
సాక్షి, గుంటూరు : గుంటూరులో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో రాహువ్ నహక్(8) జీజీహెచ్‌లో చేరాడు. దీంతో, చికిత్స పొందుతున్న రాహువ్ నుంచి శనివారం రాత్రి జీజీహెచ్ అధికారులు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు.
గొంతు, ముక్కు నుంచి స్వాబ్ తీయడంతోపాటు, రక్తం, మూత్రం శాంపిల్స్‌ను సేకరించి ప్రత్యేకంగా భద్రపరిచారు. వ్యాధి నిర్ధారణ కోసం ఆ శాంపిల్స్‌ను ఎపిడిమాలజిస్టు డాక్టర్ వరప్రసాద్‌తో శనివారం రాత్రి 10 గంటలకు విమానంలో పూణేకు పంపిస్తామని, వ్యాధి నిర్ధారణకు 3 రోజుల సమయం పడుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి తెలిపారు.
కాగా, ఒడిశాకు చెందిన బనిత నహక్, గౌడ నహక్‌లు తమ కుమారుడు రాహువ్ నహక్‌తో కలిసి ఒడిశా నుంచి యడ్లపాడు స్పిన్నింగ్‌మిల్లుకు 16 రోజుల కిందట వచ్చారని పేర్కొన్నారు. ఒంటిపై గుల్లలు రావడంతో ఈ నెల 28న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారని, ప్రత్యేక వార్డులో బాలుడిని అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: సాగర గర్భంలో పర్యాటకం
Comments
Please login to add a commentAdd a comment