- మా దర్యాప్తునకు సహకరించండి..
- ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణపై కేజ్రీవాల్‌కు నోటీసులిచ్చిన ఏసీబీ
న్యూఢిల్లీ: ‘కేజ్రీవాల్.. మీరు విచారణకు సిద్ధంగా ఉండండి. మీరు చేసిన ఆరోపణ చాలా పెద్దది. ఇందులో నిజా నిజాలు నిగ్గు తేల్చాలి. మీరు విచారణకు అందుబాటులో ఉండాలి’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులిచ్చింది.
తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ(BJP) రూ. 15 కోట్ల ఆఫర్ ఇవ్వడమే కాకుండా వారికి మంత్రి పదవులు ఆశ చూపిందని కేజ్రీవాల్ ఈరోజు(శుక్రవారం) ఆరోపించారు. దీనిపై తన సోషల్ మీడియా ‘ఎక్స్’లో కేజ్రీవాల్ సుదీర్ఘమైన పోస్టుపెట్టారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ..ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాసింది. దీనిపై విచారణకు ఆదేశించాలని బీజేపీ లేఖ ద్వారా కోరింది.
దాంతో వీకే సక్సేనా.. ఢిల్లీ ఏసీబీని విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌కు ముందుగా నోటీసులిచ్చింది ఏసీబీ. ఐదు ప్రశ్నలతో కూడిన నోటీసులు ఇచ్చింది. ‘ మీరు చేసిన ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్న ఏసీబీ.. ఐదు ప్రశ్నలను కేజ్రీవాల్ ముందు ఉంచింది.
ఏసీబీ నోటీసులో పేర్కొన్న ఐదు ప్రశ్నలు ఇవే..
1. మీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ట్వీట్ ీమీరు చేసిందేనా?.. లేక ఇంకెవరి ప్రమేయమైనా ఉందా?
2. మీ 16 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం జరిగిందని చేసిన ట్వీట్‌తో మీరు ఏకీభవిస్తారా?
3. ఎవరైతే ఫోన్ కాల్ ద్వారా రూ. 15 కోట్ల ఆఫర్ పొందారో.. వారి వివరాలు మాకివ్వండి
4, మీ ఎమ్మెల్యేలకు ఎవరైతే ఆఫర్ చేశారో వారి వివరాలు ఇవ్వండి. వారి వ్యక్తిగత వివరాలు కానీ, వారి ఫోన్ నంబర్లు కానీ మాకు ఇవ్వండి.
5. మీరు ేచేసిన ఆరోపణలపై మీ వద్ద ఇంకా ఏమైనా ఆధారాలుంటే మాకు సమర్పించండి.
రేపు(శనివారం) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాయి. కేజ్రీవాల్ కావాలనే బీజేపీపై ఆరోపణ చేశారా.. లేక నిజంగా బీజేపీ కొనుగోలు చేయడానికి యత్నించిందా అనేది విచారణలో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment