భైంసా, న్యూస్‌లైన్ : చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువుదీరిన బాసరలో విద్యార్థుల కోసం మెరుగైన వసతులతో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీ సమస్యల వలయంలో చిక్కుకుంది. ఎన్నో ప్రమాణాలు.. మరెంతో లక్ష్యంతో నిర్మించిన ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఉండాలంటేనే భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. భవ నం చుట్టూ ప్రహరీ లేక కుక్కలు.. పశువులు బెడద వేధిస్తోంది. ట్రిపుల్ ఐటీ ప్రారంభమై ఐదేళ్లు కావస్తున్నా విద్యార్థుల సంక్షేమ కోసం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నిండా నిర్లక్ష్యం..
బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాల చుట్టూ ప్రహరీ లేదు. దీం తో పశువులు, మేకలు, కుక్కలు ట్రిపుల్ ఐటీ ఆవరణలోనే సంచరిస్తుంటాయి. దీనికితోడు మెస్‌కు చెందిన వ్యర్థ పదార్థాలను కళాశాల ఆవరణలో డంపింగ్ చేస్తున్నారు. వాటి నుంచి వచ్చే దుర్వాసనతోపాటు అక్కడికి కుక్కలు కూడా వస్తుంటాయి. ఇవే కాకుండా ట్రిపుల్‌ఐటీ చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. అయినా.. విద్యార్థుల సంక్షేమ కోసం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు స్పందించడంలేదు. కళాశాల ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రహరీ నిర్మాణానికి నోచుకోలేదు. ఫలితంగా శుక్రవారం రాత్రి తరగతి గ దుల నుంచి భోజనశాల వైపు వస్తున్న విద్యార్థులపై పి చ్చి కుక్క దాడిచేసింది. 20 మందిని తీవ్రంగా గాయపర్చడంతో రాష్ట్రవ్యాప్తంగా పిల్లల తల్లిదండ్రులు హై రానా పడ్డారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులు ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలపాలైన వారిని హైదరాబాద్ తరలించారు. మరికొందరు త ప్పించుకునే ప్రయత్నంలో కిందపడి గాయపడ్డారు.
ఆదివారం మరోమారు దాడికి యత్నం..
శుక్రవారం రాత్రే కుక్క 20 మంది విద్యార్థులను గా యపరిచిన విషయం తెలిసిందే. అయితే.. ఆదివారం రాత్రి సమయంలోనూ మరో కుక్క కళాశాల ఆవరణ లోకి వచ్చింది. దాడికి యత్నించే క్రమంలో విద్యార్థు లు గమనించి పారిపోయేలా ప్రయత్నించారు. ఈ క్ర మంలో కిందపడి విద్యార్థినులు మౌనిక, భవాని గా యపడ్డారు. ఇద్దరికీ స్థానికంగా చికిత్స అందించారు. ఇదిలాఉంటే.. అప్పటికే కళాశాలలోని 60 శాతం మం ది విద్యార్థులు భోజనం చేయగా.. కుక్క ఎప్పుడు వ చ్చి దాడి చేస్తుందోనని భయాందోళనకు గురై రాత్రి 40 శాతం మందిభోజనానికి దూరంగా ఉన్నారు.
తేరుకోకుంటే మరోముప్పు..
ట్రిపుల్‌ఐటీ కళాశాల విద్యార్థులను కుక్క దాడిలో గాయపడ్డారు. ఇప్పటికైనా యాజమాన్యం తేరుకోవాల్సి ఉంది. విద్యార్థుల రక్షణపై దృష్టి సారించాలి. ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో భవనాలపై చాలా చోట్ల తేనె తుట్టెలు పెట్టాయి. ప్రమాదవశాత్తు అవి చెలరేగితే విద్యార్థులు మరోసారి పరుగులు తీయాల్సిందే. నీటి ట్యాంకు ఆనుకుని ఉన్న భవనంలోనూ.. ఆస్పత్రికి వెళ్లే మార్గంలోనూ ఇవి కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఓ వైపు కుక్కలు.. మరో వైపు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారు.
సెలవు రోజుల్లో తొలగిస్తే మేలు..
ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీలో 8 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాల ఆవరణలో తేనె తుట్టెలు పెట్టాయి. ఇప్పుడు వాటిని తొలగించినా ఇబ్బందులు తలెత్తుతాయి. దసరా సెలవుల్లో విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోతారు. అలాంటి సమయంలోనైనా విశాలంగా ఉన్న ట్రిపుల్‌ఐటీ భవనాల్లో తేనె తుట్టెలను తొలగిం చాలి. ట్రిపుల్‌ఐటీ కళాశాల ఆవరణలో మూగజీవాలు, గొర్రెలను మేపుతుంటారు. చిట్టడివిని తలపించే కళాశాల ఆవరణను శుభ్రం చేయాలి. ముళ్లపొదలు తొల గించి కళాశాల ఆవరణను చదును చేయాలి. లేనిపక్షంలో విషసర్పాలు తిరిగే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వానికి నివేదిస్తాం
- నారాయణ, ట్రిపుల్‌ఐటీ ఓఎస్‌డీ
ప్రహరీ నిర్మాణానికి ప్రభుత్వం 57 ఎకరాల భూమి సేకరించింది. ఇందులో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రహరీ నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ట్రిపుల్‌ఐటీ చుట్టూ గోడ నిర్మించే విషయంలో ప్రభుత్వానికి మరోసారి నివేదిస్తాం.
ట్రిపుల్ ఐటీలో కుక్కల బెడద
Published Mon, Sep 30 2013 2:54 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM
Advertisement
Advertisement