
సాక్షి, తాడేపల్లి: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా రేపు (02.10.2022, ఆదివారం) మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకోనున్నారు. అంతేకాదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పిస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఇక ఇంద్రకీలాద్రిపై దసరా శోభ కనిపిస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మూలానక్షత్రం సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తుతారని ఆలయ అధికారులు అంచనా వేసి.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment