయంలో 60 శాతం నిధులతోనే పూర్తి చేయవచ్చని ఒక ప్రజాప్రతినిధి చెప్పారని, ఆయనతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల్లో అంచనా వ్యయాలను పెంచేయడంపై వాస్తవాలను వెల్లడిస్తే అక్రమాలు జరిగిన ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని తెలిపారు. జ్యుడీషియల్ కమిషన్ నేతృత్వంలో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే ప్రాజెక్టుల అంచనా వ్యయంలో కనీసం 20 శాతం తగ్గుతుందని, ఆ మేరకు ఖజానాకు ఆదా అయ్యే నిధులతో కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చని పేర్కొన్నారు. అవసరమైన ప్రాజెక్టులే చేపడదాం.. రాజధాని తాగునీటి అవసరాల కోసం రూ.2,169 కోట్లతో వైకుంఠపురం బ్యారేజీ పనులను చేపట్టామని, కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడు సార్లు టెండర్లు నిర్వహించామని, 13.19 శాతం అధిక ధరలకు కాంట్రాక్టర్‌కు అప్పగించామని అధికారులు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. అయితే కొండవీటి వాగు వరద మళ్లింపులో భాగంగా మూడు జలాశయాల నిర్మాణాన్ని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) చేపట్టిందని సీఎం గుర్తు చేశారు. వైకుంఠపురం బ్యారేజీ వద్ద నీటి లభ్యత ఉందో లేదో మరోసారి సర్వే చేయాలని ఆదేశించారు. సీఆర్డీఏ జలాశయాలను నిర్మిస్తున్న నేపథ్యంలో వైకుంఠపురం బ్యారేజీ పనులు అవసరమో కాదో తేల్చి నివేదిక ఇవ్వాలని సూచించారు. వంశధార–బాహుదా నదుల అనుసంధానం పనుల అంచనా వ్యయం రూ.6326.62 కోట్లని అధికారులు చెప్పడంతో సీఎం వైఎస్ జగన్ నివ్వెరపోయారు. దీనిపై మరోసారి అధ్యయనం చేయాలని ఆదేశించారు. తాను పాదయాత్ర చేసినప్పుడు రాజోలి, జోలదరాశి, గుండ్రేవుల, సిద్దేశ్వరం అలుగు వంటి ప్రాజెక్టులు చేపట్టాలని అందిన విజ్ఞప్తులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకుందాం చింతలపూడి ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించి హరిశ్చంద్రాపురం నుంచి నాగార్జునసాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోసి ఆయకట్టును స్థిరీకరించడానికి రూ.6,020 కోట్లతో గోదావరి–పెన్నా తొలి దశను చేపట్టామని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.అయితే చింతలపూడి ఎత్తిపోతల నీటితో చింతలపూడి, కోటపాడు–విస్సన్నపేట, నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు ఒకేసారి నీళ్లందించడం ఎలా సాధ్యమవుతుందన్న సీఎం వైఎస్ జగన్ ప్రశ్నకు అధికారులు నీళ్లు నమిలారు. కర్ణాటక సర్కార్ ఆల్మట్టి ఎత్తు పెంచుతున్న నేపథ్యంలో కృష్ణా నదిలో నీటి లభ్యత మరింత తగ్గిపోయి సాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా గోదావరి జలాల మళ్లింపుపై ఒకరోజు మేథోమథనం చేసి పనులు చేపడదామని స్పష్టం చేశారు. పోలవరంపై ప్రత్యేక దృష్టి.. పోలవరం పనులపై పర్యావరణ నిషేధాన్ని సడలిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల గడువు జూలై 2వ తేదీతో ముగుస్తుందని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. పర్యావరణ నిషేధాన్ని ఎత్తివేసేలా కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తానని, తక్షణమే వివరాలు పంపాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి యుద్దప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలవరం పనులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రధాన కాంట్రాక్టు సంస్థకు డీజిల్ ఖర్చుల కోసం తక్షణమే రూ.50 కోట్లు విడుదల చేయాలని అధికారులను సీఎం అదేశించారు. గోదావరికి మరో నెల రోజుల్లో వరదలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటివరకూ చేసిన పనులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్, కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, వివిధ ప్రాజెక్టుల సీఈలు పాల్గొన్నారు. ‘‘టెండర్ల వ్యవస్థను చంద్రబాబు అపహాస్యం చేశారు. అంచనాల్లో వంచనకు పాల్పడి సాగునీటి ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచేయించారు. ఎక్కువ కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా టైలర్ మేడ్ నిబంధనలతో టెండర్లు పిలిచారు. అధిక ధరలతో కాంట్రాక్టర్లకు అప్పగించి ఖజానాకు గండి కొట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. అంచనాలు పెంచేయడంపై వాస్తవాలు చెప్పండి. అవినీతి జరిగిన ప్రాజెక్టులకు రివర్స్ టెండర్లు నిర్వహిద్దాం. ఖజానాకు కనీసం 20 శాతం నిధులు ఆదా అవుతాయి. ఈ డబ్బులు ఆదా కావడానికి సహకరించిన అధికారులకు ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానం చేస్తాం’’ ‘మా నాన్న, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టారు. ఆ ప్రాజెక్టులు అన్నిటినీ పూర్తి చేసి కరువన్నదే ఎరుగని ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది నాన్న ఆశయాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా పని చేస్తాం’’ ‘‘తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యం ఇద్దాం. సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతులకు ప్రతిఫలం దక్కేలా ఉండాలి. అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం ఆయకట్టుకు నీళ్లందించి రైతులకు ప్రయోజనం చేకూర్చడమే’’ జలవనరుల శాఖపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి -
కదులుతున్న డొంక
ఆ మూడు కాంట్రాక్టుల్లో కుంభకోణం ఎంత?ఎన్నికల ముందేఎందుకీ పనులు?రూ.120 కోట్లుఎవరి జేబుల్లోకెళ్లాయి?విజిలెన్స్ నివేదికనుతొక్కిపెట్టిందెవరు?రాజధాని ప్రాంత విద్యుత్లైన్ల ఏర్పాట్లలో అక్రమాలుప్రభుత్వ పెద్దలు, అధికారులపాత్రపై అనుమానాలు సాక్షి, అమరావతి ఎన్నికల ముందు ఏపీ ట్రాన్స్‌కో ఇచ్చిన మూడు కాంట్రాక్టులు వివాదాస్పదమయ్యాయి. కాంట్రాక్టుల అప్పగింతలో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపణలున్నాయి. దీనిపై ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్‌తో పాటు రాష్ట్ర విజిలెన్స్ విభాగం కూడా ఇందుకు సంబంధించిన వాస్తవాలను ప్రభు త్వం దృష్టికి తెచ్చాయి. అయితే, ఇవేవీ పరిగణన లోనికి తీసుకోకుండానే హడావిడిగా కాంట్రాక్టులు ఇచ్చినట్లు సీఎస్ గుర్తించారు. ఎక్కడా లేని విధంగానిబంధనలు పెట్టడం, కొన్ని కంపెనీలకు మేలుచేసే ప్రయత్నం చేయడం, కాంట్రాక్టులు ఎక్కువ రేటుకు ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దలు, అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది. గత రెండ్రోజులుగా ఇందుకు సంబంధించిన ఫైళ్లను ఆయన పరిశీలించినట్లు సమాచారం. అక్రమాల బాగోతం ఇదీ.. రాజధాని ప్రాంతానికి అన్ని వైపుల నుంచి