విజయనగరం కంటోన్మెంట్: జిల్లా కేంద్రంలోని జామియా మసీదు కమిటీకి ఎన్నిక నిర్వహిస్తామని జిల్లా వక్ఫ్ బోర్డు అధికారి హేమసుందర్ స్పష్టం చేశారు. ఈ నెల 18వ తేదీన జామియా మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికను అడ్డుకుంటున్నారన్న అంశంపై ‘అక్కడా రాజకీయమేనా?’ అన్న శీర్షిక న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన బుధవారం రాత్రి జామియా మసీదును సందర్శించి అక్కడి ముస్లింలతో మాట్లాడారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించి ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు.
నోటీసు బోర్డులో ముసల్లీల గుర్తింపునకు ఫారాలు పొందుపరచాలని మౌజన్, ఇమా మ్‌లను ఆదేశించారు. అందుకు సంబంధించిన ఫారాలు అందజేశారు. శుక్రవారం జరిగే ప్రార్థనా సమయంలో ఈ వివరాలను ము స్లింలందరికీ తెలియపర్చాలన్నారు. ముసల్లీలను గుర్తించి జాబితాను నోటీసు బోర్డులో పొందుపరచి, అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. అనంతరం ముసల్లీల తుది జాబితా ప్రకటించి ఎన్నిక నిర్వహిస్తామన్నారు. అలాగే జిల్లాలోని ఏ మసీదులో సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని ముస్లిం పెద్దలకు సూచించారు. ఆయనతో పాటు రెండు జిల్లాల వ క్ఫ్ ఇన్‌స్పెక్టర్ అహ్మద్ మొయినుద్దీ న్, ఇతర ముస్లిం పెద్దలు ఉన్నారు.
నిబంధనల ప్రకారమే ఎన్నికలు
Published Thu, Aug 21 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM
Advertisement
Advertisement