
బాసరలో పోటెత్తిన భక్తులు
ఆదిలాబాద్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవాలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవాలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు15వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహరాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదే శ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరిలో స్థానమాచరించారు. అనంతరం తల్లిదండ్రులు చిన్నారులకు అక్షర శ్రీకార, కుంకుమార్చన పూజలు చేయించారు. అమ్మవారి దర్శనానికి సుమారుగా 2 నుంచి 3 గంటల వరకు సమయం పడుతోంది.
(బాసర)