దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆడపచులు సంప్రదాయ నృత్యాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈక్రమంలోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తనయ, బారామతి ఎంపీ సుప్రియా సూలే గార్బా, దాండియా ఆటలతో అలరించారు. మహారాష్ట్ర ఇందాపూర్‌లోని లఖెవాడి ప్రాంతంలో ఆమె స్థానికులతో కలిసి బుధవారం గార్బా నృత్యం చేశారు. చేతుల్లో చెక్క కోలలు పట్టుకుని దాండియా ఆడారు. లోవెయాత్రి సినిమాలోని చొగడా పాటకు ఆమె ఆడిపాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
(చదవండి: తల్లి గర్భంలోనే రుచుల మక్కువ)
కాగా, గుజరాత్ ప్రాంతంలో గార్బా, దాండియా నృత్యాలు సంప్రదాయంగా ఉన్నాయి. దేవి నవరాత్రుల్లో వీటిని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇతర ప్రాంతాల్లో సైతం వీటికి ఈ మధ్య కాలంలో ప్రాధాన్యం పెరిగింది. ఇదిలాఉండగా.. ముంబైలోని ప్రఖ్యాత మెరైన్ డ్రైవ్‌లో బుధవారం యువతీయువకులు భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసుకున్న గార్బా నృత్యానికి సంబంధించిన దృశ్యాలు సైతం వైరల్‌గా మారాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నవరాత్రి ఉత్సవ వేడుకలకు ముంబై ప్రసిద్ధి అని క్యాప్షన్ జత చేశారు.
(చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. గాయపడిన చిన్నారిని చూసి కన్నీరు పెట్టుకున్న మహిళా అధికారి)
Comments
Please login to add a commentAdd a comment