కాలం కలిసిరాక రైతు లు ఆత్మహత్యల ఒడి చేరుతున్నారు. అతివృష్టి నిలువు నా ముంచినా ఆదుకునే వారు లేక.. ప్రాణాలు వదులుతున్నారు.
బాసర/గుడిహత్నూర్, న్యూస్‌లైన్ :
కాలం కలిసిరాక రైతు లు ఆత్మహత్యల ఒడి చేరుతున్నారు. అతివృష్టి నిలువు నా ముంచినా ఆదుకునే వారు లేక.. ప్రాణాలు వదులుతున్నారు. వెరసి అప్పుల బాధ తాళలేక జిల్లాలో శుక్రవా రం రాత్రి, శనివారాల్లో ఇద్దరు రైతులు బలవన్మరణం పొందారు. ముథోల్ మండలం కిర్గుల్(బి) గ్రామానికి చెందిన నడిపి కోట య్యకు పదెకరాలు భూమి ఉంది. ఆయన ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకైన మల్లయ్య (32) తనకు కేటాయించిన మూడెకరాల్లో పత్తి సాగుచేశాడు. ఇందుకు తన తండ్రి పేర బ్యాంకులో రూ.50 వే లు రుణం తీసుకున్నాడు. అంతకుముందు చేసిన అప్పులు లక్షన్నర వరకు ఉన్నాయి. ఈసారీ అతివృష్టి కారణంగా అనుకున్నంత స్థాయిలో దిగుబడి రాలేదు. దీంతో రూ.2 లక్షల అప్పులు ఎలా తీర్చాలో తెలియక మైలాపూర్ గ్రామ శివారులో శనివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, ఇద్దరు కొడుకులున్నారు.
కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ ఎస్సై పున్నం చందర్ తెలిపారు. అలాగే గుడిహత్నూర్ మండలంలోని నేరడిగొండతండాకు చెందిన రాథోడ్ రాము (40) తనకున్న నాలుగున్నర ఎకరాలతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, కంది పంటలు సాగుచేశాడు. ఇందుకోసం మహారాష్ట్ర బ్యాంకులో రూ.40 వేలు అప్పు చేశాడు. భార్య మీరాబాయి పేర స్వయం సహాయక సంఘం నుంచి మరో రూ.10 వేలు తీసుకున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దిగుబడి రాకుండా పోయింది. దీంతో అప్పుల తీర్చే మార్గం లేక దిగాలు చెందాడు. ఈక్రమంలోనే శుక్రవారం రాత్రి చేనుకు వెళ్లిన ఆయన అక్కడే పురుగుల మందు తాగాడు. తదుపరి ఇంటికి చేరుకున్న అతన్ని కుటుంబసభ్యులు గమనించి వెంటనే రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.రవిప్రసాద్ తెలిపారు.