Jamia Masjid
-
జామియా మసీదులో మళ్లీ ప్రార్థనలు
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని నౌహరిహట్టా ప్రాంతంలోని జామియా మిలియా మసీదులో జరిగే రోజువారీ సామూహిక ప్రార్థనలు బుధవారం తొలిసారిగా ప్రారంభమయ్యాయి. జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన, ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అధికారులు ఆగస్టు 5న ఈ మసీదుకు సంబంధించిన అన్ని మార్గాలను మూసివేశారు. అప్పట్నుంచి మసీదులో ప్రార్థనలు జరుపుకునేందుకు వీలులేకుండా పోయింది. అయితే 136 రోజుల అనంతరం ఈ మసీదును బుధవారం మధ్యాహ్నం నుంచి తెరిచి సామూహిక ప్రార్థనలకు ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. -
శ్రీనగర్‌లో తెరుచుకున్న జామియా మసీదు
శ్రీనగర్ : నగరంలోని చారిత్రాత్మక జామియా మసీదు బుధవారం తెరుచుకుంది. ఆగస్ట్ 5 వ తేదీన జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత భద్రతా కారణాల రీత్యా మసీదును మూసేశారు. మసీదు ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద భద్రతా బలగాలను మొహరించారు. దాదాపు 135 రోజుల పాటు ఈ మసీదును మూసివేయగా, ఇన్ని రోజులు మూసేయడం మసీదు చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణగడంతో ప్రధాన గేట్ల వద్ద భద్రతా సిబ్బందిని తొలగించారు. ఈ నేపథ్యంలో మసీదు నిర్వహణ చూసే కమిటీ మంగళవారం సమావేశమై మసీదులో ప్రార్థనలు చేయాలని నిర్ణయించింది. దాంతో బుధవారం మధ్యాహ్నం మసీదులో సామూహిక ప్రార్ధనలు చేశామని, దాదాపు 100 నుంచి 150 మంది ఈ ప్రార్థనలో పాల్గొన్నారని కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. ప్రస్తుతం చలి ఎక్కువగా ఉన్న దృష్ట్యా కేవలం మధ్యాహ్నం మాత్రమే ప్రార్థనలు నిర్వహిస్తామని కమిటీ సభ్యుడు తెలిపారు. నవంబర్ 22 నుంచి ఈ ప్రాంతంలో ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ బలగాలు పెద్ద సంఖ్యలో మొహరించడంతో ప్రార్థనలకు అనుమతించలేదు. ప్రస్తుత పరిణామంపై స్థానికుడు ఐజాజ్ అహ్మద్ హర్షం వ్యక్తం చేస్తూ.. చాలా మంది ఉదయం నుంచీ మసీదు ఆవరణను శుభ్రం చేయడంలో పాల్గొన్నారు. కొంతమంది ఉద్వేగానికి లోనై మసీదు స్తంభాలను ముద్దు పెట్టుకొన్నారు. చాలా రోజుల తర్వాత నమాజు చేయడంతో మేమంతా సంతోషంగా ఉన్నాం. మసీదు అంటే దేవుని ఇల్లు. దయచేసి ఇక్కడ కర్ఫ్యూ విధించవద్దని నా అభ్యర్థన అంటూ ముగించాడు. -
డీఎస్పీని కొట్టిచంపారు!
శ్రీనగర్‌లో మసీదు ముందే కిరాతకం - శుక్రవారం ప్రార్థనలకు భద్రతగా వచ్చిన డీఎస్పీ - పరిస్థితులు సమీక్షిస్తుండగా ఒక్కసారిగా దాడి శ్రీనగర్: కశ్మీర్‌లోని మసీదు ముందే ఓ అల్లరిమూక రెచ్చిపోయింది. శ్రీనగర్‌లోని చారిత్రక జామియా మసీదు ముందు భద్రతకోసం వచ్చిన ఓ డీఎస్పీ అధికారిని బట్టలూడదీసి మరీ కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపేసింది. రంజాన్‌లో పవిత్రమైన చివరి శుక్రవారం మసీదు ముందే ఇలాంటి దారుణమైన ఘటన యావద్భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ఘాటుగా స్పందించారు. పోలీసులతో ఇలా అమానుషంగా, అవమానకరంగా వ్యవహరిస్తుంటే.. ఇంకెంతకాలం వాళ్లు ఓపికగా ఉంటారన్నారు. పోలీసుల సహనం నశిస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ ఘటన ఇస్లాం మత విశ్వాసాలు, విలువలకు పూర్తి విరుద్ధమని వేర్పాటువాద నేత మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. అసలేం జరిగింది? రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా గురువారం అర్ధరాత్రి వరకు జామియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో మసీదు నుంచి ప్రార్థనలు చేసిన వారంతా బయటకు వస్తున్నారు. మసీదు వద్ద శుక్రవారం ప్రశాంతంగా ప్రార్థనలు జరిగేలా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. డీఎస్పీ మహ్మద్ అయూబ్ పండిత్ కూడా ప్రార్థనామందిరం లోపల భద్రతను సమీక్షించి బయటకు వస్తున్నారు. అంతలోనే అక్కడున్న కొందరు యువకులు డీఎస్పీపై ముష్టిఘాతాలతో విరుచుకుపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అయూబ్ బట్టలూడదీసి మరీ చితగ్గొట్టారు. చచ్చిపోతున్నాను వదలమని అర్థించినా వదలకుండా కొట్టి చంపారు. అయితే తనను తాను రక్షించుకునేందుకు అయూబ్ మూడు రౌండ్లు కాల్పులు జరిపారని దీంతో ముగ్గురికి గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భద్రతకోసం వచ్చి వారిచేతుల్లోనే! మసీదు లోపలినుంచి వస్తున్నవారి ఫొటోలను తీస్తున్నసమయంలో దాడి జరిగినట్లు తెలిసింది. తమను ఫొటో తీయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు డీఎస్పీపై దాడికి పాల్పడ్డారని.. వీరినుంచి తననుతాను కాపాడుకునేందుకు అయూబ్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తులై డీఎస్పీని కొట్టి చంపినట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత రావటంలేదు. ‘మసీదుకు వచ్చే వారి రక్షణ కోసమే అయూబ్ విధులు నిర్వహిస్తున్నారు. కానీ తమ భద్రతకోసం వచ్చిన పోలీసు అధికారినే కొట్టి చంపటం దురదృష్టకరం’ అని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మసీదులో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగిందని ప్రాథమిక విచారణ అనంతరంవెల్లడించారు. డీఎస్పీని కొట్టి చంపిన తర్వాత అక్కడున్న పోలీసు ఔట్‌పోస్టులనూ ధ్వంసం చేశారు. పోలీసు బలగాలు రంగంలోకి దిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పాయి. డీఎస్పీ హత్యకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేయగా.. మరొ వ్యక్తిని గుర్తించినట్లు జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు. ‘డీఎస్పీ ఆత్మరక్షణ కోసమే మూడురౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. అది అతని హక్కు’ అని డీజీపీ పేర్కొన్నారు. వారి సహనం నశిస్తే అడ్డుకోలేం: ముఫ్తీ హత్యకుగురైన డీఎస్పీ మృతదేహం వద్ద జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ నివాళులర్పించారు. ‘ఇంతకన్నా మరో అవమానకరమైన విషయం వేరొకటి ఉంటుందా? మా ప్రజలతో వ్యవహరిస్తున్నామన్న ఆలోచనతోనే పోలీసులంతా చాలా ఓపికగా ఉన్నారు. డీఎస్పీ ప్రజలను కాపాడే బాధ్యతలోనే మసీదుకెళ్లారు. సొంతపనిమీద కాదు. కానీ ఇలా వీరు ఓపికగా ఎంతకాలం ఉండాలి? వారి సహనం నశిస్తే పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయి’ అని హెచ్చరించారు. డీఎస్పీని కొట్టి చంపిన వారు నరకానికి పోతారని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ ఘటన దిగజారుడుతనానికి పరాకాష్ట అని కాంగ్రెస్ నేత రాహుల్ పేర్కొన్నారు. -
వారు నరకంలో కాలిపోతారు!!
శ్రీనగర్: శ్రీనగర్‌లోని ఓ ప్రముఖ మసీదు ఎదుట డీఎస్పీని కొట్టిచంపిన ఘటనపై రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. జామియ మసీదు ఎదుట డీఎస్పీ ఆయూబ్ పండిత్‌ను ఓ అల్లరి మూక దారుణంగా కొట్టిచంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అత్యంత సిగ్గుచేటు అని సీఎం మెహబూబా ముఫ్తీ ఖండించగా.. ప్రతిపక్ష నేత, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయూబ్ పండిట్‌ను కొట్టిచంపిన తీరు అధిక్షేపణీయమన్నారు. 'డీఎస్పీ పండిత్‌ను కొట్టిచంపిన వారు తమ పాపాలకు నరకంలో కాలిపోదురుగాక' అంటూ ఆయన ట్వీట్ చేశారు. వేర్పాటువాద నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ కూడా ఈ ఘటనను తప్పుబట్టారు. 'నౌహాట్టాలో చోటుచేసుకున్న అనాగరిక చర్య తీవ్రంగా కలిచివేస్తోంది. మూక హింస, బహిరంగంగా కొట్టిచంపడం మన విలువలకు, మతానికి వ్యతిరేకం. ప్రభుత్వ కూర్రత్వం మన మానవత్వాన్ని, విలువలను హరించకుండా మనం చూడాలి' అని ఆయన అన్నారు. చదవండి: మసీదు ముందు డీఎస్పీని కొట్టిచంపేశారు! -
ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు: సీఎం
శ్రీనగర్: శ్రీనగర్‌లోని జామియా మసీదు వద్ద డీఎస్పీని ఒక అల్లరి మూక కొట్టిచంపిన ఘటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతకన్నా సిగ్గులేని చర్య మరొకటి ఉండదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే జమ్మూకశ్మీర్ పోలీసులు ఉత్తమ సేవలు అందిస్తున్నారని, సొంతవారన్న స్పృహతో ప్రజలను ఎదుర్కోవడంలో ఎంతో నిగ్రహం పాటిస్తున్నారని, అయినా ఇలాంటి దారుణానికి పాల్పడటం బాధాకరమని ఆమె అన్నారు. మూక దాడిలో అమరుడైన డీఎస్పీ మహమ్మద్ ఆయూబ్ పండిట్‌కు ఆమె నివాళులర్పించారు. చదవండి: మసీదు ముందు డీఎస్పీని కొట్టిచంపేశారు! -
చిచ్చురేపిన సిఫారస్ లేఖ
– జామియా మసీదు కార్యవర్గం ఎంపిక వాయిదా –రెండువర్గాల మధ్య విభేదాలు –కారణమైన కోడుమూరు ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు కోడుమూరు: పట్టణంలోని జామియా మసీదు కార్యవర్గం ఎంపికపై అనాలోచితంగా ఎమ్మెల్యే సిఫారస్ లేఖ ఇచ్చి రెండు వర్గాల మధ్య చిచ్చురేపాడు. ముస్లిం మత పెద్దల ఒప్పందంతో కోడుమూరు పట్టణానికి చెందిన జబ్బార్‌హుసేన్ 13ఏళ్ల నుంచి జామియా మసీదుకు ముతవల్లిగా కొనసాగుతున్నాడు. మరోవర్గానికి చెందిన డాక్టర్ షాకీర్అహమ్మద్ జామియా మసీదుకు ముతవల్లిగా కొనసాగేందుకు పోటీకి దిగాడు. జబ్బార్‌హుసేన్ 13ఏళ్లుగా మసీదు అభివృద్ధిని పట్టించుకోలేదు, ఇతరులకు అవకాశమివ్వాలని డాక్టర్ షాకీర్అహమ్మద్ పోటీకి దిగడంతో కార్యవర్గం ఎంపిక సమస్యగా మారింది. ఈ విషయంపై ఎమ్మెల్యే మణిగాందీ జోక్యం చేసుకుని జబ్బార్హుసేన్ను ముతవల్లిగా కొనసాగించాలని 2016మే 19న స్టేట్ వక్ఫ్‌బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు సిఫారస్ లేఖ ఇచ్చారు. దాని ఆధారంగా జబ్బార్హుసేన్ను ముతవల్లిగా కొనసాగించాలని మే 30న