బ్రిస్బేన్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. బుధవారం జరిగన తొలి టీ20లో కోహ్లి సేన 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే వెస్టిండీస్ సిరీస్‌లో దారణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో మెరిశాడు. లక్ష్యచేదనలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సారథ విరాట్ కోహ్లిలు విఫలమైనా ధావన్(42 బంతుల్లో 76; 10ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ శతకంతో రాణించాడు. అయితే ఆసీస్‌పై ఆడిన చక్కటి ఇన్నింగ్స్‌కు ధావన్ ఖాతాలో సరికొత్త రికార్డు చేరింది. (ఆసీస్ 158, భారత్ 169.. విజేత?)
టీ20ల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు(648, 2018లో) చేసిన ఆటగాడిగా ధావన్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు పొట్టి ఫార్మట్ క్రికెట్‌లో ఒక క్యాలెండ్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి (641 పరుగులు, 2016లో) పేరిట ఉన్న రికార్డును తాజాగా ధావన్ అధిగమించాడు. ఇక 2018లో టీ20 ఫార్మట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఫఖర్ జామన్ (576), రోహిత్ శర్మ(567), బాబర్ అజామ్ (563)లు ధావన్ తర్వాతి స్థానాలలో ఉన్నారు. (ఆసీస్ చేతిలో అనూహ్య పరాజయం)
Comments
Please login to add a commentAdd a comment