
పేకాటరాయుళ్ల అవతారం ఎత్తిన కానిస్టేబుళ్లు
గుంటూరు నగరంలోని సితారా లాడ్జిపై పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో పేకాటాడుతున్న 9 మంది కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంటూరు: గుంటూరు నగరంలోని సితారా లాడ్జిపై పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో పేకాటాడుతున్న 9 మంది కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.36 లక్షల నగదుతోపాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసుస్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పట్టుబడిన కానిస్టేబుళ్లలో ఇద్దరు స్థానిక ప్రజా ప్రతినిధుల వద్ద గన్మెన్లుగా విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. లాడ్జీలో పలువురు పేకాడుతున్నట్లు ఆగంతకులు పోలీసులుకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఇటీవల కాలంలో గుంటూరు నగరంలో పలు లాడ్జీల కేంద్రంగా పేకాటరాయుళ్లు విజృంభిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.