విద్యుత్ లైన్లు వేయాలని ఏపీ ట్రాన్స్‌కో ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు నిధులతో సీఆర్డీఏ చేపట్టే పనులను ముందుకు తీసుకొచ్చారు. గుడివాడ, చిలకలూరిపేట, ఏలూరుల్లో 400 కేవీ సబ్స్టేషన్లు, లైన్లకు సరిగ్గా ఎన్నికల ముందే ట్రాన్స్‌కో టెండర్లు పిలిచింది. నిజానికి చాలా కంపెనీలు పోటీకి సిద్ధమయ్యాయి. తక్కువ రేటుకే పనులు చేసేందుకూ ముందుకొచ్చాయి. గుడివాడ లైన్, సబ్‌స్టేషన్ పనులకు రూ.600 కోట్లను ట్రాన్స్‌కో కోట్ చేస్తే అంతకన్నా తక్కువకే చేస్తామని పలు కంపెనీలు వచ్చాయి. దీంతో ఏపీ ట్రాన్స్‌కో ఎక్కడలేని నిబంధనలు పెట్టింది. ఈ టెండర్లలో పాల్గొనే కంపెనీలు ఎప్పుడైనా, ఎక్కడైనా మౌలిక సదుపాయాల పనులకు సంబంధించిన కాంట్రాక్టును ఏడాదిలో 10 శాతం పూర్తిచేసి ఉండాలనే నిబంధన పెట్టింది. అంటే.. ట్రాన్స్‌కో లైన్లు వేసే కంపెనీలు గృహ నిర్మాణ పనులుచేసి ఉన్నా ఫర్వాలేదని పేర్కొంది. అదే విధంగా లైన్, సబ్‌స్టేషన్ ఒకే కంపెనీ, ఒకేసారి చేసి ఉండాలి. మునుపెన్నడూ కూడా ఈ నిబంధనలు పెట్టలేదు. దీంతో కేవలం మూడే మూడు కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. ఈ మూడు కూడబలుక్కుని మరీ టెండర్లు వేశాయి. ఈ మూడింటికీ వేర్వేరు పనులు అప్పగించారు. ఆరు నెలల క్రితం వరకూ ట్రాన్స్‌కో కోట్‌చేసిన ధర కన్నా నాలుగు శాతం తక్కువకే పనులు అప్పగిస్తే, కంపెనీలు రింగ్ అవ్వడంవల్ల ఏకంగా నాలుగు శాతం ఎక్కువకు పనులు ఇచ్చారు. మొత్తం రూ.1200 కోట్ల విలువైన టెండర్లలో కనీసం రూ.120 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఎన్నికల కోడ్ సమీపిస్తుండడంతో టెండర్ల ప్రక్రియను హడావుడిగా పూర్తిచేసి మార్చి మొదటి వారంలోనే పనులు అప్పగించారు. వీటన్నింటినీ విజిలెన్స్ విభాగం ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోవడాన్ని ప్రస్తుత సీఎస్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. జేఎండీ కథానాయకుడా? ప్రభుత్వాధినేత కనుసన్నల్లో జరిగిన ఈ టెండర్ల వ్యవహారంలో ట్రాన్స్‌కో జేఎండీ కీలకపాత్ర పోషించినట్టు సీఎస్‌కు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. ఆదాయ పన్నుశాఖ నుంచి డిప్యుటేషన్‌పై ట్రాన్స్‌కో డైరెక్టర్‌గా వచ్చిన ఆయనకు.. ప్రభుత్వం మొదటి నుంచి పెద్దపీట వేసింది. డైరెక్టర్ స్థాయి నుంచి ఏకంగా ఆయనకు జేఎండీగా పదోన్నతి కల్పించింది. డిప్యూటేషన్ కాలం పూర్తయినా కేంద్ర స్థాయిలో మేనేజ్ చేసి ఆయనను ఇక్కడే ఉంచేందుకు టీడీపీకి చెందిన ఓ ఎంపీ విశ్వప్రయత్నం చేశారు. జేఎండీపై ఆయన మాతృ సంస్థకు ఫిర్యాదులు వెళ్లడంతో తప్పనిసరై ఆయన తిరిగి వెళ్లినట్టు ట్రాన్స్‌కో వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే.. మూడు కాంట్రాక్టులు తెరిచి, ఖరారు చేసే వరకూ ఆయన జేఎండీగానే కొనసాగారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి మాతృసంస్థకు వెళ్లారు. ఈ వ్యవహారంలో ఆయనకు ఏవైనా ముడుపులు అందాయా అనే కోణంలోనూ సీఎస్ ఆరా తీస్తున్నట్టు తెలిసింది. -
విజయ డెయిరీలో అక్రమాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: పాలు విక్రయించగా వచ్చే మొత్తాన్ని విజయ డెయిరీ అధికారులే మాయం చేశారు. గత రెండేళ్లుగా వరంగల్ జిల్లాలో రూ.46 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో రూ.26 లక్షలు స్వాహా చేసినట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది. నల్లగొండ జిల్లా ఇందుగులలోని విజయ బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ ప్లాంట్‌ను ఓ ప్రైవేటు వ్యక్తి మిర్యాలగూడకు తరలించుకుపోయారు. రైతుల నుంచి పాలు కొనకుండా అతనే పాలు సరఫరా చేస్తూ బోగస్ పేర్లతో బిల్లులను నొక్కేసినట్లు గుర్తించారు. రెండున్నరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపించడానికి జిల్లా అధికారులు అతనికి సహకరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎలా బయటపడిందంటే... జిల్లాల్లో ఎన్ని పాలు విక్రయిస్తున్నాం... వాటిపై ఎంత ఆదాయం వస్తుందనే అంశంపై అన్ని జిల్లాల అకౌంటింగ్ అధికారులతో డెయిరీ ఎండీ శ్రీనివాసరావు ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని జిల్లాల్లో అకౌంట్లలో తేడాలున్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు చేయించారు. రెండు జిల్లాల్లో రూ.72 లక్షల మేర డెయిరీకి రావాల్సిన సొమ్మును స్థానిక అధికారులు జేబుల్లో వేసుకున్నట్లు గుర్తించారు. నల్లగొండ జిల్లాలో స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురు అధికారుల బృందాన్ని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించారు. ప్లాంటును తరలించడంతోపాటు, బోగస్ పేర్లతో పాలు సరఫరా చేస్తూ బిల్లులను నొక్కేస్తున్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. మిర్యాలగూడలో ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఉన్న 2 వేల లీటర్లు, 3 వేల లీటర్లు, ఐదు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన డెయిరీ మిషనరీని స్వాధీనం చేసుకునేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇక్కడి నుంచి వచ్చే పాలను గురువారం నుంచి నిలిపివేశారు. సదరు వ్యక్తికి చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయనున్నారు. ఇందుగులలో ప్లాంట్ తరలింపు సమయంలో డీడీగా పనిచేసిన అధికారిని, పాల సొమ్ము స్వాహా చేసిన రెండు జిల్లాల డీడీలను, ఇద్దరు మార్కెటింగ్ సూపరింటెండెంట్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సంస్థ ఎండీ శ్రీనివాసరావు సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితోపాటు విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో అకౌంట్ విభాగంలోని డీడీ, నల్లగొండ జిల్లాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న డీడీలపై బదిలీ వేటు పడింది. -
ఐఎల్ఎఫ్ఎస్లో 13 వేల కోట్ల అవకతవకలు
న్యూఢిల్లీ: ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపులో రూ.13,000 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నట్టు గ్రాంట్ థార్న్టన్ సంస్థ ఆడిట్లో వెలుగుచూసింది. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపునకు 24 డైరెక్ట్ సబ్సిడరీలతోపాటు, 135 పరోక్ష సబ్సిడరీలున్నాయి. అలాగే, ఆరు జాయింట్ వెంచర్ కంపెనీలు, నాలుగు అసోసియేట్ కంపెనీలతో కూడిన ఈ గ్రూపునకు రూ.94,000 కోట్ల రుణ భారం ఉంది. మంజూరైన రుణాలను గ్రూపు కంపెనీలు అప్పటికే ఉన్న రుణాల చెల్లింపులకు 29 సందర్భాల్లో వినియోగించినట్టు ఆడిటింగ్‌లో తేలింది. ఈ మొత్తం రూ.2,502 కోట్లు అని గ్రాంట్ థార్న్టన్ నివేదిక పేర్కొంది. 2013 ఏప్రిల్ 1 నుంచి 2018 సెప్టెంబర్ 30 వరకు జరిగిన అధిక విలువ లావాదేవీలను ఈ నివేదిక ప్రస్తావించింది. రిస్క్ టీమ్ ప్రతికూల అంచనాలను పేర్కొన్నప్పటికీ రూ. 2,400 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేయ డం జరిగినట్టు పేర్కొంది. అక్రమంగా జరిగిన పలు లావాదేవీల మొత్తం రూ.13,290 కోట్లని వెల్లడించింది. స్వల్పకాల అవసరాల కోసం తీసుకున్న రూ.541 కోట్ల రుణాలను దీర్ఘకాల అవసరాల కోసం వినియోగించినట్టు ఈ సంస్థ గుర్తించింది. ‘‘అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశ వివరాలను సమీక్షించడం ద్వారా నిధుల్లో అంతరాలను గుర్తించాం. ఈ వివరాల ఆధారంగా చూస్తే 2013 మే నుంచి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అప్పటికే తీసుకున్న రుణాల చెల్లింపుల కోసం మరిన్ని రు ణాలను తీసుకునే ఒత్తిడిలో ఉందని తెలిసింది’’ అని గ్రాంట్ థార్న్టన్ నివేదిక పేర్కొంది. 2018 జూలైలో నిధుల పరంగా మరింత ఎక్కువ అంతర ం ఉందని తెలిపింది. ఐఎల్ఎఫ్ఎస్ చైర్మన్ రవి పార్థసార«థి 2018 జూలై 21న రాజీనామా చేయ డం గమనార్హం. గతేడాది ఆగస్టు నుంచి ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు రుణ చెల్లింపులు చేయలేకపోవడంతో అక్రమాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. -
ఎస్ఎస్సీ ఫలితాలు నిలిపివేత
న్యూఢిల్లీ: పలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామకాల కోసం నిర్వహించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) 2017 పరీక్షల ఫలితాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక పరిశీలనలో తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్), కంబైన్డ్ హయ్యర్ సెకెండరీ లెవెల్ (సీహెచ్ఎస్ఎల్) పరీక్షల కుంభకోణంతో అభ్యర్థులు లబ్ధి పొందేందుకు అంగీకరించబోమని, వారు సర్వీసులోకి వెళ్లనివ్వబోమని స్పష్టం చేసింది. ‘2018 జూలై 25, ఆగస్టు 30న సీబీఐ ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్‌లను చూస్తే సీజీఎల్–2017, సీహెచ్ఎస్ఎల్–2017 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తెలుస్తోంది. మేం తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా ఫలితాలు వెల్లడించకుండా ఎస్ఎస్ఎస్కి ఆదేశాలు జారీ చేస్తాం’ అని ధర్మాసనం తెలిపింది. విరుద్ధంగా వాదిస్తారా? సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) విక్రమ్‌జిత్ బెనర్జీ స్టేటస్ రిపోర్డులో ఉన్నదానికి విరుద్ధంగా వాదించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు కేంద్రం తరఫున వాదించడం ఆపండి. సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన మీరు సీబీఐ నివేదికకు విరుద్ధంగా, నిందితులకు రక్షణగా ఎలా మాట్లాడుతారు? వాస్తవానికి మీరు సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా పరీక్షను రద్దు చేయాలని మీరే అడగాలి’ అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఏఎస్జీ బెనర్జీ.. సీబీఐ సమర్పించిన రెండో స్టేటస్ రిపోర్డును పిటిషనర్ తరఫు న్యాయవాదికి ఇవ్వవద్దని, అందులో సున్నితమైన అంశాలు ఉన్నాయని కోరారు. బెనర్జీ వాదనలతో విభేదించిన ధర్మాసనం సీబీఐ నివేదికలో రహస్యమైన, సున్నితమైన అంశాలేవీ లేవని స్పష్టం చేసింది. ఎస్ఎస్సీ కళంకితమైంది.. ఈ సమయంలో పిటిషనర్ శాంతను కుమార్ తరఫున కోర్టుకు హాజరైన అడ్వొకేట్లు ప్రశాంత్ భూషణ్, గోవింద్ వాదనలు వినిపిస్తూ.. ‘సీబీఐ మాకు రిపోర్టు ఇస్తుందా, లేదా అనేది ఇక్కడ విషయం కాదు. పరీక్ష ప్రశ్న పత్రం కస్టోడియన్ అయిన సిఫీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సంత్ ప్రసాద్ గుప్తా పేపర్‌ను లీక్ చేసినట్లు సీబీఐ తన తొలి స్టేటస్ రిపోర్టులో పేర్కొంది. అతడిని విచారిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఎస్ఎస్సీ ఫలితాలు విడుదలయ్యే వీలుంది. వాటిని నిలిపివేయండి’ అని కోరారు. ‘ఎస్ఎస్సీ వ్యవస్థ, మొత్తం పరీక్షల ప్రక్రియ కళంకితమయ్యాయని ప్రాథమికంగా తెలుస్తోంది. పరీక్ష ప్రశ్న పత్రాన్ని కస్టోడియనే లీక్ చేయడాన్ని మేం నమ్మలేకపోతున్నాం’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ప్రభుత్వ విభాగాల్లోని సీ, డీ కేటగిరీ ఉద్యోగ సర్వీసుల్లో చేరతారు. ‘ఆర్టికల్ 35ఏ’పై విచారణ వాయిదా జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, అధికారాలను కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ రాజ్యాంగబద్ధతను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో పాటు శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని కేంద్రం విజ్ఞప్తి చేయడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ప్రజలకు ప్రత్యేక అధికారాలను, హక్కులను కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ ను 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. దీనిప్రకారం ఇతర రాష్ట్రాల ప్రజలు కశ్మీర్లో స్థిరాస్తులు కొనడం కుదరదు. అంతేకాకుండా మిగతా భారతీయులను కశ్మీరీ మహిళలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారు తమ ఆస్తిపై హక్కును కోల్పోతారు. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు ప్రజాప్రకటనల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై బీజేపీ, కేంద్రం సహా 6 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ ప్రకటనలను నాయకుల వ్యక్తిగత ప్రచారానికి వాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు నోటీసులిచ్చింది. 4వారాల్లోగా నోటీసులపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. కేంద్రం సహా తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లకు నోటీసులిచ్చింది. ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఈ పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారంటూ ఝా తన పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలను గుర్తుచేస్తూ.. బీజేపీ పార్టీ, కేంద్రం సహా ఆయా రాష్ట్రాలు ఏవిధంగా ఉల్లంఘనలకు పాల్పడ్డాయో పిటిషన్లో వివరించారు. ఉల్లంఘనలకు పాల్పడినందుకు వీరిపై చర్యలు తీసుకోవాలని, ప్రకటనలకోసం ఖర్చుపెట్టిన మొత్తాన్ని తిరిగి రాబట్టాలన్నారు. ప్రజా ప్రకటనలపై నియంత్రణ విషయంలో ముగ్గురు సభ్యుల (నిష్కళంకమైన చరిత్ర ఉన్నవారితో) కమిటీని ఏర్పాటు చేయాలని 2015, మే 13న కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. కేంద్ర మంత్రులు, సీఎంలు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ ప్రకటనల్లో కనిపించవచ్చని 2016లో సూచించింది. -
అంతా మా ఇష్టం!
