టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాలలో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మొహాలీ వేదికగా తొలి టీ20 మంగళవారం(సెప్టెంబర్20)న జరగనుంది.
ఈ క్రమంలో భారత ఆటగాళ్లు శనివారం మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంకు చేరుకున్నారు. స్టేడియంకు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు రెండు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనున్నారు.
కాగా కరోనా బారిన పడిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు ఇప్పటికే మొహాలీ చేరుకున్న ఆసీస్ జట్టు నెట్ ప్రాక్టీస్‌లో మునిగి తెలుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్ అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.
భారత టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ఆడం జంపా.
Look who’s here 😍
— Punjab Cricket Association (@pcacricket) September 17, 2022
Welcome @imVkohli to the city beautiful @gulzarchahal @BCCI @CricketAus #gulzarchahal #1stT20I #pca #pcanews #punjabcricket #punjab #cricket #teamindia #indiancricketteam #punjabcricketnews #cricketnews #gulzarinderchahal #fans #cricketfans #viratkohli pic.twitter.com/y5x5J2XiMg
చదవండి: T20 World Cup 2022: జట్టును ప్రకటించిన యూఏఈ.. స్టార్ ఆటగాడికి నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment