Poker Club
-
ఏపీలో అనధికారిక పేకాట క్లబ్బులు
-
పేకాట మొదలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేకాట మళ్లీ మొదలైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసేయించిన పేకాట క్లబ్‌లు టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. అధికార కూటమి నేతలు క్లబ్‌లను ప్రారంభించేందుకు వారం రోజులుగా సన్నాహాలు చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్లబ్‌లను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు నగరంలో నడిబొడ్డున ఉన్న ప్రముఖ క్లబ్లో బుధవారం నుంచి పేకాట ప్రారంభమైంది.గత టీడీపీ ప్రభుత్వాల హయాంలో పేకాట క్లబ్బులది ప్రత్యేక చరిత్ర. రిక్రియేషన్ పేరుతో ఈ క్లబ్‌లలో పేకాటే కాదు.. బెట్టింగులు, అసాంఘిక కార్యకలాపాలూ కొనసాగేవి. ఊర్ల శివార్లు, తోటల్లో ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించేవారు. అంతా ఆ పార్టీ నేతల నిర్వహణలో, వారి కనుసన్నల్లోనే జరుగుతుండేవి. వీటిని మూసి వేయాలని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశాయి. అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో అవి నిరాఘాటంగా కొనసాగాయి. 2019లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా క్లబ్‌లను మూసివేయించింది. రిక్రియేషన్ పేరుతో క్లబ్‌లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, పేకాట, బెట్టింగ్‌లను పూర్తిగా నిషేధించింది. వీటి మూసివేతకు ప్రత్యేక బృందాలను కూడా నియమించింది. గత ఐదేళ్లలో ఎక్కడా పేకాట క్లబ్‌లు నడవకుండా చర్యలు తీసుకుంది.టీడీపీ కూటమి అధికారంలోకి రాగానేరాష్ట్రంలో మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్లీ క్లబ్‌లు, శిబిరాలు తెరిచి పేకాట, బెట్టింగ్, ఇతర కార్యకలాపాలకు రంగం సిధ్ధం చేస్తున్నారు. క్లబ్‌ల నిర్వాహకులు ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయించగా, తాము చూసుకుంటామని, క్లబ్‌లు ప్రారంభించుకోండని భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎలాంటి అనుమతులు లేకపోయినా 2019కి ముందు మాదిరిగానే మళ్లీ క్లబ్‌ల వ్యవహారాలు నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే గతంలో ఆడిన క్లబ్ సభ్యులకు మళ్ళీ పేకాట ప్రారంభిస్తున్నట్టు సమాచారం అందించారు.రోజూ లక్షల్లో వ్యాపారంక్లబ్లో ప్రతి ఆటకు ప్రతి టేబుల్ నుంచి సుమారు రూ.1000 చొప్పున కమీషన్ తీసుకుంటారు. అలా 20కి పైగా టేబుల్స్‌తో పేకాట, సైడ్ బిజినెస్‌లతో రోజూ లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పేకాట కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్లబ్‌ల బారిన పడి ఉన్నతస్థాయిలో ఉన్న వారు, మధ్యతరగతి వారు అనేక మంది ఆస్తులు పోగొట్టుకొని, అప్పుల పాలైపోయారు. వారిలో కొందరు దిక్కు తోచక ఆత్మహత్యలు కూడా చేసుకొన్నారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బాగు పడిందల్లా క్లబ్‌ల నిర్వాహకులు, వాటి నుంచి నెలనెలా మామూళ్ల రూపంలో లక్షలాది రూపాయలు దండుకొనే కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులే. ఇప్పుడు మళ్లీ ప్రజల జేబులను పీల్చి పిప్పి చేసి, తమ జేబులు నింపుకొనేందుకు అధికార కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ఇవి మళ్లీ ప్రారంభమైతే మధ్య తరగతి కుటుంబాల జీవితాలు చీకటిమయం కావడం ఖాయం. అధికార పార్టీ నాయకులకు భయపడి ఇలాంటి క్లబ్‌లను పోలీసులు చూసీ చూడకుండా వదిలేస్తారా లేక వాటిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
పేకాటలో హైదరాబాద్‌ను శాసిస్తున్న అరవింద్!
