బాసరలో భక్తుల సందడి | basara is now full of devoties | Sakshi
Sakshi News home page

బాసరలో భక్తుల సందడి

Published Sat, Aug 27 2016 11:49 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

basara is now full of devoties

బాసర : శ్రావణమాసంలో ఆఖరి శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు బాసరకు తరలివచ్చారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువజామున పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నదితీరాన శివాలయంలో పూజలు నిర్వహించారు. తమ చిన్నారులకు ఆలయ అర్చకులచే తల్లిదండ్రులు అక్షరాభ్యాస స్వీకార, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో  కొలువుదీరిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement