ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మెస్ నిర్వహణ సరిగా లేదని గురువారం ఉదయం నుంచి ధర్నా చేశారు. ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ అప్పలనాయుడు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పినా విద్యార్థులు వినలేదు. మెస్ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
(బాసర)