సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల వారీగా విడుదల చేసింది. సీఈఓ ఆంధ్రా వెబ్‌సైట్(CEO Andhra)లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లుగా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్‌సైట్‌లో ఈసీ అప్ లోడ్ చేసింది. ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఈసీ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
- ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు: 4,08,07,256
- మహిళా ఓటర్లు: 2,07,37,065
- పురుష ఓటర్లు: 2,00,09,275
- రాష్ట్రంలో సర్వీస్ ఓటర్లు: 67,434
- థర్డ్ జెండర్ ఓటర్లు: 3482.
కాగా, గత 6 నెలలుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, అధికారులను నియమించి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేశారు. ఓటు ప్రాధాన్యతపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించారు. అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక సోమవారం అధికారికంగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు.ఏపీలో పురుషుల కంటే మహిళల ఓటర్లే అధికం ఉండటం గమనార్హం.
జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు
జిల్లా | పురుషులు | స్త్రీలు | ఇతరులు | సర్వీస్ ఓటర్లు | మొత్తం ఓటర్లు |
తిరుపతి | 8,68,273 | 9,10,597 | 188 | 867 | 17,79,058 |
చిత్తూరు | 7,65,90 | 7,88,725 | 84 | 3,379 | 15,58,257 |
ఎన్టీఆర్ | 8,17,484 | 8,57,361 | 150 | 16,74,995 | |
కాకినాడ | 7,88,105 | 8,10,781 | 15,99,065 | ||
కృష్ణా | 7,37,394 | 7,80,796 | 65 | 15,18,255 |
యువ ఓటర్ల నమోదు కోసం మళ్లీ ప్రచారం చేస్తాం
ఏపీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 4.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ముసాయిదా జాబితా తర్వాత 5.08 లక్షల ఓటర్లు పెరిగారని పేర్కొన్నారు. యువ ఓటర్లు 8.13 లక్షల ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. యువ ఓటర్లు ఇంకా నమోదు కావాల్సి ఉందని చెప్పారు. యువ ఓటర్ల నమోదు కోసం మళ్లీ ప్రచారం చేస్తామని అన్నారు. ఒకే డోర్ నెంబర్‌పై అధిక ఓట్లు ఉన్న ఫిర్యాదులను 98 శాతం పరిష్కరించామని తెలిపారు.
లక్ష 50 వేల ఇళ్లలో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు 4వేల ఇళ్లకు తగ్గాయని, ప్రతి ఎన్నికల్లోనూ ఇలాంటి ఓట్లు ఉండేవని అన్నారు. ఫామ్ 7 ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 70 చోట్ల పోలీసు కేసులు నమోదు చేశామని అన్నారు. మళ్లీ కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. వికలాంగులు, 80 ఎళ్ల పైబడిన వారికి ఇంటి వద్ద ఓటింగ్‌కి అవకాశం ఇస్తామని అన్నారు. నామినేషన్ చివరి రోజు వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
చదవండి: లోలోన రగిలిపోతున్న అచ్చెన్నాయుడు
Comments
Please login to add a commentAdd a comment