యశ్వంత్‌పూర్-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెనుప్రమాదం తప్పింది.
ఆదిలాబాద్: యశ్వంత్‌పూర్-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెనుప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి ట్రాక్‌పై ఉన్న కంకర మెషిన్‌ను రైలు ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.
రైలు ధర్మాబాద్ నుంచి తెలంగాణలోని బాసరకు వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ధర్మాబాద్ స్టేషన్ సమీపంలో కాపలాదారుడు లేని గేటు వద్ద ట్రాక్ మరమ్మతులు జరుగుతున్నాయి. మరమ్మతుల కోసం తీసుకువచ్చిన కంకర మెషిన్ రైల్వే ట్రాక్‌పై ఉండడంతో వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో కంకర మెషిన్ 200 మీటర్ల దూరంలో ఎగిరి పడింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకున్నా.. రైలింజన్ నుంచి ఆయిల్ లీకేజీ కావడంతో రైలును నిలిపివేశారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ బృందం ధర్మాబాద్‌కు చేరుకున్నారు. ట్రాక్‌పై ఉన్న వాటిని తొలగించి మరో రైలు ఇంజన్‌ను తెప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.