హైదరాబాద్: క్యాసినో, పోకర్, పేకాట, తీన్‌పత్తా.. దీన్ని అడ్డంపెట్టుకుని బేగంపేటను అడ్డాగా చేసుకుని హైదరాబాద్‌ను శాసిస్తున్నాడు అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి. ప్రతి పండుగతో పాటు ముఖ్యమైన రోజుల్లో పేకాట నిర్వహిస్తూ కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగిస్తున్నాడు. ఒకవేళ పేకాటలో ఎవరైనా పట్టుబడితే విడిపించే బాధ్యత తనదంటూ భరోసా ఇచ్చి జూదానికి ప్రేరేపిస్తాడు. ఈ క్రమంలోనే కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇందులో భాగస్వామ్యులైన వీఐపీలను గోవా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాలకు తీసుకెళతాడు. అక్కడ కూడా కోట్లు పెట్టి క్యాసినో ఆడిస్తున్న అరవింద్.. భారీ స్థాయిలో వెనకేసుకుంటున్నాడు. ఇటీవల బేగంపేటలో 150మందికి అరవింద్ ఆహ్వానం పంపగా, అందులో 85 మంది హాజరయ్యారు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్.. పలువురిని అరెస్ట్ చేసింది. పేకాట, క్యాసినో నిర్వహించే ముందు అరవింద్ అగర్వాల్ ప్రముఖులకు ఇన్విటేషన్స్ పంపుతాడు. అదే సమయంలో లొకేషన్ కూడా షేర్ చేస్తాడు. ఇది చాలాకాలంగా స్వేచ్ఛగా సాగుతుండటంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో బేగంపేట పేకాట అడ్డాపై టాస్క్‌ఫోర్స్ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అరవింద్ అగర్వాల్ ఫోన్లో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలు లిస్టు ఉన్నట్లు తెలుస్తోంది. అరవింద్ అగర్వాల్‌తో పాటు నలుగురిని అరెస్టు చేశారు. కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్థానికులు తెలపగా, ఐదుగురి మాత్రమే అరెస్ట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. దీని వెనక చాలా మంది ఉండగా ఐదుగురిని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. -
తగ్గేదేలే... ఈడ కాదంటే.. ఆడ ఆడతాం..!
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పేకాట కేంద్రాలు మళ్లీ జోరందుకున్నాయి. పక్క రాష్ట్రాల్లో ఆడితే ఇబ్బందేంటని భావించిన పేకాట నిర్వాహకులు ఏకంగా అక్కడ భూములు కొనుగోలు చేసి క్లబ్బులుగా మార్చేశారు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసుకుని మరీ దందా సాగిస్తున్నారు. వారంలో మూడు రోజులు పేకాట రాయుళ్లకు అన్ని రకాల వసతులు కల్పించి లక్షల్లో కమిషన్ పేరిట దోచుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో జరుగుతున్న పేకాట వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇసుక కాంట్రాక్టర్లదే హవా.. మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో తక్కువ ధరకే భూములు కొనుగోలు చేయడం లేదా లీజుకు తీసుకుని పెద్ద రేకులతో కంచెలు నిర్మించి, లోపల విశాలమైన హాళ్లు, పడక గదులు నిర్మించి పేకాటకు తెరతీశారు. రాష్ట్రంలోని మంచిర్యాల, చెన్నూర్ ప్రాంతాల్లో ఇసుక దందా నిర్వహిస్తున్న కొందరు ప్రముఖులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతం, మహారాష్ట్రలోని సిరోంచ, అమ్రావతి, కంబాల్‌పేట ప్రాంతాల్లో క్లబ్బులు ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో అక్కడి స్థానిక మాఫియా ఏర్పాటు చేసిన క్లబ్బులను లోకల్ పోలీసులు మూసేయించారు. ఆరు నెలల కింద తెలంగాణకు చెందిన ఓ బడా ఇసుక కాంట్రాక్టర్ ఆ స్థలాన్ని లీజుకు తీసుకుని క్లబ్బు ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకున్నాడు. అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులతో చేతులు కలిపి రీక్రియేషన్, స్పోర్ట్స్ క్లబ్బుల పేరిట పేకాట నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ముగ్గురు క్రషర్, బీడీ ఆకు కాంట్రాక్టర్లు కలసి మూడు ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లోని బడా వ్యక్తులంతా ఆగస్టు నుంచి పేకాటకు వెళ్తున్నట్లు సమాచారం. కేరళపై మక్కువతో.. బడా బాబులు, ప్రముఖులకు కేరళ సిండికేట్ బ్యాచ్ ఆహ్వానం అందిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం విమానం ఎక్కడం, శని, ఆదివారాలు అక్కడే ఉండటం లక్షల్లో సమర్పించుకుని వస్తున్నట్లు ఇటీవల పోలీసులుకు పట్టబడ్డ సుమన్ చౌదరి విచారణలో తేలింది. అయితే రాయిచూర్ కేంద్రంగా సాగుతున్న పేకాట కేంద్రాల నిర్వాహకుల సిండికేటే కేరళలోనూ వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. పేకాటలో పెట్టే డబ్బులు కాకుండా కేవలం ఎంట్రీ ప్యాకేజీ కోసం రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి వారం 50 నుంచి 70 మంది కేరళ వెళ్తున్నట్లు తెలిసింది. రష్యా వెళ్లాలనుకునే వారికి.. వీవీఐపీల కోసం ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి మరీ రష్యాకు పంపేందుకు సుమన్ చౌదరితో పాటు కేరళ సిండికేట్ బ్యాచ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ఏకంగా అక్కడి మాఫియాతో చేతులు కలిపి వీవీఐపీ బ్యాచ్‌కు వారం పాటు మూడు ముక్కలాట ఆడిస్తోందని చెబుతున్నారు. రెండు నెలల కింద 18 మంది ప్రముఖులు రష్యా వెళ్లి వచ్చినట్లు సుమన్ చౌదరి విచారణలో బయటపడింది. ప్రముఖుల వివరాలు మాత్రం పోలీసులు బయటకు రానివ్వట్లేదు. పాత నిర్వాహకులకు అడ్డా.. ఇక్కడ పేకాట నిర్వహణలో చేయితిరిగిన వ్యక్తి తన అనుచరులతో కలసి కర్ణాటక సరిహద్దు అయిన రాయిచూర్‌లో నాలుగు పేకాట కేంద్రాలను ఏర్పాటు చేశాడు. 2019 ఏప్రిల్‌లో కరోనా వల్ల మూతపడ్డ క్లబ్బును ఇటీవలె మళ్లీ తెరిచినట్లు పోలీసు వర్గాలకు తెలిసింది. గతంలో బోయిన్‌పల్లితో పాటు నల్లకుంట, బంజారాహిల్స్, బేగంపేటలో క్లబ్బులు నిర్వహించిన వాళ్లంతా ఇప్పుడు సిండికేట్‌గా మారి రాయిచూర్ నుంచి భగాల్‌కోట్ వెళ్లే మార్గంలో ఏర్పాటుచేసిన పేకాట కేంద్రాలకు ప్రతి వారం 300 మందికి పైగా వెళ్తున్నట్లు తెలిసింది. పేకాట కేంద్రాల నిర్వాహకులే ఏసీ బస్సులు ఏర్పాటు చేసి రాయిచూర్ తీసుకెళ్తున్నట్లు తెలిసింది. వీళ్లకు ఐడీ కార్డులు ఇచ్చి ఎంత మేరకు ఆడుతారో వాటికి సంబంధించి డబ్బులు తీసుకుని కాయిన్స్ ఇస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి రాయిచూర్ వెళ్లేలోపు వీళ్లకు కావాల్సిన ఏర్పాట్లు, కాయిన్స్, ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిసింది. (చదవండి: Amrabad Tiger Reserve: అమ్రాబాద్‌కు ‘వైల్డ్’ ఎంట్రీ) -
పేకాట కేసు: ముగిసిన సుమన్ కస్టడీ.. వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: మంచిరేవుల పేకాట కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ చౌదరి పోలీస్ కస్టడీ ముగిసింది. రెండు రోజులపాటు సుమన్‌ను విచారించిన పోలీసులు నేడు కోర్టులో హాజరు పర్చనున్నారు. కాగా పోలీసుల విచారణంలో కీలక అంశాలు వెలుగుచూశాయి. సుమన్‌పై క్యాసినో, పేకాట ఇతర కేసుల వివరాలపై పోలీసులు ఆరా తీశారు.. చాలా కాలంగా సుమన్ క్యాసినో, పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ, తెలంగాణలో సుమన్ చౌదరిపై పలు కేసులు నమోదైనట్లు, ఎంట్రీ ఫీజు, కమీషన్ల రూపంలో లక్షల రూపాల వసూళ్లు చేసినట్లు తేలింది. సుమన్‌కు రాజకీయ నేతలు, రియల్టర్స్‌తో పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. నగరంలోని శివారు ప్రాంతాల్లోని విల్లాలు, ఫామ్‌హౌజ్‌లు, హోటల్స్, రిసార్ట్స్ వేదికగా ఈ కార్యకలాపాలు నిర్వహించినట్లు తేలింది. క్రికెట్ బెట్టింగ్‌కు సైతం పలువురు నిందితులు పాల్పడినట్టు గుర్తించారు. అయితే డ్రగ్స్ కోణంలో సైతం పోలీసులు విచారించారు. మరోసారి కూడా సుమన్ చౌదరిని పోలీస్ కస్టడికి కోరే అవకాశం ఉంది. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట కాగా గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా సుమన్‌కుమార్ చౌదరి ఓ టీవీ చానల్లో డైరెక్టర్‌గా, రియల్టర్‌గా అవతారం ఎత్తాడు. సినిమాల్లో పెట్టుబడులు పెడుతుండటంతోపాటు పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటాడు. పేకాటరాయుళ్లను గ్రూపులుగా చేసి హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులకు రప్పించాడు. సినీహీరో నాగశౌర్య తండ్రి వాసవి రవీంద్రప్రసాద్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో పెద్దఎత్తున పేకాట శిబిరాన్ని ప్రారంభించాడు. అది ఎస్ఓటీ పోలీసులకు తెలియటంతో ఆదివారం రాత్రి దాడులు చేసి అరెస్టు చేశారు. -
నాగశౌర్య తండ్రికి నోటీసులు ఇచ్చిన పోలీసులు
-
నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట
మణికొండ (హైదరాబాద్): నగర శివారులోని ప్రముఖుల ఫాంహౌజ్‌లను అద్దెకు తీసుకొని పేకాట దందా సాగిస్తున్న వ్యవహారాన్ని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) బట్టబయలు చేసింది. ప్రముఖులకు బర్త్‌డే పార్టీ పేరిట వాట్సాప్‌లో ఆహ్వానాలు పంపి క్యాసినోలు నడిపిస్తున్న ప్రధాన సూత్రదారితోపాటు 30మంది పేకాటరాయుళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సూత్రధారి సుమన్ చౌదరి గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా సుమన్‌కుమార్ చౌదరి ఓ టీవీ చానల్లో డైరెక్టర్‌గా, రియల్టర్‌గా అవతారం ఎత్తాడు. సినిమాల్లో పెట్టుబడులు పెడుతుండటంతోపాటు పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటాడు. అతను గతంలో గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో భూకబ్జాకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. పేకాటరాయుళ్లను గ్రూపులుగా చేసి హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులకు రప్పించాడు. సినీహీరో నాగశౌర్య తండ్రి వాసవి రవీంద్రప్రసాద్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో పెద్దఎత్తున పేకాట శిబిరాన్ని ప్రారంభించాడు. అది ఎస్ఓటీ పోలీసులకు తెలియటంతో ఆదివారం రాత్రి దాడులు చేసి అరెస్టు చేశారు. ఫాంహౌజ్‌ను లీజుకు తీసుకున్న రవీంద్రప్రసాద్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేసి స్టేషన్‌కు రప్పించి విచారించారు. అంతా ప్రముఖులే... ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంలో పోలీసులకు చిక్కిన వారిలో రాజకీయ, రియల్ఎస్టేట్ గ్రూపులకు చెందిన ప్రముఖులు ఉన్నారు. మహాబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్యతోపాటు వాసవి డెవలపర్స్ గ్రూప్‌నకు చెందిన రాజారామ్, మద్దుల ప్రకాశ్‌లతోపాటు మరీడు తనున్, గుమ్మడి రామస్వామి చౌదరి, ననదిగ ఉదయ్, సీహెచ్ శ్రీనివాసరావు, టి.శివరామకృష్ణ, బాడిగ సుబ్రమణ్యం, పండిటాగ సురేష్, నాగార్జున, కౌతాపు వెంకటేశ్, మిర్యాల భానుప్రకాశ్, పాతూరి తిరుమల, వీర్ల శ్రీకాంత్, ఎం.మల్లిఖార్జున్‌రెడ్డి, బొగ్గారాపూర్ నాగ, గట్ట వెంకటేశ్వర్రావు, ఎస్ఎస్ఎన్ రాజు, యు.గోపాల్‌రావు, బి.రమేశ్‌కుమార్, కాంపల్లి శ్రీనివాస్, ఇమ్రాన్ ఖాన్, టి.రోహిత్, బొల్లబోడ ఆదిత్య, సీహెచ్ గణేష్, తోట ఆనందకిషోర్, షేక్ ఖదీర్, బి.రాజేశ్వర్ ఉన్నారు. రెడ్‌కాయిన్‌కు రూ.5 వేలు ఫామ్‌హౌజ్‌లో ప్రముఖులతో మూడు ముక్కల ఆట ఆడించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పేకాట శిబిరాల్లో డబ్బు బదులుగా కాయిన్స్‌ను సరఫరా చేస్తారు. రెడ్ కాయిన్‌కు ఐదు వేలు, గ్రీన్ కాయిన్‌కు రెండువేలు, బ్లూ కాయిన్‌కు వెయ్యి రూపాయల లెక్క కడుతున్నారు. పోలీసులకు చిక్కిన 30 మందికి రాజేంద్రనగర్ అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. కొందరు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిని న్యాయమూర్తి తిరస్కరించారు. చంద్రబాబు, లోకేశ్‌లతో ఫొటోలు మంచిరేవుల ఫాంహౌజ్‌లో క్యాసినో నిర్వహిస్తున్న గుత్తా సుమన్ చౌదరి ప్రముఖులతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తోపాటు ఓ పత్రిక యజమానితో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. చదవండి: సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాటరాయుళ్ల పట్టివేత -
ఇక్కడ పేకాట మామూలే!
అసాంఘిక కార్యకలాపాలను అణచివేయడంలో పోలీసుల మెతకవైఖరి సరికాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఎస్పీ, కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు. ప్రధానంగా పేకాట క్లబ్‌లపై మెరుపు దాడులు నిర్వహించి వాటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు. దీంతో పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్లో జరుగుతున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. క్లబ్లో పేకాట జరగకుండా పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాక్షి, కదిరి(అనంతపురం) : పట్టణంలో సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదురుగానే పెద్దల పేకాట అడ్డా ఉంది. కొన్నేళ్లుగా అక్కడ రిక్రియేషన్ ముసుగులో పేకాట జోరుగా సాగుతోంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి చెందిన రాజారెడ్డి ఆ పేకాట క్లబ్‌కు అధ్యక్షుడిగా ఉంటూ దాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేకాట కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, జిల్లా ఎస్పీ దానిపై దృష్టి సారించాలని పట్టణవాసులు కోరుతున్నారు. పేరుకే రిక్రియేషన్ క్లబ్ కమ్యూనిటి రిక్రియేషన్ క్లబ్(సీఆర్సీ) పేరుతో పట్టణ నడిబొడ్డున అది కూడా పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో నిర్వహిస్తున్నారు. వాస్తవంగా అక్కడ క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ లాంటి ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడుకోవడానికి గతంలో అనుమతి నిచ్చారు. కేవలం రిక్రియేషన్ మాత్రమే అక్కడ కన్పించాలి. అయితే అందులో ఎక్కడా ఇండోర్ గేమ్స్ కనిపించవు. కింద అంతస్తులోనే కాకుండా పై అంతస్తులో కూడా పేకాట ఆడేందుకు పలు టేబుళ్లు ఏర్పాటు చేశారు. పేకాట రాయుళ్లకు ఉక్కపోత ఉండకూడదని ఏసీలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్లో ప్రతి ఆటకు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి పేకాట ఆడుతున్నారు. ఇది ఇక్కడున్న పోలీసు అధికారులకు తెలియదనుకుంటే పొరపాటే. వారు దీన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పేకాట క్లబ్ వైపు పోలీసులు తొంగి చూసిన పాపాన పోలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా అక్కడ ఎలాంటి మార్పు కనబడటం లేదు. ఇక్కడ కందికుంటదే హవా ‘2009 నుంచి ఇప్పటి దాకా ఏటా జనవరి 26న మా నాయకుడు, టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాదే ఈ క్లబ్లో జాతీయ జెండా ఎగరేస్తున్నారు. 2014లో చాంద్‌బాషా ఎమ్మెల్యే అయినప్పటికీ ఇక్కడ మాత్రం కందికుంటే ఎమ్మెల్యే. అందుకే మా నాయకుడు కందికుంటే ఇక్కడ జాతీయ జెండాను ఎగరేస్తున్నాడు. ఇక భవిష్యత్‌లో కూడా కందికుంటే ఎగరేస్తాడు. దమ్ముంటే క్లబ్‌ను టచ్ చేసి చూడండి’ అని ఈ క్లబ్లో ఉన్న కొందరు కందికుంట అనుచరులు సవాల్ విసురుతున్నారు. ఇక్కడ పేకాట జరుగుతున్న బహిరంగ రహస్యమని కూడా వారంటున్నారు. క్లబ్ ఫలితంగా ఎన్నో కుటుంబాలు నాశనం సీఆర్సీ క్లబ్లో పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి పట్టణానికి చెందిన రాజారెడ్డి, వెంకటేష్ అనే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. రామాంజులురెడ్డి అనే మరో ఎల్ఐసీ ఉద్యోగి పేకాటలో భారీగా డబ్బు పోగొట్టుకున్నారు. దీనిపై ఆయన భార్య అప్పట్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక ఆ కుటుంబం హైదరాబాద్‌కు బదిలీ చేసుకొని వెళ్లిపోయారు. ఆ క్లబ్‌ను ఆనుకునే అమ్మాయిల హాస్టల్ కూడా ఉంది. క్లబ్‌లోని కొందరు సభ్యులు క్లబ్‌లోనే మద్యం సేవించి హాస్టల్ అమ్మాయిలనే వేధించడంతో పాటు హాస్టల్‌ల్లోకి రాళ్లు విసిరిన సంఘటనలు కూడా లేకపోలేదు. దీనిపై గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు. సభ్యుల మధ్య కూడా పలుమార్లు గొడవలు జరిగి స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. కేవలం కాలక్షేపం కోసం ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అనుమతిస్తే పేకాట రిక్రియేషన్ క్లబ్ కాస్తా పేకాట క్లబ్‌గా మార్చేశారని కొందరు క్లబ్ సభ్యులే వాపోతున్నారు. జిల్లా ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు పరిశీలించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
ఎంపీ మాగంటి బాబు ఆఫీస్‌లో పేకాట
-
పేకాటడెన్గా టీడీపీ ఎంపీ ఆఫీస్
-
పేకాట డెన్‌గా ఎంపీ ఆఫీస్
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా జూదం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)కు చెందిన కృష్ణాజిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. రూ. 5వేలు రిజిస్ట్రేషన్ చార్జిగా వసూలు చేస్తూ కనీసం రూ.5 లక్షలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ జూదం నిర్వహిస్తున్నారు. ఇందులో రోజుకు రూ.12 కోట్లు వరకు చేతులు మారుతున్నట్లు వినిపిస్తోంది. మూడు నెలలుగా కోత ఆట నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ పేకాట కొనసాగుతున్నా వీకెండ్ (శుక్ర,శని,ఆదివారాలు)లో పందేలు మరింత పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో జూదరులు.. కోట్లలో పందేలు.. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు తదితర జిల్లాలతో పాటు హైదారాబాద్ నుంచి ప్రత్యేకంగా పేకాట రాయుళ్లను ఆహ్వానించి కోత ఆట నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు 80 మంది నుంచి వంద మంది వరకు ఈ కోత ఆటకు వస్తుంటారు. ఎంపీ కార్యాలయంలోని పెద్ద హాలులో నిర్వహించే ఈ పేకాటలో పాల్గొనే జూదరులకు పక్క రూమ్‌లోనే మందు, విందు ఏర్పాట్లు చేయడం గమనార్హం. ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటల వరకు కోత ఆట జరుగుతూనే ఉంటుంది. రోజుకు కనీసం రూ.5 కోట్లు నుంచి 12 కోట్లకు పైగా బెట్టింగ్‌ల రూపంలో చేతులు మారుతోంది. అధికార పార్టీ ఎంపీ కార్యాలయం కావడంతో పోలీసులు అటువైపు చూసే సాహసం చేయలేకపోతున్నారు. అయినా నెలవారీ మూమూళ్లు షరా మామూలేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కైకలూరు పేకాటపై కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ కి స్పందించలేదు. అధికార పార్టీ నేతలు, క్రికెట్ బుకీలే నిర్వాహకులు... టీడీపీ ఎంపీ కార్యాలయంలో సాగుతున్న ఈ పేకాట క్లబ్‌కు పశ్చిమగోదావరి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు, హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన క్రికెట్ బుకీలు నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. కోతాట క్లబ్ నిర్వహిస్తున్నందుకు గాను వారికి కమీషన్లు ముడుతున్నాయని, గత మూడు నెలల్లో సుమారు రూ.23 కోట్ల మేర కమీషన్ల రూపంలో సంపాదించారని తెలిసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధాన క్రికెట్ బుకీగా పోలీస్ రికార్డులకెక్కిన శ్రీకాకుళంకు చెందిన వ్యక్తి, ఇటీవల నెల్లూరులో పట్టుబడిన క్రికెట్ బుకీలు ఇచ్చిన సమాచారంతో పోలీస్ రికార్డులకెక్కిన మరో వ్యక్తి, హైదరాబాద్‌లో పేకాడుతూ పట్టుబడిన వ్యక్తి, భీమవరం తదితర ప్రాంతాల్లో భారీగా క్రికెట్ పందాలు, పేకాటల్లో ఆరితేరిన వ్యక్తులు ఈ జూద శిబిరానికి నేతృత్వం వహిస్తున్నట్టు వినిపిస్తోంది. ఈ అనధికార పేకాట క్లబ్లో టీడీపీ నేతలు, కోత ఆట నిపుణులకు ఆరు వాటాలుండగా రాష్ట్రంలోని కీలక క్రికెట్ బుకీలకు ఏడవ వాటాగా లాభాలను పంచుతున్నారని సమాచారం. జూదరులకు ఆప్పులిచ్చి మరీ ఆడిస్తున్నారు... ప్రతిరోజూ వచ్చే జూదరులకు వారి పరపతికి తగినట్లు నిర్వాహకులు అప్పులు కూడా ఇస్తున్నారు. పేకాటరాయుళ్లకు అప్పులిచ్చే వ్యక్తి కోత ఆట జరిగే హాలులో ఒక మూలన టేబులు, కుర్చీ వేసుకుని కూర్చుని ఉంటారు. ప్రతీ రోజు దాదాపు రూ.5 కోట్ల మేర అప్పుగా ఇచ్చి వారి పేర్లు నమోదు చేసుకుంటాడు. కరెన్సీకి బదులు రంగు రంగుల కాయిన్స్ ఇస్తాడు. రూ.10 లక్షలను అప్పుగా ఇచ్చినందుకు రోజుకు రూ.20 వేలు కమీషన్‌గా వసూలు చేస్తాడు. మొదటి రోజు అప్పుగా తీసుకున్న మొత్తాన్ని మరుసటి రోజు పేకాటకు వచ్చినప్పుడు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోత ఆటలో నిర్వాహకులకే ఎక్కువ ఛాన్స్‌లు ఉండటంతో పేకాట రాయుళ్ల జేబులు గుల్లవుతున్నాయి. ఇటీవల కోత ఆటలో భారీగా నష్టపోయిన వైజాగ్, ఒంగోలు, భీమవరం, విజయవాడకు చెందిన పలువురు యువకులు ఆస్తులు అమ్ముకుని అప్పులు తీర్చాల్సిన దుస్థితి వచ్చింది. అప్పులు తీర్చలేక మరికొందరు జూదరులు ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. ఏమిటి ఈ కోత ఆట..?? పేకాటలో అత్యంత ప్రమాదకరమైన గేమ్ ఇది. సహజంగా రిక్రియేషన్, కల్చరల్ క్లబ్‌ల్లో 13 పేక ముక్కలతో ఆడే రమ్మీ (కిల్ గేమ్)ని ఎటువంటి బెట్టింగ్‌లు లేకుండా అధికారులు అనుమతిస్తుంటారు. కానీ బెట్టింగ్‌లతో ఆడే పేకాట, కోత ఆట, కోసు పందేలపై మాత్రం నిషేధం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన కొన్నేళ్లకే గ్యాంబ్లింగ్ యాక్ట్ తెచ్చారు. దాని ప్రకారం స్కిల్ గేమ్ మినహా.. బెట్టింగ్ వేసే ఏ పేకాటను చట్ట ప్రకారం అనుమతి ఇవ్వరు. కోత ఆట అంటే లోనా బయటా ముక్కలు తిప్పుతూ ఎంపిక చేసిన పేక ముక్క ఎటువైపు పడితే అటువైపు పందేలు గెలిచినట్లుగా పరిగణిస్తుంటారు. ఇందులో క్షణాల్లో లక్షలాది రూపాయలు అటో ఇటో తేలిపోతాయి. దీనికంటే ప్రమాదకరమైంది కోసు పందెం. ఇందులో లోనా బయటా పేకలు తిప్పుతూ ఎక్కువ అవకాశాలు నిర్వాహకులకే ఉంచుకుంటారు. çఫలానా పేక ముక్క వస్తే పందెం డబ్బు ఇవ్వబోమని చెబుతారు. రెండో ముక్క, ఒకటో ముక్క ఇలా ఎంపిక చేసిన పేక ముక్క నిర్వాహకులు చెప్పినట్లు వస్తే ఆ మొత్తం నిర్వాహకుల జేబుల్లోకి వెళితాయి. ఒకటికి రెండు, మూడు రెట్లు అదనంగా ఇస్తామని ప్రకటిస్తూ నిర్వాహకులు మోసం చేస్తుంటారు. పేకాట డెన్‌గా ఎంపీ ఆఫీస్ -
అధికారం ఆడిందే ఆట
♦ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట ♦ రాజధానిలో యథేచ్ఛగా నిర్వహణ ♦ అనధికార క్లబ్బుల్ని ఏర్పాటు చేసి ఆడిస్తున్న వైనం ♦ ఫిర్యాదులు అందినా పట్టించుకోని స్థానిక పోలీసులు సాక్షి, గుంటూరు: జిల్లాలో పేకాట క్లబ్బులకు పోలీసు ఉన్నతాధికారులు అనుమతివ్వకపోవడంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల బంధువులు, కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు అనధికారికంగా పేకాట స్థావరాల్ని ఏర్పాటు చేసి ఆడిస్తున్నారు. ప్రతి రోజూ బంకిణీల పేరుతో వేలాది రూపాయలను పేకాట రాయుళ్ల నుంచి వసూలు చేస్తున్నారు. ‘పోలీసులతో ముందే మాట్లాడుకున్నాం.. వారికి నెలవారీ మామూళ్లు ముట్టజెపుతూనే ఉన్నాం.. మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా నిర్భయంగా ఇక్కడకు వచ్చి పేకాట ఆడుకోవచ్చు’ అంటూ ఓపెన్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. దీంతో జూదగాళ్లు ‘డబ్బు పోయినా పర్వాలేదు, పోలీసుల బెడద లేకుండా ఉంటే చాలం’టూ ఆ స్థావరాలకు వెళ్లి హాయిగా ఆడేసుకుంటున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ తంతు కొనసాగుతోంది. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని మంగళగిరి, నూతక్కి, యర్రబాలెం, పేరేచర్ల, రూరల్ జిల్లా పరిధిలోని నాదెండ్ల, యడ్లపాడు, నర్సరావుపేట, దాచేపల్లి వంటి ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట కేంద్రాలు నడుస్తున్నాయి. రాజధానిలో ప్రాంతంలో.. రాజధాని ప్రాంతమైన మంగళగిరి పట్టణంతోపాటు ఆ మండలంలోని నూతక్కి, యర్రబాలెం వంటి గ్రామీణ ప్రాంతాల్లో సైతం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట కేంద్రాలు నడుస్తున్నాయి. మంగళగిరి మండలం రామచంద్రాపురం, తాడేపల్లి మండలాల్లో కేంద్రాలు నడుస్తున్న విషయం గతంలో ‘సాక్షి’ కథనాలు ప్రచురించగా ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో ఆ గ్రామాల్లో తాత్కాలికంగా పేకాట నిలిచిపోయింది. మిగతా ప్రాంతాల్లో పేకాట కేంద్రాలు నడుస్తుండటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పేకాట రాయుళ్లు తరలి వస్తున్నారు. మేడికొండూరు మండలంలోని పేరేచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం జోరుగా సాగుతోంది. ఇళ్లను క్లబ్బులుగా మార్చుకుని.. నరసరావుపేట రూరల్ మండలంలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో గతంలో ముఖ్యనేత తనయుని అనుయాయులు పేకాట కేంద్రాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో దానిపై గుంటూరు స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసి 15 మందిని అరెస్టు్ట చేసి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, రూ. 7.95 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు. ప్రస్తుతం కోటప్పకొండ పరిసర ప్రాంతాలు, మండల సరిహద్దుల వద్ద రోజుకో స్థావరం మారుస్తూ పేకాట ఆడిస్తున్నట్లు సమాచారం. పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లిలో కొన్ని నెలల క్రితం క్లబ్బు మూతపడటంతో ఇళ్లలోనే పేకాట కేంద్రాలు నడుస్తున్నాయి. రోజుకో ప్రాంతంలో తమకు అనువుగా ఉన్న ఇళ్లలో పేకాట నిర్వహిస్తున్నారు. నాదెండ్ల మండలంలోని ఓ రైస్ మిల్లో, యడ్లపాడు మండలంలోని కొన్ని గ్రామాల్లో టీడీపీ నేతలే పేకాట కేంద్రాల్ని నడుపుతుండటంతో పోలీసులు వాటి జోలికి వెళ్లడం లేదు. కొందరు పోలీస్ అధికారులు నెలవారీ మామూళ్లు పుచ్చుకుంటూ శిబిరాల వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేకాట నిర్వాహకులు నిత్యం పోలీస్స్టేషన్లలోనేæ కూర్చుని పంచాయితీలు సైతం చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది రైతులు, చిరు ఉద్యోగులు పేకాటలో లక్షలు పోగొట్టుకుని అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలూ లేకపోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారంపై రహస్య విచారణ జరిపి పేకాట నిర్వాహకులకు సహకరిస్తున్న పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
క్లబ్లో అడ్దంగా దొరికన ప్రభుత్వ ఉద్యోగులు
-
క్లబ్‌లు తెరుద్దాం