అబ్దుల్‌ఖాదీర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం మరికొందమంది రాజకీయ నేతలు ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకురావడంతో జబ్బార్‌హుసేన్ స్థానంలో షాకీర్అహమ్మద్ను నియమించాలని మరో లేఖను వక్ఫ్‌బోర్డుకు పంపారు. దీంతో అధికారులు తీవ్ర గందరగోళానికి గురై కార్యవర్గ ఎంపికను నిలుపుదల చేశారు. దీంతో ముస్లింల మధ్య విభేదాలు తలెత్తి కార్యవర్గం ఎంపిక శాంతిభద్రతల సమస్యగా మారింది. ముందస్తు జాగ్రత్తగా సీఐ డేగల ప్రభాకర్, ఎస్ఐ మహేష్‌కుమార్ ఇరువర్గాలను పిలిపించి రాజీ చేసి కార్యవర్గ ఎంపిక సజావుగా జరిగేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసినా పరిష్కారం కాలేదు. ఎమ్మెల్యే అనాలోచితంగా ఇరువర్గాలకు సిఫారస్ లేఖ ఇవ్వడంతోనే ముస్లి ల మధ్య వర్గ విభేదాలు వచ్చాయని కోడుమూరు పట్టణ ముస్లిం ఏక్బాల్ ఆరోపించాడు. ఈనెల 25న కోడుమూరులో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తికి ఎమ్మెల్యే మణిగాంధీపై ఫిర్యాదు చేసేందుకు ముస్లింలు సిద్ధమవుతున్నారు. అవసరమైతే ఆ రోజు నిరసన తెలియజేసి సమస్యను డిప్యూటీ సీఎం దష్టికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
'యువత అప్రమత్తంగా ఉండాలి'
మహబూబ్‌నగర్: సమాజంలో కొంతమంది తమ స్వార్థం కోసం యువతను మభ్యపెడుతున్నారని, వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. యువత పెడదోవ పట్టకుండా దైవభక్తితో సన్మారంలో నడవాలని పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ జామీయామసీద్లో నిర్మించిన ప్రధానద్వారం(బాబుద్దాఖ్ల)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మసీదు ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. కంప్యూటర్ ద్వారా ఇస్లాంను నేర్చుకోలేరని, మతపెద్దలు దగ్గరికి వెళ్లి నేర్చుకుంటే వస్తుందన్నారు. రంజాన్ తరువాత ప్రతిఒక్క ముస్లిం ఐదుపూటలా నమాజుచేయాలని కోరారు. తమ సంపాదనలో సమాజసేవకు వినియోగించాలని సూచించారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
శ్రీకాకుళం కల్చరల్:బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో సోమవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదుల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నాపెద్ద అనే తారతమ్యం లేకుండా ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణంలోని జీటీ రోడ్డులో ఉన్న జామియా మసీదులో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జామియా మసీదుకు చెందిన ముఫ్తీ మెహతాబ్ ఆలం మాట్లాడుతూ మంచికి, మానవత్వానికి చిహ్నంగా మహ్మద్ ప్రవక్త నిలుస్తాడన్నారు. పరమత సహనం కలిగి ఉండాలని, శాంతి సామరస్యాలు పెంపు చేయాలని హితవు పలికారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ముబారక్ చెప్పుకున్నారు. కార్యక్రమంలో సుల్తాన్, మాజీ అధ్యక్షులు ఎంఎ రఫీ, సభ్యులు షాన్, మహ్మద్, జిలాని, బాషా, మదీనా, సలాని, మహీబుల్లా ఖాన్, వైఎస్ఆర్ సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర సభ్యుడు అబ్దుల్ రహమాన్, అజ్గర్ ఆలీబేగ్, బహదూర్ జానీ, ఎం.సిరాజుద్దీన్ గౌస్, అబ్దుల్లా భాషా తదితరులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయం వెనుకనున్న సిద్దిక్ నేషనల్ మసీదులో ముస్లిం పురుషులతో పాటు మహిళలు నమాజు చేశారు. మసీదు ముఫ్తీ అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు జరిగాయి. కార్యక్రమంలో మసీదు అధ్యక్షులు హర్షద్, ఇలియాస్, ఖాదర్ హాజీ, జిలానీ, అమీన్, ఆజాద్, ఆలి, రియాజ్, ఎస్.ఆలం తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల ప్రకారమే ఎన్నికలు
విజయనగరం కంటోన్మెంట్: జిల్లా కేంద్రంలోని జామియా మసీదు కమిటీకి ఎన్నిక నిర్వహిస్తామని జిల్లా వక్ఫ్ బోర్డు అధికారి హేమసుందర్ స్పష్టం చేశారు. ఈ నెల 18వ తేదీన జామియా మసీదు మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికను అడ్డుకుంటున్నారన్న అంశంపై ‘అక్కడా రాజకీయమేనా?’ అన్న శీర్షిక న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన బుధవారం రాత్రి జామియా మసీదును సందర్శించి అక్కడి ముస్లింలతో మాట్లాడారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించి ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. నోటీసు బోర్డులో ముసల్లీల గుర్తింపునకు ఫారాలు పొందుపరచాలని మౌజన్, ఇమా మ్‌లను ఆదేశించారు. అందుకు సంబంధించిన ఫారాలు అందజేశారు. శుక్రవారం జరిగే ప్రార్థనా సమయంలో ఈ వివరాలను ము స్లింలందరికీ తెలియపర్చాలన్నారు. ముసల్లీలను గుర్తించి జాబితాను నోటీసు బోర్డులో పొందుపరచి, అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. అనంతరం ముసల్లీల తుది జాబితా ప్రకటించి ఎన్నిక నిర్వహిస్తామన్నారు. అలాగే జిల్లాలోని ఏ మసీదులో సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని ముస్లిం పెద్దలకు సూచించారు. ఆయనతో పాటు రెండు జిల్లాల వ క్ఫ్ ఇన్స్పెక్టర్ అహ్మద్ మొయినుద్దీ న్, ఇతర ముస్లిం పెద్దలు ఉన్నారు. -
టీడీపీ నాయకుల అక్రమాలు
జిల్లాలో టీడీపీ నాయకుల అక్రమాలు, ఆరాచకాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. చివరికి తమ రాజకీయ స్వార్థం కోసం వారు ఆలయూలు, మసీదులను కూడా విడిచిపెట్టడం లేదు. మత సామరస్యాన్ని పెంపొందిస్తూ... మత పవిత్రతను కాపాడే అనుభ వజ్ఞులైన మత పెద్దలు ఉండాల్సిన చోట రాజకీయ నాయకులను, ఉద్యోగులను నియమించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాల్సిన ఎన్నికలను నిలిపి వేసి నామినేటెడ్‌గా తమ పార్టీ వారిని అధ్యక్షుడిగా నియమించుకునేందుకు యత్నాలు చేస్తున్నారు. విజయనగరం కంటోన్మెంట్ : జిల్లా కేంద్రంలోని జామి యా మసీదు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ మసీదు మేనేజ్మెంట్ కమిటీకి వ చ్చే నెల 2వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మసీదులకు రోజుకు ఐదుసార్లు వచ్చే ముస్లింలే ఓట ర్లు.వీరిని ముసల్లీలు అంటారు. రోజు కు ఐదుసార్లు, ప్రతి శుక్రవారం వచ్చే ముసల్లీలను మసీదులోని మత పెద్ద (మౌజన్ అంటారు) గుర్తిస్తారు. ఇక్కడి మసీదుకు రోజుకు ఐదుసార్లు వచ్చేవా రు సుమారు 50 మంది వరకూ ఉంటా రు. ప్రతి శుక్రవారం వచ్చే వారు 300 మందిపైగా ఉన్నారు. వీరిని గుర్తించి జా బితా తయారు చేస్తారు. ఇటీవల వర్క్ ఇన్స్పెక్టర్ జామి యా మసీదులో ముసల్లీల లిస్టు కోసం (కమిటీని ఎన్నుకు నే ఓటర్లు) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మసీదుకు వచ్చారు. మసీదుకు అర్హులైన ముసల్లీల జాబితాను సిద్ధం చేయాలని మౌజన్‌కు చెప్పగా...ఆయన సంబంధిత నోటిఫికేషన్‌ను నో టీస్ బోర్డులో అంటిస్తుండగా టీడీపీ నా యకులు, వక్ఫ్ బోర్డు వకీలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మీసాల గీతతో ఫోన్ చేయించి వర్క్ ఇన్స్పెక్టర్ను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించారు. దీం తో వెనక్కి వెళ్లిపోతున్న వర్క్ ఇన్స్పెక్టర్ ను ఇతర ముస్లిం పెద్దలంతా.. నోటీసు అంటించకుండా ఎందుకు వెళ్లిపోతున్నారని ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం రంజాన్ కావడంతో ఇబ్బందులు వస్తాయని, పండగ తరువాతకమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అరుుతే రంజాన్ జరిగి సుమారు 20 రోజులవుతున్నా ఇప్పటివరకూ ముసల్లీల లిస్టు కూడా తయారు చేయకపోవడంతో మత పెద్దంతా డీఆర్ఓకు ఫిర్యా దు చేశారు. గతంలో ఈ ఎన్నిక నేరుగా నిర్వహించాలని, నామినేటెడ్ కమిటీ వే యకూడదని అప్పటి ఎమ్మెల్యే అశోక్ చెప్పారన్న విషయాన్ని ఫిర్యాదులో పే ర్కొన్నారు. ఆలయాలు, మసీదుల పవిత్రతను కాపాడాలని, ఇటువంటి చో ట రాజకీయం చేయడం సరికాదని తెలి పారు. కాగా జిల్లాలోనే అతి పెద్దదైన జా మియా మసీదుకు షాపింగ్ కాంప్లెక్సుల అద్దెల ద్వారా ప్రతి నెలా సుమారు రూ. 80 వేల వరకూ ఆదాయం వస్తోంది. ఈ ఆదాయంతో పాటు ఎంతోమంది దా తలు లక్షలాది రూపాయల విరాళాలు ఇస్తున్నారు. వీటన్నింటి లెక్కలకు రికార్డులు రాయాల్సి ఉంది. ఈ మేరకు మత పెద్దలను ప్రజాస్వామ్యబద్ధంగా కమిటీగా ఎన్నుకోవాల్సి ఉంది. అరుుతే ఇందులో కూడా టీడీపీ నాయకులు రాజకీయం చేయడం సరికాదని అబ్దుల్ సుభాన్, ఇతర ముస్లిం పెద్దలు పేర్కొం టున్నారు. వెళ్లి పరిశీలిస్తా! ఈ విషయమై వక్ఫ్ బోర్డు ఇన్చార్జి, డీఆర్ఓ హేమసుందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ముసల్లీల జాబితాను ముందుగా సిద్ధం చేయాలన్నారు. కానీ జాబితా తయూరులో ఎందుకు జాప్యం జరిగిందో సోమవారం వెళ్లి పరిశీలిస్తానని చెప్పారు. ముసల్లీలు ఎంతమందో గుర్తించాక బోర్టులో పెడతా మని, దీనిపై అభ్యంతరాలుంటే స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం వక్ఫ్ బోర్డు ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. :హేమసుందర్, డీఆర్వో, వక్ఫ్ బోర్డు ఇన్‌ఛార్జి -
అశ్రునయనాలతో చిన్నారి రఫీకి వీడ్కోలు
కదిలి వచ్చిన పట్టణ ప్రజలు రఫీకి నేతల నివాళి పెడన జామియా మసీదు ప్రాంగణంలో ఖననం పెడన రూరల్ : పట్టణంలో శనివారం జరిగిన పేలుడు దుర్ఘటనలో మృతి చెందిన చిన్నారి మొహమ్మద్ రఫీకి పట్టణ ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. ఆదివారం పెడన జామియా మసీదు ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణంతో ఇతర ప్రాంతాలకు చెందిన ముస్లింలతో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ప్రభుత్వాసుపత్రిలో బందర్ రూరల్ సీఐ ఎన్వీవీఎస్ మూర్తి, పెడన ఎస్సై అల్లు దుర్గా ప్రసాద్ సమక్షంలో పెడన వీఆర్వోలు పంచనామా నిర్వహించారు. అనంతరం బందర్ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు వై.అశోక్ పోస్ట్‌మార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తర్వాత ఉరేగింపుగా తీసుకువెళ్లి గుడివాడ రోడ్డులోని జామియా మసీదు ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఖననం చేశారు. భారీ బందోబస్తు రఫీ అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ పట్టణంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పేలుడు జరిగిన ప్రాంతంతో పాటు బస్టాండ్ సెంటర్లో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కాగిత పరామర్శ మృతుడు తండ్రి మొహమ్మద్ హనీఫ్‌ను బందరు ప్రభుత్వాస్పత్రిలో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఓదార్చారు. పేలుడు ఘటనకు సంబంధించిన వివరాలను బందర్ రూరల్ సీఐను అడిగి తెలుసుకున్నారు. పెడన మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ బెజవాడ నాగరాజు, టీడీపీ నేతలు అయూబ్‌ఖాన్, కరిముల్లా, శోంఠి స్వామి తదితరులు ఉన్నారు. తరలివచ్చిన నేతలు పెడన మున్సిపల్ చైర్మన్ యర్రాశేషగిరిరావు, కోఆప్షన్ సభ్యుడు బొడ్డు వేణుగోపాలరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, పెడన మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు బండారు ఆనంద్ ప్రసాద్, పట్టణ కన్వీనర్ బండారు మల్లి, మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నాయకులు అయూబ్‌ఖాన్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు నసీర్‌ఖాన్, జయలక్ష్మి పీఏసీఎస్ మాజీ డెరైక్టర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం పెడన రూరల్ : పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పట్టణంలో దీపావళి టపాసులు తయారు చేసే ఇద్దరు మహిళలను అదుపులో తీసుకుని విచారించారు. దీపావళి టపాసులను తయారు చేసేందుకు తీసుకు వచ్చిన రసాయనాలను వల్ల పేలుడు జరిగి ఉంటుందని ప్రాథమిక విచారణలో తెలినట్లు ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక నిఘా విభాగం ఏడీ ఘటన స్థలానికి చేరుకుని జల్లెడ పట్టారు. కొన్ని ఆధారాలు సేకరించి జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపినట్లు తెలిసింది.