కడప సిటీ : మేం అధికారంలో ఉన్నాం...మేం చెప్పినట్లే జరగాలి, పనులు చేయాలి.. అలా వినకపోతే ఉద్యోగాలు చేయలేరు.. మా ఇష్టం లేకుండా ఏ ఉద్యోగి వచ్చినా మాకున్న అధికార బలంతో చేరిన రోజే ఆర్డర్ రద్దుచేయించే సత్తా మాకుంది. ఇదీ జిల్లాలో అధికార పార్టీ నేతల తీరు!. ఇందుకు నిదర్శనం ఇరిగేషన్ శాఖలో బద్వేలు డీఈగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చి విధుల్లో చేరిన రోజే తెలుగు తమ్ముళ్లు ఉత్తర్వులను రద్దు చేయించారు. దీంతో జిల్లాలోని అధికారులు కొన్నిచోట్ల ఉద్యోగాలు చేయాలంటేనే భయపడుతున్నారు. మరికొంతమంది సెలవుపై వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తోంది. జిల్లాలో తెలుగుతమ్ముళ్లు నీరు–చెట్టు కింద కోట్లాది రూపాయల విలువజేసే పనులను చేశారు. అందులోభాగంగా బద్వేలు ప్రాంతంలో కూడా ఈ పనులు చేపట్టారు. ఈ నేపథ్యలో అక్కడ డీఈగా ఉన్న ఎంవీ రమణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటంతో అక్కడ పోస్టు ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని పోరుమామిళ్ల సబ్ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్.మర్రెడ్డిని నియమించారు. విషయాలు బయటపడతాయనే... నీరు–చెట్టు కింద అధికారపార్టీ నేతలు ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా పనులు చేశారు. వాటికి బిల్లులు చేసుకోవాలంటే తమకు అనుకూలంగా ఉన్న అధికారి అయితే ఇబ్బందులు లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఏసీబీకి పట్టుబడిన డీఈ ఎంవీ రమణారెడ్డి జైలులో ఉండగా ఫైళ్లలో సంతకాలు పెట్టించుకునేందుకు తమ్ముళ్లు ప్రయత్నించారు. కానీ వీలు పడకపోవడంతో మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో వారు చేసిన నాసిరకం పనులను గుర్తించి బిల్లులు చేయకుండా కొత్త అధికారి ఇబ్బందులు పెడతారనే ఉద్దేశంతో మర్రెడ్డిని బాధ్యతలు తీసుకున్న ఆరోజునే ఉత్తర్వులను అధికారపార్టీ నేతలు రద్దు చేయించారు. ఫుల్ అడిషనల్ బాధ్యతలకు సంబంధించి ఉత్తర్వులు తీసుకుని విధుల్లో చేరిన రోజునే వెనక్కి పంపారు. ఉన్నతాధికారులు దీనికి వంత పాడుతూ హుకుం జారీ చేసి వెళ్లిపోమ్మన్నారు. ఉన్నతాధికారులు ఉత్తర్వులు చూపలేదు మర్రెడ్డికి బద్వేలు డీఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ అక్టోబరు 10న ప్రొసీడింగ్ నంబరు ఆర్సీ/ఈఎన్సీ(పురపాలన)/సీ2/2017 1024/2017 ద్వారా జలవనరులశాఖ పరిపాలన ఇంజనీరింగ్ చీఫ్ ఎం.గిరిధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మర్రెడ్డితోపాటు ఎస్ఈకి కూడా ఈ ఉత్తర్వులు అందాయి. దీంతో అక్టోబర్ 25న మర్రెడ్డి ఉన్నతాధికారులను కలిసినట్లు సమాచారం. అయితే తమకు ఉత్తర్వులు అందలేదని ఎస్ఈ గోపాల్‌రెడ్డి తెలియజేయడంతో మర్రెడ్డి పలుమార్లు వారు చుట్టూ తిరిగినప్పటికీ స్పందించనట్లు తెలిసింది. చేరిన ఒక్కరోజుకే ఉత్తర్వులు రద్దు మర్రెడ్డి సర్టిఫికెట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆ‹ఫ్ చార్జ్ (సీటీసీ) అనుసరించి ఈనెల 15న బాధ్యతలు తీసుకున్నారు. ఉన్నతాధికారులు పలకకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికే తెరవెనుక రాజకీయాలు మొదలయ్యాయి. ఉన్నతాధికారుల ద్వారా విడుదలైన ఉత్తర్వులను ఈనెల 7న రద్దయినట్లు ఇంకొక ఉత్తర్వును తెప్పించారు. ఈ ఉత్తర్వులు ఈనెల 16న కడప కార్యాలయానికి రావడం, అంతకు ముందురోజు విధుల్లో చేరిన మర్రెడ్డిని తొలగించడం గంటల్లో జరిగిపోయాయి. ముందు వచ్చిన ఉత్తర్వులు చూపకుండా కేవలం రద్దయిన ఉత్తర్వులను మాత్రమే అధికారులు చూపించడం వెనుక పెద్ద రాజకీయమే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మర్రెడ్డి మాత్రం తాను విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎస్ఈ గోపాలరెడ్డిని వివరణ కోరగా ఉత్తర్వులు ఇచ్చింది వాస్తవమేనని, తిరిగి ఈఎన్సీ అధికారులే వాటిని రద్దు చేశారని ‘సాక్షి’కి తెలిపారు. -
నకిలీ పేర్లతో నాసిరకం
కేజీబీవీల్లో అక్రమాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 391 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) అక్రమాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో విద్యార్థులకు నాసిరకం పుస్తకాలు అంటగట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. పుస్తక ఏజెన్సీలతో కలిసి ముడుపులు పుచ్చుకున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే దాదాపు 80 వేల మంది విద్యార్థులకు అందించాల్సిన ‘రాయల్ అట్లాస్’ పుస్తకాలకు బదులు అదే పేరును తలపించే ‘రాయల అట్లస్’ అనే నాసిరకం పుస్తకాలను ఇచ్చినట్లు బయట పడింది. అలాగే ఆక్స్ఫర్డ్ వంటి డిక్షనరీలకు బదులు రాఘవేంద్ర పబ్లిషర్స్‌కు చెందిన నాసిరకం డిక్షనరీలను పంపిణీ చేసినట్టు వెల్లడైంది. నోట్‌బుక్స్ లోనూ విద్యార్థులకు కోత పెట్టారు. విద్యా శాఖ ఇటీవల క్షేత్రస్థాయిలో చేపట్టిన తనిఖీల్లోనే ఈ అక్రమాలు వెలుగు చూశాయి. వీటిపై సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ వెల్లడించారు. -
