Guntur city
-
హీరో మహేష్‌బాబు ఓటు తొలగింపు
గుంటూరు: శాసనమండలి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాలో ప్రముఖ సినీ నటుడు ఘట్టమనేని మహేష్‌బాబు పేరుతో నమోదైన ఓటును తొలగించినట్లు గుంటూరు నగరపాలకసంస్థ అదనపు కమిషనర్, ఏఈఆర్వో చల్లా ఓబులేసు గురువారం తెలిపారు. గుంటూరులో హీరో మహేష్‌బాబుకు ఓటు శీర్షికతో బుధవారం ‘‘సాక్షి’’ మెయిన్ ఎడిషన్‌లో ప్రచురితమైన కథనానికి ఏఈఆర్వో స్పందించారు. మహేష్‌బాబు పేరుతో ఓటు తప్పుగా నమోదైందని, ఫారం–7 విచారణ అనంతరం ఓటును తొలగించామని వివరించారు. గుంటూరు అర్బన్‌లో దరఖాస్తులపై బూత్ లెవల్ అధికారులతో విచారణ చేయించామన్నారు. అర్హులైన వారి దరఖాస్తులను ఆమోదించినట్లు పేర్కొన్నారు. -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
-
నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకం: మహేశ్ బాబు
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మరో చిత్రం గుంటూరు కారం. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా గుంటూరు కారం మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. తాజాగా ఈవెంట్ సక్సెస్ కావడం పట్ల మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ఈవెంట్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహేశ్‌బాబు తన ట్వీట్లో రాస్తూ..' థ్యాంక్ యూ గుంటూరు!! నా సినిమా ఈవెంట్ హోమ్‌టౌన్‌లో జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఇది గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకం. మీ అందరినీ ప్రేమిస్తున్నా.. నా సూపర్ ఫ్యాన్స్‌ను మళ్లీ చూడాలని ఎదురుచూస్తున్నా. అతి త్వరలో మళ్లీ కలుద్దాం. ఇప్పుడే సంక్రాంతి మొదలవుతోంది. నిన్న జరిగిన కార్యక్రమానికి సహకరించిన గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. Thank you, Guntur!! ♥️ Celebrating the film in my hometown surrounded by so much love, is a timeless memory that I will hold close to my heart. Love you all, my superfans and I look forward to seeing you again...very soon!! ♥️♥️♥️ Sankranthi begins now!! 🎉 #GunturKaaram A… pic.twitter.com/RWpaplus8X — Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2024 -
Nandi Drama Festivals 2023 Pics: గుంటూరులో ఘనంగా ముగిసిన నంది నాటకోత్సవాలు (ఫొటోలు)
-
గుంటూరుకు స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డు
-
గుంటూరు ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్బ్రాంతి
-
గుంటూరులో మంకీపాక్స్ కలకలం.. శాంపిల్స్ పూణేకు తరలింపు
సాక్షి, గుంటూరు : గుంటూరులో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో రాహువ్ నహక్(8) జీజీహెచ్‌లో చేరాడు. దీంతో, చికిత్స పొందుతున్న రాహువ్ నుంచి శనివారం రాత్రి జీజీహెచ్ అధికారులు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు. గొంతు, ముక్కు నుంచి స్వాబ్ తీయడంతోపాటు, రక్తం, మూత్రం శాంపిల్స్‌ను సేకరించి ప్రత్యేకంగా భద్రపరిచారు. వ్యాధి నిర్ధారణ కోసం ఆ శాంపిల్స్‌ను ఎపిడిమాలజిస్టు డాక్టర్ వరప్రసాద్‌తో శనివారం రాత్రి 10 గంటలకు విమానంలో పూణేకు పంపిస్తామని, వ్యాధి నిర్ధారణకు 3 రోజుల సమయం పడుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి తెలిపారు. కాగా, ఒడిశాకు చెందిన బనిత నహక్, గౌడ నహక్‌లు తమ కుమారుడు రాహువ్ నహక్‌తో కలిసి ఒడిశా నుంచి యడ్లపాడు స్పిన్నింగ్‌మిల్లుకు 16 రోజుల కిందట వచ్చారని పేర్కొన్నారు. ఒంటిపై గుల్లలు రావడంతో ఈ నెల 28న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారని, ప్రత్యేక వార్డులో బాలుడిని అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: సాగర గర్భంలో పర్యాటకం -
బస్తీమే సవాల్.. ఛాలెంజ్‌గా మారిన ట్రాఫిక్ నియంత్రణ
సాక్షి, గుంటూరు, తెనాలి, నరసరావుపేట: నగర/పట్టణాల్లో జనాభా నానాటికీ పెరుగుతోంది. జీవనం ఉరుకులు పరుగుల మయమవుతోంది. దీనికి అనుగుణంగా వాహనాల వినియోగమూ పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. వాహనాల రద్దీతో నిత్యం రోడ్లు కిటకిటలాడుతున్నాయి. రాకపోకల నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే తలకు మించిన భారమే అవుతోంది. గుం‘టూరు కష్టమే’ గుంటూరు నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. సమీపంలోని గ్రామాల నుంచి ప్రజలు వలస వస్తున్నారు. ఇప్పటికే శివారు ప్రాంతాలు చాలా వరకు నగరంలో కలిసిపోయాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గుంటూరు నగర జనాభా 6.76 లక్షలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 9 లక్షలకుపైగా ఉంటుందని అధికారుల అంచనా. నగరంలో మొత్తం అన్ని రకాల వాహనాలు కలిపి సుమారుగా 6,43,000 వరకు ఉంటాయని తెలుస్తోంది. దీంతో నగరంలో రద్దీ పెరిగింది. దీనికి తగ్గట్టు ప్రధాన రహదారుల విస్తరణ జరగకపోవడంతో నగరం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోతోంది. పార్కింగ్ సమస్య వేధిస్తోంది. పరిష్కారం దిశగా ప్రభుత్వం.. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణమే శరణ్యమని ప్రభుత్వం గుర్తించింది. శంకర్‌విలాస్ వద్ద బ్రిడ్జి విస్తరణ లేదా కొత్త వంతెన నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్న గడ్డిపాడు రైల్వేగేట్, శ్యామలానగర్, నెహ్రూనగర్, సంజీవయ్య నగర్, సీతారామ్‌నగర్ రైల్వేగేట్ల వద్ద ఆర్వోబీ, ఆర్‌యూబీలు నిర్మించడంపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీనిలోభాగంగా ఆర్అండ్బీ, జీవీఎంసీ అధికారులు ఇటీవల పరిశీలన చేశారు. నందివెలుగు రోడ్డు రైల్వే వంతెన పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. పలు రోడ్ల విస్తరణకూ ప్రతిపాదనలు ఉన్నాయి. ఆంధ్రా ప్యారిస్‌లోనూ పాట్లు గుంటూరు జిల్లాలో ఏకైక స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ, ఆంధ్రా ప్యారిస్‌గా గుర్తింపు పొందిన తెనాలిలోనూ ట్రాఫిక్ పాట్లు తప్పడం లేదు. ఆక్రమణలతోపాటు రోడ్లపైనా వ్యాపారాల వల్ల ఈ సమస్య జఠిలమవుతోంది. తెనాలి పట్టణ జనాభా రెండు లక్షలకుపైగానే ఉంటుంది. అన్ని రకాల వాహనాలు కలిపి 1.10 లక్షల వరకు ఉంటాయని తెలుస్తోంది. సమీపంలోని వేమూరు, మంగళగిరి నియోజకవర్గాల నుంచి రోజూ 40 నుంచి 50 వేల మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. పెరిగిన జనాభా, వాహనాలకు అనుగుణంగా పట్టణంలో రోడ్ల విస్తరణ జరగలేదు. పార్కింగ్ సమస్య కూడా వేధిస్తోంది. వీధివ్యాపారులకు ప్రత్యేక స్థలం, పార్కింగ్ జోన్ల కేటాయింపు కాగితాలకే పరిమితమైంది. పరిష్కారమార్గం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణమే మార్గం. గతంలో మార్కెట్ వంతెన వద్ద స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు సర్వే చేశారు. నెహ్రూ, బోస్, మెయిన్, బుర్రిపాలెం రోడ్లను విస్తరించాలి. మరో కొత్త వంతెన అవసరం ఉంది. కాలువ రోడ్లను విస్తరించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉంది. పేటలోనూ ‘నడక’యాతనే పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలోనూ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 1.18 లక్షలు. ఇప్పుడు 1.50 లక్షల వరకు ఉంటుందని అధికారుల అంచనా. అన్ని రకాల వాహనాలు కలిపి 1,00,000 వరకు ఉంటాయని తెలుస్తోంది. చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచీ పట్టణానికి నిత్యం రాకపోకలు జరుగుతుంటాయి. దీంతో పట్టణంలోని రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారుతోంది. పార్కింగ్ సమస్య వేధిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదు. ఫ్లైఓవర్ మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్ నరసరావుపేటలో ప్రస్తుతం రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి ఉంది. జిల్లా కేంద్రమైనందున రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం ఆవశ్యకత అధికమైంది. దీంతో రెండు ఆర్‌యూబీలు, ఓ ఫ్లైఓవర్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికీ తీసుకెళ్లారు. మల్లమ్మసెంటర్ నుంచి గడియారం స్తంభం సెంటర్‌వరకు ఫ్లైఓవర్ మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. లాల్‌బహుదూర్ కూరగాయల మార్కెట్ సెంటర్ వెనుకగా చిత్రాలయ థియేటర్ ఎదురుగా ఆర్యుబీ నిర్మాణానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొచ్చారు. వీటితోపాటు రోడ్ల విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరినట్టే. కిలోమీటర్ మేర బారులు గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఒక్కోసారి కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరుతుంటాయి. శ్యామలానగర్ రైల్వే గేట్ పడిందంటే అంతే సంగతులు. వెంటనే ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను నిర్మించాలి. గడ్డిపాడు రైల్వే గేట్ వల్ల ట్రాఫిక్ ఆగిపోతోంది. ఇక్కడ ఆర్వోబీ నిర్మించాలి. – మాన్నిడి సుధమారుతిబాబు, నల్లపాడు, గుంటూరు పూర్తి స్థాయిలో దృష్టి సారించాం ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు నిత్యం చర్యలు తీసుకుంటున్నాం. వారం రోజుల క్రితం డీఐజీ, ఎస్పీ సమీక్ష చేశారు. ట్రిఫిక్ నియంత్రణపై దృష్టిసారించాం. పలు ప్రాంతాల్లో డివైడర్లు తొలగించాలని జీఎంసీకి ప్రతిపాదలు పంపాం. పార్కింగ్ జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – వీవీ రమణకుమార్, డీఎస్పీ, గుంటూరు సిటీ ట్రాఫిక్ పరిష్కారానికి సమష్టిగా కృషి తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తాం. దీనికి ప్రజల సహకారమూ అవసరం. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసు శాఖ తరఫున అన్ని చర్యలూ చేపడుతున్నాం. ప్రధాన కూడళ్లలో వన్ వే, ఫ్రీ లెఫ్ట్ వంటివి ఏర్పాటు చేశాం. – జోగి శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ, తెనాలి రోడ్లు విస్తరించాలి నరసరావుపేటలో ట్రాఫిక్‌పై పోలీసులు దృష్టిపెట్టాలి. రోడ్లను విస్తరించాలి. వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ కేటాయిస్తే మేలు. పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలి. ఆటోవాలాలను నియంత్రించాలి. – గుదే రామయ్య, బరంపేట, నరసరావుపేట ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా మళ్లిస్తాం నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సమష్టిగా కృషి చేస్తున్నాం. ఔటర్ రింగ్‌రోడ్డును ఉపయోగించి ఇకపై వినుకొండ, పల్నాడు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గుంటూరు వైపు వెళ్లాల్సిన వాహనాలను మళ్లిస్తాం. దీనివల్ల పట్టణంలో రద్దీ తగ్గుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. – సి.విజయభాస్కరరావు , డీఎస్పీ, నరసరావుపేట -
టీడీపీ బంద్ కు సహకరించని ప్రజలు
-
16 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
గుంటూరు : నగరంలోని శ్రీనగర్‌లో పేకాటస్థావరంపై శనివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్షా 16 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘క్రీడా’విహీనం
* ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదిక * ప్రస్తుతం దీనావస్థలో * నిధులున్నా పనులు సాగని వైనం బీఆర్ స్టేడియానికి పునర్ వైభవం వచ్చేనా అని క్రీడాకారులు సందేహిస్తున్నారు. ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పోటీల నిర్వహణకు వేదికైన స్టేడియం పరిస్థితి ప్రస్తుతం దీనావస్థలో ఉంది. అటు పాలకులు, ఇటు అధికారులు ఎవరూ స్టేడియం అభివృద్ధిపై దృష్టి సారించడం లేదనే విమర్శలొస్తున్నాయి. మూడేళ్ల కిందట బీఆర్ స్టేడియంలో వసతులు కల్పించేందుకు నిధులు మంజూరుచేసినా నేటికీ ఒక్క పనీ చేసిన దాఖలాల్లేవని క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. గుంటూరు స్పోర్ట్స్ : ఏపీలో అతి పెద్ద శాప్ క్రీడా మైదానం, రాజధాని నగరంలోని ప్రతిష్టాత్మకమైన స్డేడియం అధ్వానస్థితికి చేరుకుంటున్నా పట్టించుకొనే వారే కరువయ్యారు. నాడు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదికైనా బ్రహ్మనందరెడ్డి స్డేడియం నేడు ఎలాంటి పోటీల నిర్వహణకూ వీలులేని విధంగాSమారింది. 22 ఎకరాల స్థలం ఉన్న స్టేడియం అభివృద్ధికి మూడేళ్ళ కిందట రూ.8.28 కోట్లు మంజూరయ్యాయి. నేటికి అభివృద్ధికీ నోచుకోకపోవటం బాధాకరమని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని పరిధిలో ఉన్న స్డేడియంను అభివృద్ధి చేసి క్రీడాపరికరాలు, శిక్షకులను, క్రీడామైదానాలు అందుబాటులోకి తీసుకొస్తే జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారయ్యే అవకాశం ఉంది. గతంలో జాతీయ, అంతర్జాతీయ వాలీబాల్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్ పోటీలలో అనేక మంది ప్రాతినిధ్యం వహించారు. అలాంటి క్రీడాప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టడం లేదని పలువురు క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. అంతర్జాతీయ క్రీడలకు వేదిక... బీఆర్ స్డేడియం పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు వేదికగా నిలిచింది. ఇండియా– శ్రీలంక క్రికెట్ మ్యాచ్, ఏషియన్ అథ్లెటిక్స్ సెలక్షన్ మీట్ నిర్వహించిన చరిత్ర ఉంది. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, పీటీ ఉషా, రీతు అబ్రహం, బహుదూర్ ప్రసాద్, బల్వీందర్ సింగ్, దృతీచంద్, అన్నావి వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు బీ.