
వారు నరకంలో కాలిపోతారు!!
శ్రీనగర్: శ్రీనగర్‌లోని ఓ ప్రముఖ మసీదు ఎదుట డీఎస్పీని కొట్టిచంపిన ఘటనపై రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. జామియ మసీదు ఎదుట డీఎస్పీ ఆయూబ్ పండిత్‌ను ఓ అల్లరి మూక దారుణంగా కొట్టిచంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అత్యంత సిగ్గుచేటు అని సీఎం మెహబూబా ముఫ్తీ ఖండించగా.. ప్రతిపక్ష నేత, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయూబ్ పండిట్‌ను కొట్టిచంపిన తీరు అధిక్షేపణీయమన్నారు.
'డీఎస్పీ పండిత్‌ను కొట్టిచంపిన వారు తమ పాపాలకు నరకంలో కాలిపోదురుగాక' అంటూ ఆయన ట్వీట్ చేశారు. వేర్పాటువాద నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ కూడా ఈ ఘటనను తప్పుబట్టారు. 'నౌహాట్టాలో చోటుచేసుకున్న అనాగరిక చర్య తీవ్రంగా కలిచివేస్తోంది. మూక హింస, బహిరంగంగా కొట్టిచంపడం మన విలువలకు, మతానికి వ్యతిరేకం. ప్రభుత్వ కూర్రత్వం మన మానవత్వాన్ని, విలువలను హరించకుండా మనం చూడాలి' అని ఆయన అన్నారు.