వ్యాట్ ఏ దోపిడీ
♦ గ్రానైట్ అక్రమ రవాణాతో ఏడాదికి రూ.200 కోట్ల అవినీతి ♦ వ్యాట్ ఎగవేత ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి ♦ పేరుకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అమ్మకాలు సొంత రాష్ట్రంలోనే ♦ విజిలెన్స్ విచారణలో వాస్తవాలు వెలుగులోకి కొందరు గ్రానైట్ వ్యాపారులు పన్ను ఎగవేసేందుకు రోజుకో కొత్త దారిని వెతుక్కుంటున్నారు. వ్యాట్ నిబంధనల్లో ఇతర రాష్ట్రాలకు, మన రాష్ట్రానికి ఉన్న తేడాను ఆసరా చేసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు గ్రానైట్ ఎగుమతి చేస్తున్నట్లు రికార్డులు చూపుతూ మన రాష్ట్రంలోనే అమ్మకాలు సాగిస్తున్నారు. పన్ను ఎగవేతతో ఒక్క ఏడాదిలో రూ.200 కోట్ల మేర దోచేసినట్లు ఏకంగా విజిలెన్స్ విచారణలోనే తేలిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గ్రానైట్ వ్యాపారుల అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. వ్యాట్ నిబంధనలను అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టి ఏడాదికి రూ.200 కోట్లు పైనే దోచుకుంటున్నారు. తాజా విజిలెన్స్ నివేదిక గ్రానైట్ వ్యాపారుల అక్రమాలను తేటతెల్లం చేసింది. వివరాల్లోకి వెళితే... గ్రాైనె ట్ను విదేశాలకు ఎగుమతి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలంటే కేవలం 2 శాతం వ్యాట్ చెల్లించాలి. మన రాష్ట్రంలో గ్రానైట్ అమ్మకాలు సాగించాలంటే మాత్రం 14.5 శాతం కట్టాలి. ఈ వ్యాట్ నిబంధనలు అవకాశంగా తీసుకుంటున్న గ్రానైట్ వ్యాపారులు అక్రమాలకు తెగబడ్డారు. ఇతర రాష్ట్రాలకు గ్రానైట్ తరలించినట్లు కమర్షియల్ ట్యాక్స్‌కు వ్యాట్ 2 శాతం చెల్లించినట్లు వే బిల్లులు తీసుకుంటున్నారు. అయితే గ్రాైనె ట్ను స్వరాష్ట్రంలోనే విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తద్వారా 14.5 శాతం వ్యాట్‌లో 12.5 శాతం వ్యాట్‌ను ప్రభుత్వానికి చెల్లించకుండా స్వాహా చేస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి వ్యాపారులు రూ.200 కోట్లపైనే దోచుకుంటున్నారు. సాక్షాత్తు విజిలెన్స్ నివేదికలే ఈ అక్రమాలను వెలుగులోకి తేవటం గమనార్హం. 2012 నుంచి 2015 మధ్య కాలంలో 9 వేల లారీల గ్రానైట్‌ను పేరుకు ఇతర రాష్ట్రాలకు అమ్మినట్లు చూపి స్వరాష్ట్రంలోనే అమ్మారంటే అక్రమార్కుల దందా ఏ స్థాయిలో సాగిందో తేటతెల్లమైంది. తద్వారా వ్యాపారులు రూ.60 కోట్లకు పైగా వ్యాట్ ఎగవేతకు పాల్పడినట్లు విజెలెన్స్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వాస్తవ పరిస్థితుల్లోకి తొంగిచూస్తే ఇంకా ఎన్నో రెట్లు అధికంగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రూ.200 కోట్లకు మించి గ్రానైట్ వ్యాపారులు వ్యాట్ ఎగవేసినట్లు సమాచారం. ఇక వ్యాట్ పరిస్థితి ఇలా ఉంటే అసలు బిల్లులే లేకుండా గ్రానైట్ అక్రమ రవాణా విచ్చల విడిగా జరుగుతోంది. రోజుకు పదుల సంఖ్యలో గానైట్ను వే బిల్లులు లేకుండా తరలించుకుపోతున్నారు. దీనివల్ల వ్యాట్‌తో సమానంగా ప్రభుత్వాదాయూనికి కోట్లాది రూపాయల గండి పడుతోంది. గతంలో అక్రమ వే బిల్లులతో గ్రానైట్‌ను తరలిస్తున్న వారిని జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో వారు చెప్పిన అక్రమాలు విన్న పోలీస్ అధికారులు సైతం నోరెళ్లబెట్టారు. ఈ లెక్కన ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది. ఇతర రాష్ట్రాల పేరుతో ఎక్కువ శాతం గ్రానైట్‌ను సొంత రాష్ట్రంలోనే అమ్ముతూ వ్యాపారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని విజిలెన్స్ అధికారులే పేర్కొంటుండటం గమనార్హం. జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ, గురిజేపల్లిలో 160 గెలాక్సీ గ్రానైట్ క్వారీలు, 31 బ్లాక్ పెరల్, 48 కలర్ గ్రానైట్, మొత్తం 239 క్వారీలున్నాయి. ఏడాదిలో బ్లాక్ గెలాక్సీ 3.60 లక్షల క్యూబిక్ మీటర్లు, బ్లాక్ పెరల్ 57 వేల క్యూబిక్ మీటర్లు, కలర్ గ్రానైట్లు 86 వేల క్యూబిక్ మీటర్ల రాయిని వెలికితీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వాస్తవంగా ఇంతకు రెట్టింపు గ్రానైట్ రాయిని క్వారీల నుంచి వెలికి తీస్తున్నట్లు సమాచారం. ఇందులో బ్లాక్ గెలాక్సీ 70 శాతం చైనాతో పాటు విదేశాలకు ఎగుమతి అవుతుండగా 30 శాతం మాత్రమే దేశవ్యాప్తంగా సరఫరా అవుతోంది. బ్లాక్ పెరల్ 30 శాతం విదేశాలకు,70 శాతం స్థానికంగా, కలర్ గ్రానైట్ 30 శాతం విదేశాలకు 70 శాతం స్థానికంగా అమ్ముడుపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతున్నా మై నింగ్ అధికారులు, రవాణాశాఖ, చెక్‌పోస్టులు, రెవె న్యూ, పోలీసు తదితర విభాగాలు అందిన కాడికి దండుకొంటూ అడ్డకోవడం లేదన్న ఆరోపణలు గు ప్పుమంటున్నాయి. మరోవైపు ఇక్కడి అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారిన మరికొందరు అధికారు లు ఎటువంటి తనిఖీలు నిర్వహించక ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నట్లు సమాచారం. -
పాలకపక్షమా... ఐతే ఓకే!
