‘క్రీడా’విహీనం | 'Sports less' ground | Sakshi
Sakshi News home page

‘క్రీడా’విహీనం

Published Wed, Aug 24 2016 8:50 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

‘క్రీడా’విహీనం

‘క్రీడా’విహీనం

  

* ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదిక
* ప్రస్తుతం దీనావస్థలో 
* నిధులున్నా పనులు సాగని వైనం 

  

 
బీఆర్‌ స్టేడియానికి పునర్‌ వైభవం వచ్చేనా అని క్రీడాకారులు సందేహిస్తున్నారు. ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పోటీల నిర్వహణకు వేదికైన స్టేడియం పరిస్థితి ప్రస్తుతం దీనావస్థలో ఉంది. అటు పాలకులు, ఇటు అధికారులు ఎవరూ స్టేడియం అభివృద్ధిపై దృష్టి సారించడం లేదనే విమర్శలొస్తున్నాయి. మూడేళ్ల కిందట బీఆర్‌ స్టేడియంలో వసతులు కల్పించేందుకు నిధులు మంజూరుచేసినా నేటికీ ఒక్క పనీ చేసిన దాఖలాల్లేవని క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. 
 
గుంటూరు స్పోర్ట్స్‌ : ఏపీలో అతి పెద్ద శాప్‌ క్రీడా మైదానం, రాజధాని నగరంలోని ప్రతిష్టాత్మకమైన స్డేడియం  అధ్వానస్థితికి చేరుకుంటున్నా పట్టించుకొనే వారే కరువయ్యారు. నాడు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదికైనా బ్రహ్మనందరెడ్డి స్డేడియం నేడు ఎలాంటి పోటీల నిర్వహణకూ వీలులేని విధంగాSమారింది. 22 ఎకరాల స్థలం ఉన్న  స్టేడియం అభివృద్ధికి మూడేళ్ళ కిందట రూ.8.28 కోట్లు మంజూరయ్యాయి. నేటికి అభివృద్ధికీ నోచుకోకపోవటం బాధాకరమని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని పరిధిలో ఉన్న స్డేడియంను అభివృద్ధి చేసి క్రీడాపరికరాలు, శిక్షకులను, క్రీడామైదానాలు అందుబాటులోకి తీసుకొస్తే జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారయ్యే అవకాశం ఉంది. గతంలో  జాతీయ, అంతర్జాతీయ  వాలీబాల్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్‌ పోటీలలో  అనేక మంది ప్రాతినిధ్యం వహించారు. అలాంటి క్రీడాప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టడం లేదని పలువురు క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. 
 
అంతర్జాతీయ క్రీడలకు వేదిక...
బీఆర్‌ స్డేడియం పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు వేదికగా నిలిచింది. ఇండియా– శ్రీలంక క్రికెట్‌ మ్యాచ్, ఏషియన్‌ అథ్లెటిక్స్‌ సెలక్షన్‌ మీట్‌ నిర్వహించిన చరిత్ర ఉంది. సునీల్‌ గవాస్కర్, కపిల్‌ దేవ్, పీటీ ఉషా, రీతు అబ్రహం, బహుదూర్‌ ప్రసాద్, బల్వీందర్‌ సింగ్, దృతీచంద్, అన్నావి వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు బీ.ఆర్‌ స్డేడియంలో కాలు మోపిన ఘటనలూ ఉన్నాయి. ఏషియన్‌ సెలక్షన్‌లలో పీటీ ఉషా 400 మీటర్ల పరుగులో రికార్డ్‌ స్పష్టించిన చరిత్ర ఉంది.
 
నత్తనడకన సాగుతున్న పనులు...
8 కోట్లకు పైగా నిధులు మంజూరు అయి మూడేళ్ళ గడుస్తున్న అ«భివృధ్ధికి నోచుకోలేదు. పరిపాలన భవనం నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుంటే, సింథటిక్స్‌ టెన్నిస్‌ కోర్టు నిర్మాణం పనులు చివరి దశలో నిలిపివేశారు. 
 
సింథటిక్‌ ట్రాక్‌ పరిస్థితి ఏంటి..?
సింథటిక్‌ ట్రాక్‌ కోసం మూడేళ్ల కిందట కేంద్రప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు అమోదం లభించింది. అయితే నిర్మాణానికి నోచుకోలేదు. స్టేడియాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి, మౌలిక వసతులు కల్పిస్తే ఒలింపియన్‌లు, అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారని క్రీడాకారులు, క్రీడాభిమానులు వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి సారించాలని కోరుతున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement