మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నగరంలో ఆదివారం పర్యటించనున్నారు. శనివారం రాత్రి గుంటూరుకు చేరుకున్న....
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం శనివారం రాత్రి గుంటూరు నగరానికి విచ్చేశారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆయనకు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఆహ్వానించారు. ఆదివారం జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో కలాం పాల్గొంటారు.
గుంటూరు ఎడ్యుకేషన్ : మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నగరంలో ఆదివారం పర్యటించనున్నారు. శనివారం రాత్రి గుంటూరుకు చేరుకున్న కలాం ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఉదయం 10.15 గంటలకు నగరపాలక సంస్థ అతిధిగృహం పక్కన నూతనంగా నెలకొల్పిన రమేష్ ఆస్పత్రిని ప్రారంభించి, సభా కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి చిలకలూరిపేట మార్గంలో చోడవరంలోని చేతన ప్రాంగణానికి చేరుకుంటారు.
ఉదయం 11.30 గంటలకు శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ విద్యాసంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా చేతన ప్రాంగణంలో చేతివేళ్ళ ఆకారంలో ప్రత్యేకంగా నిర్మించిన పైలాన్‌ను కలాం ఆవిష్కరించి సభలో ప్రసంగిస్తారు. తదుపరి విద్యార్థులతో ప్రశ్నోత్తర కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు గంట సేపు చేతనలో గడిపిన అనంతరం ఆయన భోజన, విరామం తరువాత రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు బయులుదేరి వెళతారని అధికారిక వర్గాలు తెలియజేశాయి.