
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. సాంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం 2022 టీటీడీ క్యాలెండర్, డైరీ సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం గరుడ వాహన సేవలో సీఎం పాల్గొన్నారు. తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ఆయన ప్రారంభించారు.
ముందుగా తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి తిరుమల చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని సీఎం దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment