బాసర: గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు పుష్కరఘాట్ల వద్ద సందడి వాతావారణం నెలకొంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా బాసరలో అధిక సంఖ్యలో పుష్కరస్నానాలను ఆచరిస్తున్నారు. దీంతో బాసరలోని పరిసర ప్రాంతాలు యాత్రికులతో కోలాహలంగా మారాయి. కాగా, పుష్కర ఏర్పాట్లపై భక్తులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బాసర వద్ద అనుకున్న స్థాయిలో గోదావరి నీటి మట్టం లేకపోవడమే ఇందుకు కారణం.
అయితే పుష్కర స్నానాలు ప్రశాంత వాతావరణంలో జరగుతుండటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మంత్రి జోగు రామన్న బాసరలో స్నానం చేసిన అనంతరం పుష్కరాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. ప్రముఖ సినీ నటుడు సుమన్ కూడా బాసరలో పుష్కరస్నానం చేసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా మంగపేటలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పుష్కర స్నానం చేశారు.