
శ్రీనగర్ జామియా మసీదులో ప్రార్థనలు
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్లోని నౌహరిహట్టా ప్రాంతంలోని జామియా మిలియా మసీదులో జరిగే రోజువారీ సామూహిక ప్రార్థనలు బుధవారం తొలిసారిగా ప్రారంభమయ్యాయి. జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన, ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అధికారులు ఆగస్టు 5న ఈ మసీదుకు సంబంధించిన అన్ని మార్గాలను మూసివేశారు. అప్పట్నుంచి మసీదులో ప్రార్థనలు జరుపుకునేందుకు వీలులేకుండా పోయింది. అయితే 136 రోజుల అనంతరం ఈ మసీదును బుధవారం మధ్యాహ్నం నుంచి తెరిచి సామూహిక ప్రార్థనలకు ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు.