టీడీపీ నాయకుల అక్రమాలు | TDP leaders impropriety in Vizianagaram | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుల అక్రమాలు

Published Mon, Aug 18 2014 1:36 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

టీడీపీ నాయకుల అక్రమాలు - Sakshi

టీడీపీ నాయకుల అక్రమాలు

 జిల్లాలో టీడీపీ నాయకుల అక్రమాలు, ఆరాచకాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. చివరికి తమ రాజకీయ స్వార్థం కోసం వారు ఆలయూలు, మసీదులను కూడా విడిచిపెట్టడం లేదు. మత సామరస్యాన్ని పెంపొందిస్తూ... మత పవిత్రతను కాపాడే అనుభ వజ్ఞులైన మత పెద్దలు ఉండాల్సిన చోట రాజకీయ నాయకులను, ఉద్యోగులను నియమించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాల్సిన ఎన్నికలను నిలిపి వేసి నామినేటెడ్‌గా తమ పార్టీ వారిని అధ్యక్షుడిగా నియమించుకునేందుకు యత్నాలు చేస్తున్నారు.
 
 విజయనగరం కంటోన్మెంట్ : జిల్లా కేంద్రంలోని జామి యా మసీదు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ మసీదు మేనేజ్‌మెంట్ కమిటీకి వ చ్చే నెల 2వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మసీదులకు రోజుకు ఐదుసార్లు వచ్చే ముస్లింలే ఓట ర్లు.వీరిని ముసల్లీలు అంటారు. రోజు కు ఐదుసార్లు, ప్రతి శుక్రవారం వచ్చే ముసల్లీలను మసీదులోని మత పెద్ద (మౌజన్ అంటారు) గుర్తిస్తారు. ఇక్కడి మసీదుకు రోజుకు ఐదుసార్లు వచ్చేవా రు సుమారు 50 మంది వరకూ ఉంటా రు. ప్రతి శుక్రవారం వచ్చే వారు 300 మందిపైగా ఉన్నారు. వీరిని గుర్తించి జా  బితా తయారు చేస్తారు.
 
 ఇటీవల వర్క్ ఇన్‌స్పెక్టర్ జామి యా మసీదులో ముసల్లీల లిస్టు కోసం (కమిటీని ఎన్నుకు నే ఓటర్లు) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మసీదుకు వచ్చారు. మసీదుకు అర్హులైన   ముసల్లీల జాబితాను సిద్ధం చేయాలని మౌజన్‌కు చెప్పగా...ఆయన సంబంధిత నోటిఫికేషన్‌ను నో టీస్ బోర్డులో అంటిస్తుండగా టీడీపీ నా యకులు, వక్ఫ్ బోర్డు వకీలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మీసాల గీతతో ఫోన్ చేయించి వర్క్ ఇన్‌స్పెక్టర్‌ను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించారు. దీం తో వెనక్కి వెళ్లిపోతున్న వర్క్ ఇన్‌స్పెక్టర్ ను ఇతర ముస్లిం పెద్దలంతా.. నోటీసు అంటించకుండా ఎందుకు వెళ్లిపోతున్నారని ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం రంజాన్ కావడంతో ఇబ్బందులు వస్తాయని, పండగ తరువాతకమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.
 
 అరుుతే రంజాన్ జరిగి సుమారు 20 రోజులవుతున్నా ఇప్పటివరకూ ముసల్లీల లిస్టు కూడా తయారు చేయకపోవడంతో మత పెద్దంతా డీఆర్‌ఓకు ఫిర్యా దు చేశారు. గతంలో ఈ ఎన్నిక నేరుగా నిర్వహించాలని, నామినేటెడ్ కమిటీ వే యకూడదని అప్పటి ఎమ్మెల్యే అశోక్ చెప్పారన్న విషయాన్ని ఫిర్యాదులో పే ర్కొన్నారు. ఆలయాలు, మసీదుల పవిత్రతను కాపాడాలని, ఇటువంటి చో ట రాజకీయం చేయడం సరికాదని తెలి పారు. కాగా జిల్లాలోనే అతి పెద్దదైన జా మియా మసీదుకు షాపింగ్ కాంప్లెక్సుల అద్దెల ద్వారా ప్రతి నెలా సుమారు రూ. 80 వేల వరకూ ఆదాయం వస్తోంది. ఈ ఆదాయంతో పాటు ఎంతోమంది దా తలు లక్షలాది రూపాయల విరాళాలు ఇస్తున్నారు. వీటన్నింటి లెక్కలకు రికార్డులు రాయాల్సి ఉంది. ఈ మేరకు    మత పెద్దలను ప్రజాస్వామ్యబద్ధంగా కమిటీగా ఎన్నుకోవాల్సి ఉంది. అరుుతే ఇందులో కూడా టీడీపీ నాయకులు రాజకీయం చేయడం సరికాదని అబ్దుల్ సుభాన్, ఇతర ముస్లిం పెద్దలు పేర్కొం టున్నారు.
 
 వెళ్లి పరిశీలిస్తా!
 ఈ విషయమై వక్ఫ్ బోర్డు ఇన్‌చార్జి, డీఆర్‌ఓ హేమసుందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ముసల్లీల జాబితాను ముందుగా సిద్ధం చేయాలన్నారు. కానీ జాబితా తయూరులో ఎందుకు జాప్యం జరిగిందో సోమవారం వెళ్లి పరిశీలిస్తానని చెప్పారు. ముసల్లీలు ఎంతమందో గుర్తించాక బోర్టులో పెడతా  మని, దీనిపై అభ్యంతరాలుంటే స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం వక్ఫ్ బోర్డు ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.          
:హేమసుందర్, డీఆర్వో, వక్ఫ్ బోర్డు ఇన్‌ఛార్జి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement