ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: క్యాసినో, పోకర్, పేకాట, తీన్‌పత్తా.. దీన్ని అడ్డంపెట్టుకుని బేగంపేటను అడ్డాగా చేసుకుని హైదరాబాద్‌ను శాసిస్తున్నాడు అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి. ప్రతి పండుగతో పాటు ముఖ్యమైన రోజుల్లో పేకాట నిర్వహిస్తూ కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగిస్తున్నాడు. ఒకవేళ పేకాటలో ఎవరైనా పట్టుబడితే విడిపించే బాధ్యత తనదంటూ భరోసా ఇచ్చి జూదానికి ప్రేరేపిస్తాడు.
ఈ క్రమంలోనే కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇందులో భాగస్వామ్యులైన వీఐపీలను గోవా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాలకు తీసుకెళతాడు. అక్కడ కూడా కోట్లు పెట్టి క్యాసినో ఆడిస్తున్న అరవింద్.. భారీ స్థాయిలో వెనకేసుకుంటున్నాడు. ఇటీవల బేగంపేటలో 150మందికి అరవింద్ ఆహ్వానం పంపగా, అందులో 85 మంది హాజరయ్యారు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్.. పలువురిని అరెస్ట్ చేసింది.
పేకాట, క్యాసినో నిర్వహించే ముందు అరవింద్ అగర్వాల్ ప్రముఖులకు ఇన్విటేషన్స్ పంపుతాడు. అదే సమయంలో లొకేషన్ కూడా షేర్ చేస్తాడు. ఇది చాలాకాలంగా స్వేచ్ఛగా సాగుతుండటంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో బేగంపేట పేకాట అడ్డాపై టాస్క్‌ఫోర్స్ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
అరవింద్ అగర్వాల్ ఫోన్లో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలు లిస్టు ఉన్నట్లు తెలుస్తోంది. అరవింద్ అగర్వాల్తో పాటు నలుగురిని అరెస్టు చేశారు. కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్థానికులు తెలపగా, ఐదుగురి మాత్రమే అరెస్ట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. దీని వెనక చాలా మంది ఉండగా ఐదుగురిని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment