బాసర (ఆదిలాబాద్) : బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. గోదావరి అంత్యపుష్కరాలను పురస్కరించుకొని ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.