చెముడు సహకార సొసైటీలో రూ. 97.74లక్షల మేరకు అవకతవకలు జరిగాయి. ఇందులో బినామీ రుణాలే ఎక్కువగా ఉన్నాయి. కొందరికైతే రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు చూపించి మింగేశారు. మరికొందరికి తక్కువ మొత్తాల్లో రుణాలు మంజూరు చేసి రికార్డుల్లో ఎక్కువగా చూపించారు. ఇది ఏడాది క్రితమే వెలుగు చూసింది. కానీ రికవరీకి చర్యలు తీసుకోవడం లేదు. శాఖా పరమైన చర్యలంటూ తాత్సారం చేస్తున్నారు. క్రిమినల్ చర్యలకు పోవడం లేదు. గొట్లాం పీఏసీఎస్‌లో 1559మందికి సుమారు రూ.కోటి 3 లక్షలు బోగస్ రుణాల కింద అక్రమాలు జరిగినట్టు రెండేళ్ల క్రితమే తేల్చారు. కానీ ఇంతవరకు రికవరీకి చర్యలు తీసుకోలేదు. ఎందుకిలా చేస్తున్నారంటే ఆ రెండు సొసైటీలకూ అధికార పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నందునే. అందుకే వాటి జోలికి పోవడం లేదు. కేసులపై శ్రద్ధ చూపడంలేదు. శాఖా పరమైన ప్రక్రియ పేరుతో తాత్సారం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని పీఏసీఎస్‌ల్లో అక్రమాలు జరిగితే అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో ఒక్కోచోట ఒక్కోలా వ్యవహరిస్తున్నారు. వారి దృష్టి అంతా ఎంతసేపూ టీడీపీ ప్రత్యర్థుల సొసైటీలపైనే. అధికార పార్టీ ప్రాతినిధ్యం వహిస్తే చర్యలకు వెనుకాడుతున్నారు. విషయం గ్రహించిన ఉన్నతాధికారులు కాసింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో అక్రమాలు తేలినా రికవరీలోనూ... పోలీసు కేసులు పెట్టడంలోనూ అనుసరిస్తున్న వైఖరిపైనా ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది. తాజాగా చెముడు సొసైటీలో రూ. 97.74లక్షలు అక్రమాలు తేలినా పోలీసు కేసు పెట్టడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని జిల్లా సహకార అధికారులను ఉన్నతాధికారులు ప్రశ్నించారు. తక్షణమే కలెక్టర్‌కు పెట్టి చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. సొసైటీలో అక్రమాలు సర్వసాధారణమే... బినామీ రుణాలు, నిధుల దుర్వినియోగం సహకార సంఘాల్లో కొత్తేమీ కాదు. సెక్షన్ 51స్టాట్యుటరీ విచారణ, సెక్షన్ 52, 53పై విచారణలు అనేకం జరిగాయి. ఇటీవల కాలంలో 25 సహకార సంఘాల్లో బినామీల పేరుతో రుణాలు కాజేయడం, నిధుల దుర్వినియోగం, కొనుగోళ్లలో చేతివాటం వంటి అడ్డగోలు కార్యకలాపాలు జరిగినట్టు తేలింది.ఉన్నత న్యాయస్థానాల్లో ఉన్నవి పక్కన పెడితే 51స్టాట్యూటరీ విచారణ 17సొసైటీల్లో జరిగింది. రూ. 2.5కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు తేలింది. ఇందులో ఒక్క చెము డు సొసైటీలోనే రూ. 97.74లక్షల అవినీతి చోటు చేసుకుంది. అక్రమాలు, విచారణ జరిగి ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో రికవరీ జరగడం లేదు. అలాగే 52స్టాట్యూటరీ విచారణ ఏడు సొసైటీల్లో జరిగింది. ఇందులోనూ రూ. లక్షల్లో అవినీతి బయటికొచ్చింది. సెక్షన్ 53 ప్రకారం గొట్లాం పీఏసీఎస్‌లో విచారణ నిర్వహించి అక్రమాల్ని వెలికి తీశా రు. ఇందులో రూ.కోటి 3లక్షల మేర అక్రమాలు జరిగాయి. ఈ అవినీతికి చనిపోయిన సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శులే కారణమని అధికారులు తేల్చారు. కానీ బతికున్న సొసైటీ డెరైక్టర్లు, అందులో పనిచేసిన ఇతర సిబ్బందిని వదిలేశారు. వాస్తవానికైతే ఈ సొసైటీలో 51స్టాట్యుటరీ విచారణ జరపాలి. ఈ విచారణ జరిగితేనే చట్టబద్ధత ఉంటుంది. బ యటి వ్యక్తులు విచారణ చేపట్టడం ద్వారా మరింతగా అక్రమాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ రకమైన విచారణ జరగలేదు. అధికారుల తీరుపైనే అనుమానాలు న్యాయపరమైన ఇబ్బందులున్న వాటిని పక్కన పెడితే మిగిలిన చోట అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ సొసైటీల్లో అక్రమాలు జరిగినట్టు తేలినా వాటి జోలికెళ్లడం లేదు. చెముడు సొసైటీపై సీబీసీఐడీ విచారణ జరపాలని ఇక్కడ విచారణ జరిపిన అధికారి సిఫార్సు చేశారు. అక్రమాలు రూ. కోటి దాటలేదన్న కారణంగా సీబీసీఐడీ విచారణకు తిరస్కరించారు. కనీసం పోలీసు స్టేషన్లోనైనా కేసు పెట్టలేదు. చివరకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అక్రమాలు ఇలా... కొన్ని సొసైటీల్లో భూమి లేని వారిని సభ్యులుగా చేర్చి వారి పేరున రుణాలు తీసుకుని పాలక వర్గ సభ్యులు మింగేశారు. కొన్నిచోట్ల కొందర్ని కౌలు రైతులుగా చేర్పించి, వారి పేరునా, వారికి తెలియకుండా రుణాలు కాజేశారు. కొన్ని సొసైటీల్లో షేర్ కేపిటల్‌కు సంబంధం లేకుండా రుణాలిిప్పించేసి కుట్ర పూరితంగా నిధులు దుర్వినియోగం చేశారు. సొసైటీలో సభ్యుడిగా చేరితే రూ.300షేర్ కేపిటల్‌తో పాటు అడ్మినిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆ మేరకే రుణ పరిమితి నిర్దేశిస్తారు. చాలా సొసైటీల్లో అడ్డగోలుగా రుణాలు ఇచ్చేసినట్టు తెలిసింది. కొన్ని సొసైటీల్లో సభ్యుడికి తెలియకుండా సభ్యత్వం చేర్పించి, వారి పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసి రుణాలు తీసేసుకున్నారు. -
ఎక్కడిదొంగలు అక్కడనే.. ష్... గప్ చుప్!
