మహిళా లీడర్‌షిప్‌లో చివరి మూడో స్థానంలో భారత్
మహిళా లీడర్‌షిప్‌లో చివరి మూడో స్థానంలో భారత్
Published Wed, Mar 8 2017 8:06 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
న్యూఢిల్లీ: మహిళా లీడర్‌ఫిఫ్‌లో ప్రపంచంలో భారత్ చివరి నుంచి మూడో ర్యాంకు పొందింది. 47 శాతం మహిళలు ఉన్నత పదవులు నిర్వహిస్తుండటంతో రష్యా తొలి ర్యాంకు సాధించింది. గ్రాంట్ తోర్నటన్ సర్వే కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో మహిళలు ఉన్నత పదవుల్లో ఉండటాన్ని పరిగణలోకి తీసుకొని ర్యాంకులు ప్రకటించింది. రష్యా (47%), ఇండోనేషియా(46%), ఎస్టోనియా (40%)లు వరుసుగా మూడు ర్యాంకులు సాధించాయి. ర్యాంకుల్లో భారత్ ముందు అర్జెంటీనా (15%) తర్వాత జపాన్ (7%)లు ఉన్నాయి.
ఈ సర్వేలో 5,500 వ్యాపారాలు, 36 ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నత పదవుల్లో మహిళల పాత్రలను పరిశీలించారు. గత సంవత్సరం కన్నా 7 శాతం మహిళలు ఉన్నత పదువుల్లో ఉండటం పెరిగిందని సర్వేలో తేలిపారు. ఈ సర్వేలో భారత్‌లో కేవలం 7 శాతం మహిళలే ఉన్నత పదవుల్లో పనిచేస్తున్నారని, ఎక్కువ శాతం హెచ్‌ఆర్, కార్పోరేట్ కంట్రోలర్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. లింగ వివక్ష లేనపుడే మహిళలు ఉన్నత పదవులు నిర్వహిస్తారనే విషయాన్ని తోర్నటన్ సర్వేకంపెనీ ప్రస్తావించింది.
తూర్పు ఐరోపాలో 37 శాతం మహిళలు ఉన్నత పదవులు నిర్వహిస్తున్నారని, కేవలం 9 శాతం మహిళలే ఉన్నత పదవుల్లో లేరని చెప్పారు. మెక్సికో, నైజీరియా, ఇండోనేషియా, టర్కీలు ఈ విషయంలో మెరుగుదల కనబర్చాయని సర్వేలో పేర్కొన్నారు.
Advertisement