* విచారణకు వెళ్లిన అధికారిణికి చుక్కెదురు
* హాస్టల్‌లో విద్యార్థులు, రికార్డులు లేకపోవడంతో వెనుదిరిగిన వైనం
* నామమాత్రంగా వార్డెన్ అవినీతిపై విచారణ
* రికార్డుల మాయం తప్పించుకోవడానికేనా ?
ఇందూరు: విద్యార్థులకు పెట్టాల్సిన పౌష్టికాహారం లో కోతలు.. సక్రమంగా అమలు కాని మె నూ.. విద్యార్థులను హాస్టల్ నుంచి బయటకు వెళ్లగొట్టిన సంఘటన.. ఏసీబీ అధికారుల దాడులు.. వెరసి కామారెడ్డి బీసీ బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్ సత్యం చేసిన అక్రమాలు బయటపడ్డాయి. దీంతో వార్డెన్‌ను అప్పటి ఇన్‌చార్జి కలెక్టర్ సస్పెండ్ చేశారు. కానీ అడ్డదారిలో తిరిగి రెండు మూడు రోజుల్లోనే డిప్యూటేషన్‌పై బాన్సువాడ ఎస్టీ బాలుర హాస్టల్ వార్డెన్‌గా ఉద్యోగంలో చేరిన వి షయం తెలిసిందే. పై విషయాలపై గతంలో ‘సాక్షి’ కథనాలు కూడా ప్రచురించింది.
దీనికి తోడుగా సెప్టెంబర్ నెలలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు వార్డెన్ అక్రమాలపై విచారణ జరిపించాలని కలెక్టర్‌కు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారికి కూడా ఫిర్యాదు చేశారు. ఇందుకు వార్డెన్ చేసిన అక్రమాలు నిజమో కాదో తెలుసుకునేందుకు సాంఘిక సంక్షేమ శాఖ కామారెడ్డి ఏఎస్‌డబ్ల్యుఓ అ ల్ఫన్సా అనే అధికారిణిని విచారణ అధికారి గా నియమించారు. దీంతో ఆమె విచారణ చేపట్టేందుకు ఈ నెల 13వ తేదీ సోమవారం రోజు రాత్రి సమయంలో కామారెడ్డి బీసీ కళాశాల హాస్టల్‌కు వెళ్లారు. విద్యార్థులకు పెట్టాల్సిన భోజన మెనూ అమలు చేయకుండా వార్డెన్ అక్రమాలకు పాల్పడ్డాడో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకోవాలనుకున్నారు.
కానీ అక్కడ విద్యార్థుల అసలు సంఖ్య 82కు బదులుగా 42 మంది విద్యార్థులున్నారు. న గదు పుస్తకం, సరుకుల స్టాక్ రిజిష్ట్రర్‌ల ద్వారా నిజాలు తెలుసుకోవచ్చని రికార్డుల కోసం వెతికారు. దొరక్కపోవడంతో విచారణ సరిగ్గా చేపట్టలేకపోయారు. దీంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే తనపై విచారణ చేయడానికి వచ్చిన అధికారిణికి సదరు వార్డెన్ ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిసింది. ఈ కారణంతో కూడా విచారణచేయడానికి ఆమె వెనకడుగు వేసినట్లుగా సమాచారం.
తాను హాస్టల్‌కు వెళ్లానని, ఫాస్ట్ పథకం దరఖాస్తుల కారణంగా అక్కడ విద్యార్థులు అందుబాటులో లేరని అందుకే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేదని జిల్లా బీసీసంక్షేమ శాఖ అధికారికి రిపోర్టు చేశారు. తాను ఇకపై విచారణ చేయబోనని, ఆరోగ్య సమస్య ఉందని తెలిపి విచారణ అధికారిగా బాధ్యతలను తొలగించుకున్నారు. ప్రస్తుతం సదరు వార్డెన్ అక్రమాలపై విచారణచేయడానికి ఇతర అధికారులు ఎవ్వరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో విచారణకు ఒక్కసారిగా బ్రేక్ పడింది.
రికార్డుల మాయం వెనుక మర్మమేమిటో
విచారణ అధికారిణి అల్ఫన్సా విచారణకు రాకముందే నగదు పుస్తకం, సరుకుల స్టాక్ రిజిష్ట్రర్‌లు వార్డెన్ స త్యం మాయం చేశాడు. డిప్యుటేషన్‌పై బా న్సువాడ ఎస్టీ బాలుర హస్టల్‌కు వెళుతూ కామారెడ్డి బీసీ హాస్టల్‌లో ఉన్న ముఖ్యమైన రిజిష్ట్రర్‌లు తన వెంట తీసుకెళ్లాడు. రికార్డులు తీసుకెళ్లిన విషయం అధికారులకు విచారణకు వెళితేగాని తెలియకపోవడం గమనార్హం.
విచారణ సమయంలో ఎవరూ లేరు...
సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో కామారెడ్డి బీసీ బాలుర కళాశాల హాస్టల్‌కు వార్డెన్ ‘అక్రమ’ ఆరోపణలపై విచారణచేయడానికి వెళ్లాను. అయితే అక్కడ విద్యార్థులు సరిపడా లేరు. రికార్డులు కూడా సక్రమంగా లేవు. అందుకే విచారణను చేపట్టలేకపోయాను.
- అల్ఫన్సా, విచారణ అధికారిణి
వార్డెన్‌పై చర్యలు తీసుకునేంత వరకు ఊరుకోం...
అక్రమాలకు పాల్పడి విద్యార్థుల పొట్టగొట్టిన వార్డెన్ సత్యంపై చర్యలు తీసుకునేంత వరకూ ఊరుకోం. విచారణ చేసిన అధికారికి సరైన ఆధారాలు దొరక్కా విచారణ సక్రమంగా జరగలేదు. వెంటనే ఈ రికార్డులు వార్డెన్ నుంచి తెప్పించి, విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుని చట్టపర చర్యలు చేపట్టాలి. లేదంటే ఇలాంటి వార్డెన్‌లు చాలా మంది పుట్టుకొస్తారు. యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతారు.
- శ్రీనివాస్‌గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ర్ట అధ్యక్షుడు
విచారణలో బయటపడని ‘సత్యం’
Published Thu, Oct 16 2014 3:32 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement