మెల్‌బోర్న్: తొలి టీ20లో ఆస్ట్రేలియా చేతిలో అనూహ్య పరాజయం చవిచూసిన టీమిండియా మెల్‌బోర్న్ వేదికగా రెండో టీ20కి సన్నద్దమైంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన సారథి విరాట్ కోహ్లి ప్రత్యర్థి ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆటగాళ్లు తప్పులను సరిదిద్దుకునే ఉద్దేశంతో ఎలాంటి మార్పుల్లేకుండానే గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇక ఆసీస్ జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంది. స్టాన్‌లేక్ స్థానంలో కౌల్టర్ నైల్ తుదిజట్టులోకి వచ్చాడు. సిరీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి సేన ఏం చేస్తుందో చూడాలి. ఇక మెల్‌బోర్న్‌లోనే సిరీస్‌ను గెలిచేయాలని ఫించ్ సేన ఆరాటపడుతోంది.
తుదిజట్లు:
భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), రాహుల్, దినేశ్ కార్తీక్, పంత్, కృనాల్, భువనేశ్వర్, కుల్దీప్, ఖలీల్, బుమ్రా.
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), షార్ట్, లిన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, బెన్ మెక్‌డెర్మట్, క్యారీ, టై, జంపా, బెహ్రెన్‌డార్ఫ్, కౌల్టర్ నైల్.
Comments
Please login to add a commentAdd a comment