ఆర్ స్డేడియంలో కాలు మోపిన ఘటనలూ ఉన్నాయి. ఏషియన్ సెలక్షన్లలో పీటీ ఉషా 400 మీటర్ల పరుగులో రికార్డ్ స్పష్టించిన చరిత్ర ఉంది. నత్తనడకన సాగుతున్న పనులు... 8 కోట్లకు పైగా నిధులు మంజూరు అయి మూడేళ్ళ గడుస్తున్న అ«భివృధ్ధికి నోచుకోలేదు. పరిపాలన భవనం నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుంటే, సింథటిక్స్ టెన్నిస్ కోర్టు నిర్మాణం పనులు చివరి దశలో నిలిపివేశారు. సింథటిక్ ట్రాక్ పరిస్థితి ఏంటి..? సింథటిక్ ట్రాక్ కోసం మూడేళ్ల కిందట కేంద్రప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు అమోదం లభించింది. అయితే నిర్మాణానికి నోచుకోలేదు. స్టేడియాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి, మౌలిక వసతులు కల్పిస్తే ఒలింపియన్లు, అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారని క్రీడాకారులు, క్రీడాభిమానులు వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి సారించాలని కోరుతున్నారు. -
ఎంపీ గల్లా చౌక బేరం
అద్దెకున్న భవనంపై కన్నేసిన జయదేవ్ సగం ధరకే కొట్టేయడానికి పథకం ఎంపీకి సహకరించిన బ్యాంకు డీజీఎం? రూ.7.5 కోట్ల భవనం ప్రారంభ ధర రూ.2.80 కోట్లుగా నిర్ణయం డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలూ బుట్టదాఖలు నేడు 11-12 గంటల మధ్య వేలం ఆసక్తి చూపిన వారికి ఎంపీ అనుచరుల బెదిరింపులు సాక్షి ప్రతినిధి, అమరావతి: 50 శాతం డిస్కౌంట్ అని దుస్తుల దుకాణం ముందు బోర్డు పెడితేనే కొనడానికి క్యూ కట్టే కాలమిది. అలాంటి ప్రైమ్ ఏరియాలో భవనాన్ని సగానికి సగం ధరకే గుంటూరు నగరంలో బ్యాంకు వేలం వేస్తామంటే.. పోటీ ఎక్కువ ఉంటుంది. కానీ అద్దెకున్న భవనాన్ని చౌకగా కొట్టేయడానికి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చక్రం తిప్పారు. బ్యాంకు అధికారుల సహకారంతో వేలానికి పోటీ లేకుండా చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... గుంటుపల్లి శ్రీనివాసరావు గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని 300 గజాల్లో మూడు అంతస్తుల భవనాన్ని 2013లో ఆంధ్రాబ్యాంకులో తాకట్టుపెట్టి రూ. 2.30 కోట్ల రుణం తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ఈఎంఐ చెల్లించలేకపోయారు. ఈ భవనాన్ని 2014 ఎన్నికల సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమాని ఈఎంఐలు చెల్లించలేకపోవడంతో... బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెచ్చి భవనం వేలానికి వచ్చేలా చేశారు. ఆ తర్వాత బ్యాంకు డీజీఎంతో కుమ్మక్కై రిజర్వు ధర మరీ తక్కువగా ఉండేలా చక్రం తిప్పారని తెలుస్తోంది. ఈమేరకు.. ప్రస్తుతం రూ.7.5 కోట్లు మార్కెట్ విలువున్న భవనం ప్రారంభ ధర రూ. 2.80 కోట్లుగా నిర్ణయించి బ్యాంకు ఇటీవల వేలం ప్రకటన జారీ చేసింది. ఆసక్తి చూపినవారికి బెదిరింపులు తన భవనాన్ని వేలం వేయడాన్ని శ్రీనివాసరావు ఆర్డీటీ(డెట్ రికవరీ ట్రిబ్యునల్)లో సవాల్ చేశారు. తాను బాకీ పడిన మొత్తం రూ. 1.98 కోట్లు చెల్లించడానికి కొంత గడువు కావాలని కోరారు. ఈ నెల 24లోగా రూ. కోటి చెల్లిస్తే, మిగతా సగం చెల్లించడానికి సహేతుకమైన గడువు ఇవ్వాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు బుట్టదాఖలు చేస్తూ 24వ తేదీ ఉదయం 11-12 గంటల మధ్య వేలం వేయడానికి బ్యాంకు సిద్ధమైంది. వేలంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు భవనాన్ని సందర్శించడానికి ఈనెల 20, 21 తేదీల్లో అవకాశం కల్పించింది. అయితే భవనాన్ని సందర్శించడానికి వెళ్లిన వారిని... ‘అధికార పార్టీ ఎంపీ నివాసం ఉన్న భవనాన్ని కొని, ఖాళీ చేయించే దమ్ము మీకు ఉందా?’ అని బెదిరించడంతో పోటీకి రాకుండా తప్పుకున్నారు. స్థానిక వ్యాపారి దేనా బ్యాంకు నుంచి ధరావత్తు సొమ్ము చెల్లించినా.. గురువారం రాత్రి వరకు వేలంలో పొల్గొనడానికి వీలు కల్పించే పాస్‌వర్డ్‌ను చెప్పలేదు. పోటీ నుంచి తప్పుకోవాలని అధికార పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. యథేచ్ఛగా నిబంధల ఉల్లంఘన రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం.. వేలం వేయాల్సిన భవనాన్ని ఖాళీ చేయించి బ్యాంకు స్వాధీనం చేసుకోవాలి. బ్యాంకుకు తాకట్టుపెట్టినట్లు అందరికీ కనిపించే విధంగా పెద్ద అక్షరాలతో భవనం మీద రాయాలి. భవనానికి తాళం వేయాలి. కానీ... భవనంలో నివాసం ఉంటున్న ఎంపీ గల్లా జయదేవ్ గురువారం రాత్రి 12 గంటల వరకు ఖాళీ చేయలేదు. బ్యాంకుకు తనఖా పెట్టినట్లు ఎక్కడా రాయనూ లేదు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా... అవన్నీ ఇంటి యజమాని అడగాలి, మీరడుగుతున్నారేంటి? అని ఎదురు ప్రశ్నించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు అందితే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తక్కువ ప్రారంభ ధరపై సమాధానం దాటవేశారు. -
గజదొంగ అరెస్ట్ : 1.88 కోట్ల సొత్తు స్వాధీనం
గంటూరు: కరుడుగట్టిన ఘరానా దొంగల ముఠా గుట్టును గుంటూరు నగర పోలీసులు మంగళవారం రట్టు చేశారు. ఈ ముఠా సభ్యుల నుంచి రూ.1. 88 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో సీసీఎస్ అడిషినల్ ఎస్పీ వీపీ తిరుపాల్, అడిషినల్ ఎస్పీ భాస్కర్‌రావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నర్సారావుపేట రూరల్ మండలం కేతానుపల్లి గ్రామానికి చెందిన రాయపాటి వెంకన్న అలియాస్ వెంకయ్య 2003 నుంచి తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, పెద్దాపురం, కర్నూలు తదితర చోట్ల పలు భారీ చోరీలకు పాల్పడ్డాడని చెప్పారు. అతడిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనాయని తెలిపారు. ఈ చోరీలలో వెంకన్నకు సహకరించిన వెల్లంపల్లి వినోద్‌కుమార్, దినేష్‌లను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు వాహనాలు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.88 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. -
చిన్నారి కిడ్నాప్‌కు యత్నం
గుంటూరు: పాఠశాలలో ఆడుకుంటున్న చిన్నారిని దుండగులు కిడ్నాప్‌కు యత్నించిన ఘటన తాడేపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. బ్రహ్మానందపురానికి చెందిన దామవరపు కిషోర్‌కుమార్ (7) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఉదయం స్నేహితులతో పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగా.. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు పల్సర్ వాహనం పై వచ్చి కిషోర్‌కుమార్‌ను అపహరించుకు వెళ్లారు. ఇది గమనించిన ఇతర విద్యార్థులు గట్టిగా కేకలు వేయడంతో పాటు వారిని వెంబడించి... పట్టుకోవడానికి ప్రయత్నించారు. దాంతో భయపడిన దుండగులు బాబును వదిలి పరారయ్యారు. స్కూల్ సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే కిషోర్ తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్బన్‌లోకి తుళ్లూరు సబ్‌డివిజన్
సాక్షి, గుంటూరు: నూతనంగా ఏర్పాటు చేసిన తుళ్లూరు పోలీస్ సబ్‌డివిజన్‌ను గుంటూరు అర్బన్ జిల్లాలో కలపాలని ప్రభుత్వం, డీజీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం జరగనున్న తుళ్లూరు పోలీస్‌స్టేషన్ గుంటూరు రూరల్ జిల్లా పరిధి, మంగళగిరి, తాడేపల్లి పోలీస్స్టేషన్లు గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో ఉన్నాయి. దీంతో వీవీఐపీలు రాజధాని ప్రాంతానికి వస్తున్నప్పుడు అర్బన్, రూరల్ జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది వారం ముందు నుంచే బందోబస్తు ఏర్పాట్లు చూడాల్సి వస్తోంది. రాజధాని ప్రాంతంలో ఏదైనా నేరం జరిగినప్పుడు ఇద్దరూ అప్రమత్తం కావాల్సి వస్తోంది. ఉదాహరణకు రెండు నెలల క్రితం రాజధాని ప్రాంతంలో పంటపొలాల్లో వెదురు బొంగులు దహనం చేసినప్పుడు ఇద్దరు ఎస్పీలూ పదిహేను రోజులపాటు ఆ పనిమీదే దృష్టి సారించాల్సి వచ్చింది. దీంతో రోజువారీ కార్యకలపాలకు ఇబ్బంది ఏర్పడింది.ఇప్పటి వరకు సత్తెనపల్లి పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న తుళ్లూరు, అమరావతి, పెదకూరపాడు పోలీస్స్టేషన్లను అప్‌గ్రేడ్ చేస్తూ ఇద్దరు సీఐలను నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా తుళ్లూరులో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు, వీటన్నిటినీ కలిపి తుళ్లూరు పోలీస్ సబ్‌డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఇప్పటి వరకు రూరల్ జిల్లా పరిధిలో ఉన్న తుళ్లూరు సబ్‌డివిజన్‌ను గుంటూరు అర్బన్ జిల్లాలో కలపాలని రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఇటు డీజీపీ, అటు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. సమన్వయలోపం రాకుండా ఉండాలంటే రాజధాని ప్రాంతం మొత్తం అర్బన్‌లో ఉండేలా చూడాలని ఆయన సూచించారు. ఏపీఎస్పీ బెటాలియన్‌కు స్పెషల్ బ్యారక్ ల ఏర్పాటు .... తుళ్లూరు ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ హడావుడి, వీవీఐపీల తాకిడి అధికమైంది. దీంతో వీవీఐపీల పర్యటనలు ఉన్నప్పుడల్లా గుంటూరు చుట్టుపక్కల నుంచి బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ముగిసి రైతులకు చెక్కుల పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా తుళ్లూరుకు శాశ్వతంగా 82 మందితో కూడిన ఒక కంపెనీ ఏపీఎస్పీ సిబ్బందిని కేటాయించారు. తుళ్లూరు-అమరావతి మార్గంలో నూతనంగా ఏపీఎస్పీ సిబ్బందికి స్పెషల్ బ్యారక్‌లను నిర్మించారు. ఇక్కడే నివాసం ఉంటూ వీవీఐపీల భద్రత, శాంతి భద్రతలను పరిరక్షించనున్నారు. -
గుంటూరుకు మాజీ రాష్ర్టపతి
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం శనివారం రాత్రి గుంటూరు నగరానికి విచ్చేశారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆయనకు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఆహ్వానించారు. ఆదివారం జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో కలాం పాల్గొంటారు. గుంటూరు ఎడ్యుకేషన్ : మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నగరంలో ఆదివారం పర్యటించనున్నారు. శనివారం రాత్రి గుంటూరుకు చేరుకున్న కలాం ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు నగరపాలక సంస్థ అతిధిగృహం పక్కన నూతనంగా నెలకొల్పిన రమేష్ ఆస్పత్రిని ప్రారంభించి, సభా కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి చిలకలూరిపేట మార్గంలో చోడవరంలోని చేతన ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ విద్యాసంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా చేతన ప్రాంగణంలో చేతివేళ్ళ ఆకారంలో ప్రత్యేకంగా నిర్మించిన పైలాన్‌ను కలాం ఆవిష్కరించి సభలో ప్రసంగిస్తారు. తదుపరి విద్యార్థులతో ప్రశ్నోత్తర కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు గంట సేపు చేతనలో గడిపిన అనంతరం ఆయన భోజన, విరామం తరువాత రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు బయులుదేరి వెళతారని అధికారిక వర్గాలు తెలియజేశాయి. -
సన్మానం దేనికి సారూ...?
గుంటూరు సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీలేవీ అమలు చేయకుండానే సన్మానాలు ఎందుకు చేరుుంచుకుంటున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ప్రశ్నించారు. శనివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో ఆమట్లాడుతూ రుణమాఫీ చేయకుండానే చేసినట్టు నాటకాన్ని రక్తికట్టించినందుకా...అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకా అని నిలదీశారు. తిమ్మిని బమ్మిని చేస్తున్న బాబు ఏదో సాధించినట్టు సన్మానం చేరుుంచుకోవడంపై ఆయన విరుచుకుపడ్డారు. లక్ష కోట్ల రుణాలకు 5వేల కోట్లు చెల్లిస్తానని చెప్పడం ఏం గొప్ప అని ప్రశ్నించారు. వ్యవసాయ రుణాలన్నీ అని ముందు చెప్పి, చివరికి పంట రుణాలకే అంటూ మాట మార్చారనీ, రుణాలు రీషెడ్యూల్ చేయడానికి ఆర్బీఐ అంగీకరించిందని చెప్పి రీషెడ్యూల్ చేయకుండా, కొత్త రుణాలు రాకుండా చేశారని చెప్పారు. బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించకపోవడంతో బీమా సౌకర్యాన్ని కూడా రైతులు కోల్పోయూరని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు కూడా పూర్తిగా రద్దు చేస్తానని చెప్పి అసలు వాటి ఊసే ఎత్తకుండా తెలుగు ఆడపడుచులను మోసం చేశారన్నారు. వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ నిర్వహించిన ధర్నాకు వచ్చే రైతులను, మహిళలను పోలీసులతో అడ్డుకున్నారని దుయ్యబట్టారు. సిగ్గు ఉన్నట్టరుుతే సన్మానం చేయించుకోరని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి చౌకబారు సన్మానాలతో ఇంకా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నించడం హేయమని మండిపడ్డారు. శుక్రవారం జరిగిన మహాధర్నాకు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసిన అందరికీ మర్రి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలో ఉన్నాం కదా ఏమి చేసినా చెల్లుతుందనుకోవడం అవివేకమన్న వాస్తవం ఈ ధర్నా ద్వారా నిరూపితమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వేల మంది వీధుల్లోకి వచ్చారంటేనే ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత స్పష్టమౌతోందన్నారు. అక్రమ కేసులు, అణచివేత చర్యలకు భయపడే వారెవరూ వైఎస్సార్సీపీలో లేరనీ, ఇకపై అలాంటి ఛేష్టలకు స్వస్థి పలకాలనీ మర్రి రాజశేఖర్ హితవు పలికారు. -
అన్నదాతలకు అవమానం
గుంటూరు సిటీ : రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులను ప్రభుత్వం అవమానిస్తోంది. వారి కాలాన్ని వృథా చేస్తూ రైతులంటే లెక్కలేనట్టు వ్యవహరిస్తోంది. భూసేకరణ విషయమై మాట్లాడేందుకు రావాలని ఆహ్వానించి గంటల తరబడి నిలబెట్టింది. ఠంచనుగా వచ్చినా పట్టించుకున్నవారే లేకపోవడంతో రైతులంతా చెట్లకింద నిరీక్షించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వబోమని నిరాకరిస్తున్న రైతులతో మాట్లాడాలని భూ సేకరణ సబ్ కమిటీ నిర్ణయించింది. తొలుత గురువారం విజయవాడలో సమావేశమని రైతులకు కబురు చేశారు. ఆ తరువాత అక్కడ కాదు గుంటూరు రావాలని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్దకు రావాలని కచ్చితంగా చెప్పారు. భూ సేకరణ సబ్ కమిటీ సూచనల మేరకు రాజధాని ప్రతిపాదిత గ్రామాల నుంచి భూములు ఇవ్వబోమంటున్న రైతులు ఠంచనుగా సాయంత్రం ఐదుగంటలకు గుంటూరులోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. అప్పటికి భూ సేకరణ సబ్ కమిటీ సభ్యులు రాలేదు. సమయం ఐదు కాస్తా ఏడయింది..అన్నదాతల్లో అసహనం మొదలైంది. ఏం చేయాలో తోచక అతిథి గృహం ఆవరణలో తచ్చట్లు మొదలెట్టారు. రాత్రి ఎనిమిద య్యింది. ఇప్పటివరకు వేచి ఉండి, ఇక వెనుదిరగడం దేనికని రైతులంతా అక్కడే ఉన్నారు. రాత్రి ఎనిమిది గంటల తరువాత తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాత్రం తాపీగా అతిథిగృహం చేరుకున్నారు. ఆ తరువాత మంత్రి రావెల కిషోర్‌బాబు వచ్చారు. అయినా సమావేశం ప్రారంభం కాలేదు. మూడు గంటలకు పైగా వేచి ఉన్న రైతుల్లో ఒక్కసారిగా అసహనం చెలరేగింది. ఇంకా ఎంత సేపు ఎదురు చూడాలంటూ అతిథి గృహం నుంచి బయటకు బయలుదేరారు. దీంతో ఇటు శ్రావణ్‌కుమార్, అటు రావెల వారిని సముదాయించేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. ఒక దశలో రైతులు రావెల కిషోర్‌బాబుపై విరుచుకుపడ్డారు. భంగపాటుతో ఆయన లోపలకు వెళ్లిపోగా, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వారికి సర్దిచెప్పి శాంతింపజేశారు. -
అడుగేద్దాం..కడిగేద్దాం..
గుంటూరు సిటీ : ఎన్నికల సమయంలో ఎడాపెడా చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయని తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సా ర్ సీపీ సన్నద్ధమైంది. ఆ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నాయకత్వంలో మహాధర్నా జరగనుంది. సార్వత్రిక ఎన్నికల తరువాత జిల్లా స్థాయిలో జరుగుతున్న అతి ముఖ్యమైన కార్యక్రమం కావడంతో దీన్ని పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ధర్నా జరగనున్న ప్రాంతాన్ని గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు నగర అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పర్యవేక్షకుడు ఆళ్ల పేరిరెడ్డి తదితరులు పరిశీలించారు. అనంతరం అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో ఎస్పీ లేకపోవడంతో మహాధర్నాకు అనుమతి కోరుతూ అందుబాటులో ఉన్న ఏఎస్పీ భాస్కరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ చైర్మన్ కొత్త చిన్నపరెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ సయ్యద్ మహబూబ్, అరవ తిమ్మరాజు, బండారు సాయి, రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, అత్తోట జోసఫ్, గంగాధరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది .. మర్రి రాజశేఖర్ రాష్ట్రంలో నడుస్తున్న దగాకోరు పాలనకు వ్యతిరేకంగానే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ మహాధర్నాకు పిలుపు ఇచ్చినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం కోల్పోయిందన్నారు. స్వయంగా ప్రజలే ప్రభుత్వంపై పోరుకు సన్నద్ధంగా ఉన్నారని వివరించారు. నమ్మి ఓట్లేసిన నేరానికి నట్టేట ముంచిన బాబుపై దుమ్మెత్తి పోస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో జరుగుతున్న మహాధర్నాను విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరు నగర అధ్యక్షుడు,రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్త ఫా, లాలుపురం రాము, నసీర్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో జరగనున్న మహాధర్నాకు నగరంలోని అన్ని డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రానున్నట్లు చెప్పారు. రుణమాఫీపై బాబు ప్రకటన హాస్యాస్పదం : ఉమ్మారెడ్డి రుణమాఫీపై రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. తొలి సంతకంపైనే ఆయనకు ఇంకా స్పష్టత లేకపోవడం విచారకరమన్నారు. శివరామకృష్ణన్, కోటయ్య కమిటీ నివేదికల ప్రకారం తొలుత రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన వారుగా లక్షా 29వేల మందిని గుర్తించగా, తెలుగుదేశం ప్రభుత్వం ఆ సంఖ్యను 85వేలకు కుదించిందన్నారు. మొదట లక్షన్నర లోపున్న అందరికీ ఒకే దఫా రుణమాఫీ చేస్తానన్న బాబు తాజాగా తొలి విడతలో రూ. 50వేల లోపు అప్పున్న వారికి మొత్తాన్ని ఇచ్చేట్లు, అంతకు మించి పైన ఉన్న రుణగ్రహీతలకు అందులో 20శాతం మాత్రమే చెల్లించే విధంగా చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. మిగిలిన మొత్తానికి బాండ్లు ఇస్తానంటున్నారు కానీ అవి ఎంత వరకు చట్టబద్ధమో అన్నది ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. -
రేపు మహాధర్నా
గుంటూరు సిటీ : రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. ప్రజా విశ్వాసం కోల్పోయిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు పరచకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. అందుకే శుక్రవారం జిల్లా కేంద్రం గుంటూరులోని కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ సీపీ మహాధర్నా చేపట్టిందని తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమానికి రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు హాజరై ప్రభుత్వంపై తమకు ఉన్న వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రుణ మాఫీ అమలు సాధ్యం కాదని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి చెబుతున్నప్పటికీ, స్వయంగా టీడీపీ అధినేత చంద్ర బాబుకు కూడా ఈ సంగతి తెలిసినప్పటికీ అబద్ధపు హామీతో అధికారంలోకి వచ్చిన సంగతి రైతులకు కూడా తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. బాబు వస్తే జాబు అన్న మాట కూడా నీటి మీద రాతేననీ, కొత్తగా ఒక్క జాబు కూడా ఇవ్వకపోయిన ఆయన ఉన్న ఉద్యోగాలు కూడా ఊడబీకుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన బాధ్యత నిజాయతీ గల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీపై ఉందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 5వ తేదీన మహా ధర్నాకు పిలుపునిచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ ధర్నాకు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలనీ, దీన్ని జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వంపై తమకు ఉన్న వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తం చేయాలనీ మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నేతలు అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), షేక్ మహమ్మద్ ముస్తఫా, ఆళ్ల పేరిరెడ్డి జిల్లాలోని వేర్వేరు చోట్ల మాట్లాడుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహాధర్నాకు ఆదర్శ రైతుల మద్ధతు మహాధర్నాకు ఏ.పి.స్టేట్ ఆదర్శ రైతుల అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బుధవారం ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శేఖర్ ఆధ్వర్యంలో పలువురు ఆదర్శ రైతులు గుంటూరులో రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ను కలసి మహాధర్నాకు తమ పూర్తి సంఘీభావం ప్రకటించారు. -
పేకాటరాయుళ్ల అవతారం ఎత్తిన కానిస్టేబుళ్లు
గుంటూరు: గుంటూరు నగరంలోని సితారా లాడ్జిపై పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో పేకాటాడుతున్న 9 మంది కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.36 లక్షల నగదుతోపాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన కానిస్టేబుళ్లలో ఇద్దరు స్థానిక ప్రజా ప్రతినిధుల వద్ద గన్మెన్లుగా విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. లాడ్జీలో పలువురు పేకాడుతున్నట్లు ఆగంతకులు పోలీసులుకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఇటీవల కాలంలో గుంటూరు నగరంలో పలు లాడ్జీల కేంద్రంగా పేకాటరాయుళ్లు విజృంభిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
విద్యార్థుల ప్రాణాలు కాపాడిన 'విద్యుత్ కోత'
గుంటూరు : దాదాపు 50 మంది విద్యార్థులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విద్యార్థులను స్కూల్‌కు తీసుకువెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టింది. అయితే అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాలలో విద్యుత్ కోతతో సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ఘటన గుంటూరు నగరంలోని నవభారత్ నగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం విద్యార్థులను తల్లిదండ్రులతో ఇంటికి పంపించేశారు. అలాగే బస్సు ఢీ కొనడంతో ట్రాన్స్ఫార్మర్ కింద పడిపోయింది. దీనిపై విద్యుత్ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. -
గుంటూరు నగరంలో బంద్ సంపూర్ణం