బాసరలో వసంత పంచమి వేడుకలు | Vasanta Panchami celebrations at Basara Gnana Saraswati Temple | Sakshi
Sakshi News home page

బాసరలో వసంత పంచమి వేడుకలు

Published Tue, Feb 4 2014 10:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

Vasanta Panchami  celebrations at Basara Gnana Saraswati Temple

ఆదిలాబాద్ : చదువుల తల్లి సరస్వతి అమ్మవారి జన్మదిన వసంత పంచమి వేడుకలు బాసర పుణ్య క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. ఏటా మాఘుశుద్ధ పంచమిని అమ్మవారి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. వసంత పంచమి సందర్భంగా బాసర భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి  అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

చదువుల తల్లి జన్మదినం సందర్భంగా  ఆ సన్నిధిలో అక్షరభ్యాసం  చేయిస్తే తమ చిన్నారులు విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈక్రమంలోనే వందలాది మంది చిన్నారులకు అక్షరాభాస్య పూజలు జరుగుతాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.

తొలి రోజున అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అక్షరాభ్యాసం పూజలు ప్రారంభించారు. ఉత్సవం సందర్భంగా  తెల్లవారుజామున రెండు గంటలకు మంగళ వాయిద్యసేవ, సుప్రభాత సేవలతో ప్రారంభమైంది. రెండున్నర గంటల నుంచి అమ్మవారికి మహేభిషేకం, అలంకరణ, నివేదన నిర్వహించారు. అనంతరం అక్షరాభ్యాస, కుంకుమార్చన పూజలు ప్రారంభమయ్యాయి.

మరోవైపు బెజవాడ ఇంద్రకీలాద్రిపై విజయీభవ కార్యక్రమం నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతీ అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి ప్రసాదంగా ఫొటో, పెన్ను, రక్షాబంధన్ అందచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement