ఇడుపులపాయలో విద్యార్థుల ఆందోళన
Published Fri, Sep 15 2017 11:45 AM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM
కడప: వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. భోజనం సరిగ్గా ఉండటం లేదంటూ తరగతులు బహిష్కరించి మెస్‌ల ముందు బైఠాయించారు. శుక్రవారం ఉదయం కళాశాల ప్రారంభమయ్యే సమయంలో విద్యార్థులంతా కలిసి మెస్‌ల ఎదుట ఆందోళనకు దిగారు. భోజనం సరిగ్గా ఉండటం లేదని.. దాని వల్లే తరచు అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
Advertisement
Advertisement