ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహేష్ పేరుతో తప్పుగా ఓటు
‘సాక్షి’ కథనంతో వెలుగుచూసిన అధికారుల నిర్వాకం
ఓటు తొలగించినట్లు ఏఈఆర్వో వెల్లడి
గుంటూరు: శాసనమండలి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాలో ప్రముఖ సినీ నటుడు ఘట్టమనేని మహేష్‌బాబు పేరుతో నమోదైన ఓటును తొలగించినట్లు గుంటూరు నగరపాలకసంస్థ అదనపు కమిషనర్, ఏఈఆర్వో చల్లా ఓబులేసు గురువారం తెలిపారు.
గుంటూరులో హీరో మహేష్‌బాబుకు ఓటు శీర్షికతో బుధవారం ‘‘సాక్షి’’ మెయిన్ ఎడిషన్‌లో ప్రచురితమైన కథనానికి ఏఈఆర్వో స్పందించారు. మహేష్‌బాబు పేరుతో ఓటు తప్పుగా నమోదైందని, ఫారం–7 విచారణ అనంతరం ఓటును తొలగించామని వివరించారు. గుంటూరు అర్బన్‌లో దరఖాస్తులపై బూత్ లెవల్ అధికారులతో విచారణ చేయించామన్నారు. అర్హులైన వారి దరఖాస్తులను ఆమోదించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment