బాసర (ఆదిలాబాద్) : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసంలో చివరి ఆదివారం కావడంతో.. అమ్మవారి సమక్షంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. శ్రీ జ్ఞాన సరస్వతి సన్నిధిలో చిన్నారుల అక్షరాభ్యాసాలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది.