
ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు: సీఎం
శ్రీనగర్: శ్రీనగర్‌లోని జామియా మసీదు వద్ద డీఎస్పీని ఒక అల్లరి మూక కొట్టిచంపిన ఘటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతకన్నా సిగ్గులేని చర్య మరొకటి ఉండదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే జమ్మూకశ్మీర్ పోలీసులు ఉత్తమ సేవలు అందిస్తున్నారని, సొంతవారన్న స్పృహతో ప్రజలను ఎదుర్కోవడంలో ఎంతో నిగ్రహం పాటిస్తున్నారని, అయినా ఇలాంటి దారుణానికి పాల్పడటం బాధాకరమని ఆమె అన్నారు. మూక దాడిలో అమరుడైన డీఎస్పీ మహమ్మద్ ఆయూబ్ పండిట్‌కు ఆమె నివాళులర్పించారు.