ప్రజాప్రతినిధులపై తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లు పక్క జిల్లాలో లేని అభ్యంతరం ఇక్కడెందుకని ప్రశ్న వారి ఆవేదనను అధినేత దృష్టికి తీసుకెళ్లే యోచన రాజధాని నగరమంటే మంత్రులు, అధికారులు, కార్యాలయాలే ఉంటే ఎట్లా.. కాస్తంత రిక్రియేషన్, ఆపై సంపాదన కూడా ఉండాలనే ఆలోచన తెలుగు తమ్ముళ్లకు వచ్చింది. ఇంకేముంది తమకు అనుకూలురైన ప్రజాప్రతినిధుల ద్వారా పేకాట క్లబ్‌లు తెరిపిం చేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. విజయవాడ సిటీ : రాజధాని ముఖద్వారం కృష్ణా జిల్లాలో పేకాటక్లబ్‌లు ఏర్పాటుచేయాలని తమ్ముళ్లు ఉబలాటపడుతున్నారు. వాటి ఆవశ్యకతను వివరించడంతో పాటు అందుకు సహకరిస్తే ఒనగూరే ఆర్థిక ప్రయోజనాల్ని ఎరగా వేస్తున్నారు. ప్రభుత్వపరంగా ఊ..అనిపిస్తే చాలు, పోలీసుపరంగా తాము మేనేజ్ చేసుకుంటామనే భరోసా ఇస్తున్నారు. వీరి ప్రతిపాదనలపై కొందరు కేబినెట్ స్థాయి ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వీరి ప్రయత్నాలు ఫలిస్తే వచ్చే దసరా నాటికి జిల్లాలో ఐదారు పేకాటక్లబ్‌లు రావడం ఖాయమనిపిస్తోంది. ప్రయత్నాల్లో తెలుగు తమ్ముళ్లు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి కుమారుడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో మూతపడిన పేకాట క్లబ్‌ను నెల రోజుల కిందట తెరిపించి నిర్వహిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన కొందరు అధికార పార్టీ నాయకుల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ క్లబ్లో పేకాడేందుకు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన జూదరులు ‘హ్యాపీ’గా వెళ్లొస్తున్నారు. ఇదే రీతిలో తాము కూడా ఏర్పాటు చేసుకుంటామంటూ పలువురు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. కంచికచర్ల మండలం, ఆగిరిపల్లి మండలంలో మూతపడిన క్లబ్‌లను తెరుస్తామంటూ ముందుకొస్తున్నారు. వీటిల్లో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు భాగస్వాములుగా చేరేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ నగరంలో ఓ సొసైటీ క్లబ్‌తోపాటు మరో కొత్త క్లబ్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవికాక నూజివీడు, ఆగిరిపల్లి మండలాల్లోని మామిడి తోటలు, నందిగామ, గుడివాడ, కైకలూరు పరిసర ప్రాంతాల్లోని పొలాల అతిథి గృహాల్లో తాత్కాలిక క్లబ్‌ల ఏర్పాటుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. సొమ్ము చేసుకునేందుకే.. రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా పలువురు బలోపేతం అవుతున్నట్టు తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు. భూములు అమ్మడం ద్వారా కొందరు ఆర్థిక స్థితిమంతులైతే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా లాభాలు ఆర్జించేవారి సంఖ్య కూడా బాగానే ఉంది. దసరాకు రాజధానికి శంకుస్థాపన చేస్తే విజయవాడ పరిసర ప్రాంతాలు, కృష్ణాజిల్లాలో భూముల క్రయవిక్రయాలు పెరిగి ఆదాయ వనరులు మరింత పెరుగుతాయని వారి ఆశ. పైగా రాజధానికి చేరువ కావడంతో వ్యాపారాలన్నీ కూడా బాగానే పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఇక్కడ క్లబ్‌లు లేకుంటే హైదరాబాద్, చెన్నై ప్రాంతాలకు వెళ్లి పేకాడతారని, ఇక్కడి సంపద పొరుగు ప్రాంతాలకు తరలివెళుతుందని చెబుతున్నారు. ఇక్కడే క్లబ్‌లను అనుమతించిన పక్షంలో అందరికీ ‘ప్రయోజనం’ ఉంటుందనే ఫార్ములాను ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వాధినేత దృష్టికి తీసుకెళుతున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు పేకాట క్లబ్‌ల్లో నిబంధనలు అతిక్రమించకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామంటూ ప్రతిపాదిస్తున్నారు. వీటిని సంబంధిత పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేస్తామని, ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలించుకోవచ్చంటున్నారు. పేకాట వ్యవహారాలు నిక్కచ్చిగా జరిగే విధంగా కొందరు పోలీసు సిబ్బందిని సీసీ కెమెరాల పర్యవేక్షణకు పెడితే బాగుంటుందని, అవసరమైతే వారికయ్యే జీతభత్యాలు కూడా తామే చెల్లిస్తామనే అభిప్రాయాన్ని కూడా వీరు వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లుగా పార్టీని మోసిన తమకు ఈ మాత్రం మేలు చేయకుంటే ఎలాగంటూ ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లకు దిగుతున్నారు. ఇప్పటికే వీరిపై సానుకూలంగా ఉన్న గాడ్ఫాదర్లు ఓ మంచి ముహుర్తం చూసుకుని అధినేత నుంచి గ్రీన్‌సిగ్నల్ తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.