- గుట్టుగా సర్దుకుంటున్న అక్రమార్కులు - లొసుగులు బయటపడకుండా జాగ్రత్త - దాచిన ఫైళ్లు బీరువాల్లో ప్రత్యక్షం - ఆగమేఘాలపై పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ - ఒక్కరోజులోనే 30 ఫైళ్లకు గ్రీన్‌సిగ్నల్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో ప్రస్తుత పరిస్థితి ‘ఎక్కడి దొంగలు అక్కడే... గప్ చుప్’ అన్నట్లుగా ఉంది. కొత్త కమిషనర్‌గా శాలినీ మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరిస్తుండటంతో అక్రమార్కుల గుండెల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. తమ పరిధిలోని ఫైళ్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో.. ? లేదోనన్న విషయాన్ని మరోసారి పరిశీలించుకొని వాటిని ఓ క్రమపద్ధతిలో పెట్టుకొన్నారు. కొత్త కమిషనర్ చార్జి తీసుకున్న వెంటనే విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తే... ఎక్కడా లొసుగులు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఏదైనా ఫైల్‌పై కమిషనర్ ఆరా తీస్తే అందరూ ఒకే విధంగా సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేకించి ప్లానింగ్ విభాగంలో ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు ఒకే మాట... ఒకే బాట.. అన్నట్లుగా వ్యవహరించేందుకు పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నట్లు వినికిడి. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ఫైళ్లకు బుధవారం దుమ్ము దులిపారు. వీటిలో ఇప్పటికే హెచ్ఎండీఏకు డబ్బు చెల్లించి ఉన్న ఫైళ్లను ఆగమేఘాలపై విడుదల చేశారు. నిజానికి వీటికి సంబంధించి నిర్ణీత ఫీజు చెల్లింపులు జరిగినా ... మూమూళ్లు ముట్టలేదన్న కారణంతో వాటిని పక్కకు పెట్టారు. అయితే... వీటిపై ఫిర్యాదులు వస్తే దొరికిపోతామన్న ఉద్దేశంతో వాటిని బుధవారం నాడే విడుదల చేశారు. కొన్ని ఫైళ్లకు సపోర్టు డాక్యుమెంట్లు లేవన్న సాకుగా చూపుతూ రిజెక్టు చేస్తూ మరికొన్నింటికి డీసీ లెటర్లు పంపడం గమనార్హం. ఇటీవల వరకు ఇన్స్పెక్షన్ల పేరుతో బయటకు వెళ్లి సొంత పనులు చక్కబెట్టుకొంటున్న కొందరు అధికారులు బుధవారం సాయంత్రం వరకు కార్యాయలంలో కూర్చొని ఫైళ్లను పక్కాగా సర్దిపెట్టుకొన్నారు. ఇదే తరుణంలో కొన్ని అనుమతుల విషయంలో అక్రమాలు, అవకతవకలు బయటపడకుండా ఆయా ఫైళ్లను దాచేశారు. ఇదే క్రమంలో గతంలో తమ ఇళ్లలో దాచేసిన ఫైళ్లను గుట్టుగా బ్యాగుల్లో తెచ్చి బీరువాల్లో పెట్టేశారు. ఇన్వార్డ్... అవుట్ వార్డ్ రిజిస్టర్లను సైతం సరిదిద్ది జాగ్రత్త చేశారు. రూ.4-5 కోట్లు జుర్రేశారు.. కొత్త కమిషనర్ చార్జి తీసుకొంటే అక్రమాలకు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారులు చ క్రం తిప్పారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ఫైళ్ల క్లియర్ చేసి సుమారు రూ.4-5కోట్లు దండుకొన్నట్లు హెచ్ఎండీఏలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అన్ని అనుమతులున్న ఫైళ్లకు అప్రూవల్ ఇస్తూ అందినకాడికి జుర్రుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రత్యేకించి ఘట్కేసర్, శంకర్పల్లి, శామీర్‌పేట, మేడ్చల్ జోనల్ కార్యాలయాల పరిధిలో అనాథరైజ్డ్ లేఅవుట్లు ఇటీవల నోటీసులు జారీ చేశారు. వీటిని అందుకొన్న రియల్టర్లు బుధవారం తార్నాకకు వచ్చి ఆ జాబితాలో తమ పేర్లు లేకుండా పెద్దసార్లను కలిసి భారీగా ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. మేడ్చల్, సంగారెడ్డి, శామీర్‌పేట ప్రాంతాల్లోని పరిశ్రమలకు సంబంధించిన ఫైళ్లను బుధవారం నాడే క్లియర్ చేయడం గమనార్హం. అలాగే లేఅవుట్లు, గ్రూపు హౌసింగ్ కాలనీలకు కూడా పెద్దసంఖ్యలో అనుమతులు మంజూరు చేశారని సిబ్బందే చెప్తున్నారు. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు పలువురు అధికారులు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని పూర్తిచేయడంతో బుధవారం హెచ్ఎండీఏలో అక్రమార్కుల కాసుల వర్షం కురిసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. వీరిని పట్టించుకొనే నాథుడే లేకపోవడంతో తార్నాకలో ఒక్క రోజులోనే కోట్లాది రూపాయలు చేతులు మారాయన్నది బహిరంగ రహస్యమే. -
విచారణలో బయటపడని ‘సత్యం’
* విచారణకు వెళ్లిన అధికారిణికి చుక్కెదురు * హాస్టల్లో విద్యార్థులు, రికార్డులు లేకపోవడంతో వెనుదిరిగిన వైనం * నామమాత్రంగా వార్డెన్ అవినీతిపై విచారణ * రికార్డుల మాయం తప్పించుకోవడానికేనా ? ఇందూరు: విద్యార్థులకు పెట్టాల్సిన పౌష్టికాహారం లో కోతలు.. సక్రమంగా అమలు కాని మె నూ.. విద్యార్థులను హాస్టల్ నుంచి బయటకు వెళ్లగొట్టిన సంఘటన.. ఏసీబీ అధికారుల దాడులు.. వెరసి కామారెడ్డి బీసీ బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్ సత్యం చేసిన అక్రమాలు బయటపడ్డాయి. దీంతో వార్డెన్‌ను అప్పటి ఇన్చార్జి కలెక్టర్ సస్పెండ్ చేశారు. కానీ అడ్డదారిలో తిరిగి రెండు మూడు రోజుల్లోనే డిప్యూటేషన్‌పై బాన్సువాడ ఎస్టీ బాలుర హాస్టల్ వార్డెన్‌గా ఉద్యోగంలో చేరిన వి షయం తెలిసిందే. పై విషయాలపై గతంలో ‘సాక్షి’ కథనాలు కూడా ప్రచురించింది. దీనికి తోడుగా సెప్టెంబర్ నెలలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు వార్డెన్ అక్రమాలపై విచారణ జరిపించాలని కలెక్టర్‌కు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారికి కూడా ఫిర్యాదు చేశారు. ఇందుకు వార్డెన్ చేసిన అక్రమాలు నిజమో కాదో తెలుసుకునేందుకు సాంఘిక సంక్షేమ శాఖ కామారెడ్డి ఏఎస్‌డబ్ల్యుఓ అ ల్ఫన్సా అనే అధికారిణిని విచారణ అధికారి గా నియమించారు. దీంతో ఆమె విచారణ చేపట్టేందుకు ఈ నెల 13వ తేదీ సోమవారం రోజు రాత్రి సమయంలో కామారెడ్డి బీసీ కళాశాల హాస్టల్‌కు వెళ్లారు. విద్యార్థులకు పెట్టాల్సిన భోజన మెనూ అమలు చేయకుండా వార్డెన్ అక్రమాలకు పాల్పడ్డాడో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకోవాలనుకున్నారు. కానీ అక్కడ విద్యార్థుల అసలు సంఖ్య 82కు బదులుగా 42 మంది విద్యార్థులున్నారు. న గదు పుస్తకం, సరుకుల స్టాక్ రిజిష్ట్రర్ల ద్వారా నిజాలు తెలుసుకోవచ్చని రికార్డుల కోసం వెతికారు. దొరక్కపోవడంతో విచారణ సరిగ్గా చేపట్టలేకపోయారు. దీంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే తనపై విచారణ చేయడానికి వచ్చిన అధికారిణికి సదరు వార్డెన్ ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిసింది. ఈ కారణంతో కూడా విచారణచేయడానికి ఆమె వెనకడుగు వేసినట్లుగా సమాచారం. తాను హాస్టల్‌కు వెళ్లానని, ఫాస్ట్ పథకం దరఖాస్తుల కారణంగా అక్కడ విద్యార్థులు అందుబాటులో లేరని అందుకే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేదని జిల్లా బీసీసంక్షేమ శాఖ అధికారికి రిపోర్టు చేశారు. తాను ఇకపై విచారణ చేయబోనని, ఆరోగ్య సమస్య ఉందని తెలిపి విచారణ అధికారిగా బాధ్యతలను తొలగించుకున్నారు. ప్రస్తుతం సదరు వార్డెన్ అక్రమాలపై విచారణచేయడానికి ఇతర అధికారులు ఎవ్వరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో విచారణకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. రికార్డుల మాయం వెనుక మర్మమేమిటో విచారణ అధికారిణి అల్ఫన్సా విచారణకు రాకముందే నగదు పుస్తకం, సరుకుల స్టాక్ రిజిష్ట్రర్లు వార్డెన్ స త్యం మాయం చేశాడు. డిప్యుటేషన్‌పై బా న్సువాడ ఎస్టీ బాలుర హస్టల్‌కు వెళుతూ కామారెడ్డి బీసీ హాస్టల్లో ఉన్న ముఖ్యమైన రిజిష్ట్రర్లు తన వెంట తీసుకెళ్లాడు. రికార్డులు తీసుకెళ్లిన విషయం అధికారులకు విచారణకు వెళితేగాని తెలియకపోవడం గమనార్హం. విచారణ సమయంలో ఎవరూ లేరు... సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో కామారెడ్డి బీసీ బాలుర కళాశాల హాస్టల్‌కు వార్డెన్ ‘అక్రమ’ ఆరోపణలపై విచారణచేయడానికి వెళ్లాను. అయితే అక్కడ విద్యార్థులు సరిపడా లేరు. రికార్డులు కూడా సక్రమంగా లేవు. అందుకే విచారణను చేపట్టలేకపోయాను. - అల్ఫన్సా, విచారణ అధికారిణి వార్డెన్‌పై చర్యలు తీసుకునేంత వరకు ఊరుకోం... అక్రమాలకు పాల్పడి విద్యార్థుల పొట్టగొట్టిన వార్డెన్ సత్యంపై చర్యలు తీసుకునేంత వరకూ ఊరుకోం. విచారణ చేసిన అధికారికి సరైన ఆధారాలు దొరక్కా విచారణ సక్రమంగా జరగలేదు. వెంటనే ఈ రికార్డులు వార్డెన్ నుంచి తెప్పించి, విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుని చట్టపర చర్యలు చేపట్టాలి. లేదంటే ఇలాంటి వార్డెన్లు చాలా మంది పుట్టుకొస్తారు. యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతారు. - శ్రీనివాస్‌గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ర్ట అధ్యక్షుడు -
టీడీపీ నాయకుల అక్రమాలు
జిల్లాలో టీడీపీ నాయకుల అక్రమాలు, ఆరాచకాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. చివరికి తమ రాజకీయ స్వార్థం కోసం వారు ఆలయూలు, మసీదులను కూడా విడిచిపెట్టడం లేదు. మత సామరస్యాన్ని పెంపొందిస్తూ... మత పవిత్రతను కాపాడే అనుభ వజ్ఞులైన మత పెద్దలు ఉండాల్సిన చోట రాజకీయ నాయకులను, ఉద్యోగులను నియమించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాల్సిన ఎన్నికలను నిలిపి వేసి నామినేటెడ్‌గా తమ పార్టీ వారిని అధ్యక్షుడిగా నియమించుకునేందుకు యత్నాలు చేస్తున్నారు. విజయనగరం కంటోన్మెంట్ : జిల్లా కేంద్రంలోని జామి యా మసీదు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ మసీదు మేనేజ్మెంట్ కమిటీకి వ చ్చే నెల 2వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మసీదులకు రోజుకు ఐదుసార్లు వచ్చే ముస్లింలే ఓట ర్లు.వీరిని ముసల్లీలు అంటారు. రోజు కు ఐదుసార్లు, ప్రతి శుక్రవారం వచ్చే ముసల్లీలను మసీదులోని మత పెద్ద (మౌజన్ అంటారు) గుర్తిస్తారు. ఇక్కడి మసీదుకు రోజుకు ఐదుసార్లు వచ్చేవా రు సుమారు 50 మంది వరకూ ఉంటా రు. ప్రతి శుక్రవారం వచ్చే వారు 300 మందిపైగా ఉన్నారు. వీరిని గుర్తించి జా బితా తయారు చేస్తారు. ఇటీవల వర్క్ ఇన్స్పెక్టర్ జామి యా మసీదులో ముసల్లీల లిస్టు కోసం (కమిటీని ఎన్నుకు నే ఓటర్లు) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మసీదుకు వచ్చారు. మసీదుకు అర్హులైన ముసల్లీల జాబితాను సిద్ధం చేయాలని మౌజన్‌కు చెప్పగా...ఆయన సంబంధిత నోటిఫికేషన్‌ను నో టీస్ బోర్డులో అంటిస్తుండగా టీడీపీ నా యకులు, వక్ఫ్ బోర్డు వకీలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మీసాల గీతతో ఫోన్ చేయించి వర్క్ ఇన్స్పెక్టర్ను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించారు. దీం తో వెనక్కి వెళ్లిపోతున్న వర్క్ ఇన్స్పెక్టర్ ను ఇతర ముస్లిం పెద్దలంతా.. నోటీసు అంటించకుండా ఎందుకు వెళ్లిపోతున్నారని ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం రంజాన్ కావడంతో ఇబ్బందులు వస్తాయని, పండగ తరువాతకమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అరుుతే రంజాన్ జరిగి సుమారు 20 రోజులవుతున్నా ఇప్పటివరకూ ముసల్లీల లిస్టు కూడా తయారు చేయకపోవడంతో మత పెద్దంతా డీఆర్ఓకు ఫిర్యా దు చేశారు. గతంలో ఈ ఎన్నిక నేరుగా నిర్వహించాలని, నామినేటెడ్ కమిటీ వే యకూడదని అప్పటి ఎమ్మెల్యే అశోక్ చెప్పారన్న విషయాన్ని ఫిర్యాదులో పే ర్కొన్నారు. ఆలయాలు, మసీదుల పవిత్రతను కాపాడాలని, ఇటువంటి చో ట రాజకీయం చేయడం సరికాదని తెలి పారు. కాగా జిల్లాలోనే అతి పెద్దదైన జా మియా మసీదుకు షాపింగ్ కాంప్లెక్సుల అద్దెల ద్వారా ప్రతి నెలా సుమారు రూ. 80 వేల వరకూ ఆదాయం వస్తోంది. ఈ ఆదాయంతో పాటు ఎంతోమంది దా తలు లక్షలాది రూపాయల విరాళాలు ఇస్తున్నారు. వీటన్నింటి లెక్కలకు రికార్డులు రాయాల్సి ఉంది. ఈ మేరకు మత పెద్దలను ప్రజాస్వామ్యబద్ధంగా కమిటీగా ఎన్నుకోవాల్సి ఉంది. అరుుతే ఇందులో కూడా టీడీపీ నాయకులు రాజకీయం చేయడం సరికాదని అబ్దుల్ సుభాన్, ఇతర ముస్లిం పెద్దలు పేర్కొం టున్నారు. వెళ్లి పరిశీలిస్తా! ఈ విషయమై వక్ఫ్ బోర్డు ఇన్చార్జి, డీఆర్ఓ హేమసుందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ముసల్లీల జాబితాను ముందుగా సిద్ధం చేయాలన్నారు. కానీ జాబితా తయూరులో ఎందుకు జాప్యం జరిగిందో సోమవారం వెళ్లి పరిశీలిస్తానని చెప్పారు. ముసల్లీలు ఎంతమందో గుర్తించాక బోర్టులో పెడతా మని, దీనిపై అభ్యంతరాలుంటే స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం వక్ఫ్ బోర్డు ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. :హేమసుందర్, డీఆర్వో, వక్ఫ్ బోర్డు ఇన్‌ఛార్జి -
శ్రీకాకుళం జిల్లాలో గ్లూకోజ్ విక్రయాల్లో అక్రమాలు