బాబ్లీ వదిలినా భరోసా లేదు..! | Pushkarams nearing, but Godavari bone dry | Sakshi
Sakshi News home page

బాబ్లీ వదిలినా భరోసా లేదు..!

Published Sat, Jun 27 2015 3:03 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

బాబ్లీ వదిలినా భరోసా లేదు..!

బాబ్లీ వదిలినా భరోసా లేదు..!

వరుణుడు కరుణిస్తేనే బాసర వద్ద పుష్కర స్నానాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: గోదావరి నది ఖమ్మం జిల్లా భద్రాద్రి వద్ద పరవళ్లు తొక్కుతుంటే.. ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద మాత్రం ఇప్పటికీ ఎడారినే తలపిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో నదిలో వరద నీరు వచ్చి చేరలేదు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్సారెస్పీ నీటి మట్టం కూడా అంతగా పెరగలేదు. ప్రస్తుతం 1,057.6 అడుగుల నీటి మట్టం ఉంది. అంటే ఈ ప్రాజెక్టులో కనీసం మత్తడి లేవల్ వరకు కూడా నీరు రాలేదు.

ఎస్సారెస్పీకి 80 శాతం క్యాచ్‌మెంట్ ఏరియా మహారాష్ట్రలో ఉంది. సుమారు ఐదు శాతం కర్నాటకలో ఉండగా, మిగిలిన 20 శాతం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉంటుంది. ఈ రెండు జిల్లాలో వారం రోజులుగా కొంత మేరకు వర్షపాతం నమోదైనప్పప్పటికీ, మహారాష్ట్ర, కర్నాటకల్లో ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో నీటి ప్రవాహం కనిపించడం లేదు. రానున్న పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే జూలై 14 నుంచి ప్రారంభం కానున్న పుష్కర స్నానాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. జూలై మొదటి వారం తర్వాతే నీటిమట్టం విషయంలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement