గుంటూరు : దాదాపు 50 మంది విద్యార్థులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విద్యార్థులను స్కూల్కు తీసుకువెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టింది. అయితే అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాలలో విద్యుత్ కోతతో సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు.
ఆ ఘటన గుంటూరు నగరంలోని నవభారత్ నగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం విద్యార్థులను తల్లిదండ్రులతో ఇంటికి పంపించేశారు. అలాగే బస్సు ఢీ కొనడంతో ట్రాన్స్ఫార్మర్ కింద పడిపోయింది. దీనిపై విద్యుత్ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు.