ఎమ్మెల్యే ఇచ్చిన సిఫారస్ లేఖ
చిచ్చురేపిన సిఫారస్ లేఖ
Published Sun, Jul 24 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
– జామియా మసీదు కార్యవర్గం ఎంపిక వాయిదా
–రెండువర్గాల మధ్య విభేదాలు
–కారణమైన కోడుమూరు ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు
కోడుమూరు: పట్టణంలోని జామియా మసీదు కార్యవర్గం ఎంపికపై అనాలోచితంగా ఎమ్మెల్యే సిఫారస్ లేఖ ఇచ్చి రెండు వర్గాల మధ్య చిచ్చురేపాడు. ముస్లిం మత పెద్దల ఒప్పందంతో కోడుమూరు పట్టణానికి చెందిన జబ్బార్‌హుసేన్ 13ఏళ్ల నుంచి జామియా మసీదుకు ముతవల్లిగా కొనసాగుతున్నాడు. మరోవర్గానికి చెందిన డాక్టర్ షాకీర్‌అహమ్మద్ జామియా మసీదుకు ముతవల్లిగా కొనసాగేందుకు పోటీకి దిగాడు. జబ్బార్‌హుసేన్ 13ఏళ్లుగా మసీదు అభివృద్ధిని పట్టించుకోలేదు, ఇతరులకు అవకాశమివ్వాలని డాక్టర్ షాకీర్‌అహమ్మద్ పోటీకి దిగడంతో కార్యవర్గం ఎంపిక సమస్యగా మారింది. ఈ విషయంపై ఎమ్మెల్యే మణిగాందీ జోక్యం చేసుకుని జబ్బార్‌హుసేన్‌ను ముతవల్లిగా కొనసాగించాలని 2016మే 19న స్టేట్ వక్ఫ్‌బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు సిఫారస్ లేఖ ఇచ్చారు. దాని ఆధారంగా జబ్బార్‌హుసేన్‌ను ముతవల్లిగా కొనసాగించాలని మే 30న అబ్దుల్‌ఖాదీర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం మరికొందమంది రాజకీయ నేతలు ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకురావడంతో జబ్బార్‌హుసేన్ స్థానంలో షాకీర్‌అహమ్మద్‌ను నియమించాలని మరో లేఖను వక్ఫ్‌బోర్డుకు పంపారు. దీంతో అధికారులు తీవ్ర గందరగోళానికి గురై కార్యవర్గ ఎంపికను నిలుపుదల చేశారు. దీంతో ముస్లింల మధ్య విభేదాలు తలెత్తి కార్యవర్గం ఎంపిక శాంతిభద్రతల సమస్యగా మారింది. ముందస్తు జాగ్రత్తగా సీఐ డేగల ప్రభాకర్, ఎస్‌ఐ మహేష్‌కుమార్ ఇరువర్గాలను పిలిపించి రాజీ చేసి కార్యవర్గ ఎంపిక సజావుగా జరిగేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసినా పరిష్కారం కాలేదు. ఎమ్మెల్యే అనాలోచితంగా ఇరువర్గాలకు సిఫారస్ లేఖ ఇవ్వడంతోనే ముస్లి ల మధ్య వర్గ విభేదాలు వచ్చాయని కోడుమూరు పట్టణ ముస్లిం ఏక్బాల్ ఆరోపించాడు. ఈనెల 25న కోడుమూరులో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తికి ఎమ్మెల్యే మణిగాంధీపై ఫిర్యాదు చేసేందుకు ముస్లింలు సిద్ధమవుతున్నారు. అవసరమైతే ఆ రోజు నిరసన తెలియజేసి సమస్యను డిప్యూటీ సీఎం దష్టికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement