vasantha panchami
-
జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు
-
వైభవంగా వసంత పంచమి వేడుకల ఫొటోలు
-
బాసర ఆలయంలో ఘనంగా వసంత పంచమి
-
‘సరస్వతి’ అంటే.. తనను తాను తెలుసుకునే శక్తి
పరమాత్మ తత్వాన్ని గ్రహించటానికి పరమాత్మ ఙ్ఞానం అవసరం. ఙ్ఞాన సముపార్జనకు మానసిక ఏకాగ్రత ముఖ్యం. మానసిక ఏకాగ్రతకు ధ్యానం ప్రధానం. ధ్యానానికి విద్య మూలం. విద్య అంతర్ముఖ, బహిర్ముఖ ఉద్ధీపన కలుగచేస్తుంది. సక కళలకు, విద్యకు అధిదేవత శ్రీసరస్వతీదేవి. సరస్వతీ కటాక్షం లేకుండా ఎటువంటి ఙ్ఞానసముపార్జన జరుగదు. ఙ్ఞానసముపార్జన లేని జీవితం వ్యర్థమౌతుంది. సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. ఆమె వీణ ధరించి, పుస్తకం చేబూని, హంసవాహనంపై ధవళ వస్త్రాలంకరణలో, నిర్మలంగా, ప్రశాంతంగా దర్శనమిస్తుంది. ‘హంస’ను పరబ్రహ్మంగా కీర్తిస్తారు. పదకవితా పితామహుడైన అన్నమాచార్యుడు శ్రీవేంకటేశ్వరుని హంసగా అభివర్ణిస్తాడు. ‘‘దిబ్బలు వెట్టుచు దేలినదిదివో ఉబ్బునీటిపై నొక హంసా...’’ ‘‘పాలు నీరు నేర్పరచి పాలలో నోలాడె నిదె వొకహంసా...’’అంటూ సంకీర్తన ఆలపించాడు. హంసకు పాల నుండి నీటిని వేరుపరచే అద్భుతమైన శక్తివుంది. అంటే మంచిని గ్రహించి, చెడును విస్మరించటం అని దీని అర్థం. ‘సరస్వతి’ అనే పదం ‘తనను తాను తెలుసుకునే శక్తి’ అని కూడా చెప్పవచ్చును. ఈ శక్తి ఙ్ఞానులకు మాత్రమే సాధ్యం. అటువంటి ఙ్ఞానానికి, సర్వ కళలకు అధిదేవతైన శ్రీసరస్వతీదేవి మాఘ శుద్ధ పంచమినాడు జన్మించినట్లుగా చెబుతారు. మాఘమాసం శిశిరఋతువులో వచ్చినప్పటికి, వసంతఋతువుకు స్వాగత సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజును శ్రీపంచమిగాను, మదనపంచమిగాను, వసంతపంచమిగాను కూడా జరుపుకుంటారు. సరస్వతీదేవిని బ్రహ్మే తనకు తోడుగా ఉండటానికి సృజించాడని విష్ణుపురాణంలోను, దుర్గామాత సృజించిందని దేవీభాగవతంలోను కనబడుతుంది. ఏది ఏమైనా సరస్వతిదేవి చదువుకు, ఙ్ఞానానికి అధిష్టానదేవత. అందువలన ఆ దేవి సకల చరాచర బ్రహ్మాండంలో పూజలందుకుంటోంది. వసంతపంచమి రోజున వయోభేదం లేకుండా అందరూ సరస్వతీ పూజలు చేస్తారు. ముఖ్యంగా పిల్లలచేత పూజలు నిర్వహిస్తారు. దీనివలన వారికి మంచి విద్యాబుద్ధులు అలవడతాయని నమ్మిక. ఉదయాన్నే కాలకత్యాలునెరవేర్చుకుని, అభ్యంగన స్నాన మాచరించి, మంచి దుస్తులు ధరించాలి. ఇంటిని మామిడి ఆకులతో, పుష్పాలతో అలంకరించాలి. పూజాగృహాన్ని కూడా శోభస్కరంగా అలంకరించాలి. సరస్వతీదేవిని ఉచితాసనంపై ప్రతిష్టించి, సుగంధ ద్రవ్యంతో అభిషేకించి, చక్కని వస్త్రాలంకృతిని చేసి, తాజా పుష్పాలతోను, మంచి గంధంతోను, ధూప దీపాలతోనూ షోడశోపచారాలతో పూజ నిర్వహించాలి. పూజలో పిల్లల పుస్తకాలు, కలం మొదలగువాటిని ఉంచి పూజచేయాలి. తరువాత ఆమెకు ప్రీతిపాత్రమైన మధుర పదార్థాలను నివేదన చేసి, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించాలి. సకల విద్యలు అలవడటానికి భక్తిశ్రద్ధలతో ప్రార్థన చేయాలి. ఇదేరోజున పిల్లల చేత అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. తోటి పిల్లలకు పలకలు, పెన్సిళ్ళు పంచిపెడతారు. ఈ విధివిధానం వలన సరస్వతీదేవి కరుణించి చల్లని చూపులతో అనుగ్రహిస్తుంది. మనదేశంలో అనేక ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రాలున్నాయి. అదిలాబాద్ జిల్లాలోని బాసరలో ఙ్ఞానసరస్వతీ ఆలయం, కాశ్మీరులోని శారదాదేవి ఆలయం, నల్గొండ జిల్లాలోని అడ్లూరి గ్రామంలోని సరస్వతీ ఆలయం, కర్ణాటకలోని శృంగేరిలో శ్రీ శంకరాచార్య ప్రతిష్టిత శారదా దేవీ ఆలయం మొదలైనవి ప్రధానమైనవి గా పేర్కొన వచ్చును. అశేష భక్తజనం ఈ ఆలయాలు దర్శించి, తమ తమ కోర్కెలు ఈడేర్చుకొంటున్నారు. ఈ రోజును మదన పంచమిగా రతీమన్మధులను పూజిస్తారు. దీనివలన దంపతుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయని నమ్మిక. దేవీనవరాత్రులలో దుర్గామాత సరస్వతీ అలంకారంలో దర్శనమిస్తుంది. సరస్వతీదేవికి శారదాదేవి, హంసవాహిని, బుద్ధిధాత్రి, వరదాయని, కౌమారి మొదలగు పేర్లున్నాయి. సరస్వతీ పురాణంలో దక్షిణామూర్తి, బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు, శ్రీరాముడు, గణపతి, కుమారస్వామి, వాల్మీకి, వ్యాసుడు, ఇంద్రుడు, సూర్యుడు, శంకరాచార్యుడు మొదలైనవారు స్తుతించిన స్తోత్రాలు కనబడతాయి. సరస్వతీదేవి కరుణతో విశేష ఙ్ఞానం, వాక్శుద్ధి, మంత్రసిద్ధి, ఙ్ఞానసిద్ధి, ధారణాసిద్ధి, మేధాసిద్ధి కలిగి సర్వత్రా జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ప్రార్థన చేద్దాం. – డా.దేవులపల్లి పద్మజ -
దుర్గమాతను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: సరస్వతి మాత వసంత పంచమి సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విద్యార్థులకు కంకణం, పెన్నులు, ప్రసాదం అందజేశారు. నేడు(గురువారం) అమ్మవారి జన్మనక్షత్రం కావండంతో ఇంద్రకీలాద్రీ దుర్గామాత సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి దుర్గమాతను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరికి జ్ఞానం కలగాలని, మంచి జరగాలని సరస్వతి యాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా అమ్మవారి దర్శనార్థం స్థానిక పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు దుర్గగుడికి తరలివచ్చారు. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకున్నారు. అందరికిఅమ్మవారి ఆశీస్సులు అందేలా ఏర్పాట్లు చేశామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మఒడి పథకం ద్వారా రూ. 15వేలు ప్రతి విద్యార్థికి అందిస్తున్నామన్నారు. మధ్యాహ్నం భోజన పథకంలో నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. -
అక్షరాలకు ఆది.. అమ్మ సన్నిధి
ఆధ్యాత్మికతల నెలవు.. వేద పారాయణాల నిలయం.. అన్నార్తుల ఆకలి తీర్చే అన్నదాన క్షేత్రం.. వేలాది చిన్నారులకు జ్ఞాన వికాసం పంచుతున్న అక్షరాభ్యాస కేంద్రం.. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం మహిమాన్విత క్షేత్రం సిద్దిపేట జిల్లా వర్గల్ శంభుని కొండపై కొలువు దీరిన శ్రీవిద్యా సరస్వతీ దేవి సన్నిధానం. ఈ నెల 30న గురువారం వసంత పంచమి మహోత్సవ సంబరాలకు ముస్తాబైంది. సకల విద్యలకు మూలమైన శ్రీసరస్వతి మాత ఆవిర్భవించిన రోజు వసంతపంచమి (శ్రీపంచమి) మహోత్సవం సందర్భంగా వర్గల్ క్షేత్రం విశేషాల ప్రత్యేక కథనం. సాక్షి, వర్గల్(గజ్వేల్): వసంత పంచమి మహోత్సవం కోసం ముస్తాబైన వర్గల్ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రం విద్యుత్ దివ్వెల వరుసలతో కాంతులీనుతున్నది. గురువారం పర్వదినం పురస్కరించుకుని క్షేత్రాన్ని విద్యుత్ దీపాల వరుసలతో తీర్చిదిద్దారు. అక్షరాభ్యాస మండపం వద్ద విద్యుత్ దీపాలను అమ్మవారి వివిధ అలంకారాల రూపంలో అమర్చారు. క్షేత్రాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉత్సవ శోభను నింపారు. సకల దేవతలు సంచరించిన పుణ్యస్థలం.. మహాత్ములు నడయాడిన ప్రదేశం, మునులు, తపోధనులు తపమాచరించిన మహిమాన్విత ప్రాంతం..సప్త స్వరాల గుండు పక్కన.. స్వయంభువుగా మహదేవుడు వెలసిన శంభుని కొండ శ్రీవిద్యా సరస్వతి ఆలయానికి నెలవైంది. ప్రముఖ పంచాంగకర్త యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి సంకల్పం, సత్యపథం సేవాసమితి సహకారంతో 1989లో వసంత పంచమి రోజున ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. 1992లో పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యా నృసింహ్మ భారతీ స్వామి వారు ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నాటి నుంచి తేజోమయమైన అమ్మవారు తన చెంత చేరిన భక్తులను కటాక్షిస్తూ. చిన్నారులకు అక్షర జ్ఞానకాంతులు పంచుతూ, భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విలసిల్లుతున్నది. విశేష భక్త జనాధరణతో రెండో బాసరగా వినుతికెక్కింది. అరుదైన శనీశ్వరాలయం... వర్గల్ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రం అనేక ఆలయాల సంగమం. నవగ్రహాల్లో అతి కీలకంగా పరిగణించే శనీశ్వరుని ఆలయాలు దేశంలోనే అరుదు. తెలంగాణ ప్రాంత భక్తులకు చేరువగా వర్గల్ అమ్మవారి ఆలయం దిగువన శనీశ్వరాలయం నిర్మితమైంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయం.. అమ్మవారి సన్నిధానం ఎడమ వైపు కొండపైన శ్రీలక్ష్మీ గణపతి ఆలయం నిర్మితమైంది. 2001లో కంచి కామకోటి పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతి స్వామివారు ఈ ఆలయంలో శ్రీలక్ష్మీగణపతి విగ్రహం ప్రతిష్ఠించారు. ఇక్కడి శంభులింగేశ్వరుడి విగ్రహం స్వయంభూగా ప్రసిద్ధి. ఈ పురాతన ఆలయంలో 700 ఏళ్ల క్రితం నుంచే పూజలు జరిగినట్లు చరిత్ర చెబుతున్నది. ఉత్సవాల తోరణం.. వర్గల్ క్షేత్రం నిత్య ఉత్సవాల తోరణం. ప్రతి నిత్యం అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు, కుంకుమార్చనలు కొనసాగుతాయి. ప్రతినెల అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున విశేష అర్చనలు, చండీ హోమం నేత్రపర్వంగా జరుగుతాయి. ప్రతి మాఘ శుద్ధ త్రయోదశి రోజున దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, చండీ హోమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆశ్వియుజ మాసంలో అమ్మవారి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వసంతపంచమి మహోత్సవం శ్రీవిద్యా సరస్వతి అమ్మవారి సన్నిధిలో మాఘ మాసంలో వసంత పంచమి మహోత్సవం జరుగుతుంది. మాఘ శుద్ధ పంచమి రోజున వసంత పంచమి (శ్రీపంచమి) సందర్భంగా విశేష పంచామృతాభిషేకం, చండీ హోమం, లక్ష పుష్పార్చన, 56 రకముల భోగాలతో నివేదన, విద్యా జ్యోతి దర్శనం తదితర కార్యక్రమాలు నేత్రపర్వం చేస్తాయి. అమ్మవారు వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణకిరీటంతో భక్తులను కటాక్షిస్తారు. ఈ విశేషోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. చిన్నారులకు పెద్ద సంఖ్యలో అక్షరాభ్యాసాలు జరుగుతాయి. వేద పాఠశాల వేదవిద్య పరిరక్షణ, సనాతన వారసత్వ సంపదలైన వేదాలను భావి తరాలకు అందించాలనే çసంకల్పంతో అమ్మవారి సన్నిధిలో 1999 లో పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యా నృసింహ భారతి స్వామివారు శ్రీ శారదా వైదిక స్మార్త విద్యాలయాన్ని ప్రారంభించారు. ఉపనయం జరిగిన 8 నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు గల బ్రాహ్మణ పిల్లలకు ఇక్కడ పంచదశకర్మలు నేర్పుతారు. నిత్యాన్నదానం.. ప్రతి భక్తునికి అమ్మవారి మహా ప్రసాదం అందించాలనే సంకల్పంతో 2001లో అన్నదాన సత్రాన్ని ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం 8,00,000 మంది భక్తులకు ఇక్కడ అన్నదానం జరుగుతున్నది. టవర్ లిఫ్ట్.. ఎత్తైన కొండ మీద కొలువుదీరిన శ్రీసరస్వతీ మాతను దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో చేరుకోలేని వికలాంగులు, వయో వృద్ధులు, అనారోగ్య పీడితులకు ఉపయుక్తంగా టవర్ లిఫ్ట్ ఏర్పాటు చేసారు. లిఫ్ట్ నుంచి ఆలయ గర్భగుడి వరకు చేరేందుకు వీల్ ఛైర్లు సమకూర్చారు. భక్తులు బస చేసేందుకు సత్రాలు క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికులు బసచేసేందుకు సత్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా కల్యాణ మండపం, శారదీయమ్, తదితర అనేక విశాలమైన భవనాలు వందలాది యాత్రికులు బస చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. తాగునీటి వసతితోపాటు, మరుగుదొడ్లు, మూత్ర శాలలు ఉన్నాయి. వాహనాల పార్కింగ్‌కు సదుపాయం ఉన్నది. ఆకట్టుకునే వీణాపాణి విగ్రహం.. కొండ మీద భక్తులు వెళ్లే మెట్ల మార్గం పక్కన ఎత్తైన వీణాపాణి విగ్రహం టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రధాన ద్వారం ముందర వాటర్ ఫౌంటేన్, స్వాగత మహా కలశం ఆకట్టుకుంటాయి. ఆహ్లాదం పంచే చిల్డ్రన్ పార్క్ శ్రీసరస్వతి క్షేత్రానికి వచ్చిన భక్తులు, చిన్నారులు సేద తీరేందుకు పర్యాటక శాఖ చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసింది. కార్పెట్ గ్రాస్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, చిన్నారుల ఉయ్యాలలు, ఇతర ఆటల సామాగ్రితో ఆహ్లాదకరంగా ఈ పార్క్‌ను తీర్చిదిద్దారు. అక్షర స్వీకరాల కోసం మహామండపం చదువుల తల్లి సన్నిధిలో వేలాదిగా చిన్నారుల అక్షర స్వీకారాలు జరుగుతాయి. ప్రత్యేకంగా విశేష పర్వదినాల్లో, సెలవు రోజులలో రద్దీ మరింత పెరుగుతుంది. ఈ రద్దీని తట్టుకునేందుకు భక్తులకు సౌకర్యవంతంగా భక్తజన సహకారంతో మూడంతస్తుల మహామండపం నిర్మాణం చేపట్టారు. దాదాపు రూ. 4 కోట్ల పైచిలుకు వ్యయంతో కొనసాగుతున్న ఈ నిర్మాణం ఇప్పటికే 60 శాతం మేర పూర్తయింది. వసంత పంచమి సందర్భంగా అందులోనే అక్షరాభ్యాసం, లక్షపుష్పార్చనాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇలా చేరుకోవాలి.. వర్గల్ క్షేత్రానికి ఆర్టీసీ సౌకర్యాలు ఉన్నాయి. సికిందరాబాద్ గురుద్వార్ నుంచి ఉదయం 8.15 గంటలకు, 10 గంటలకు, మద్యాహ్నం 12.15 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు బస్సులు వర్గల్ క్షేత్రానికి వచ్చి వెళతాయి. ఇవే కాకుండా సికిందరాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్ రూట్లో వెళ్లే ఆర్టీసీ బస్సులలో వర్గల్ క్రాస్‌రోడ్డు వరకు వచ్చి, అక్కడి నుంచి ఆటోలలో క్షేత్రానికి చేరుకోవచ్చు. -
జోగుళాంబ అమ్మవారి నిజరూప దర్శనం
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగుళాంబ అమ్మవారు వసంత పంచమిని పురస్కరించుకుని ఆదివారం నిజరూప దర్శనమిచ్చారు. ఆలయంలో సహస్ర ఘటాలకు పూజలు చేసిన భక్తులు వాటిని శిరస్సున ధరించి అమ్మవారిని అభిషేకించారు. వందమందికి పైగా కాళాకారులు వివిధ రకాల దేవతామూర్తుల వేషధారణలతో అమ్మవారి నమూనా విగ్రహాన్ని ఊరేగిస్తూ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహిళా భక్తులు ఏకరూప వస్త్రధారణతో కలశాలు శిరస్సున ధరించి భక్తిని చాటుకున్నారు. 5 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో చండీ హోమాలకు పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి మూల విరాట్‌ను పంచామతాలతో అభిషేకించారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, మాజీ మంత్రి డీకే.అరుణ, సికింద్రాబాద్ కోర్టు జడ్జి సునీత, అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి ఏ.రాధిక తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. -
మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు!
-
ఘనంగా వసంత పంచమి
బెల్లంపల్లి : వసంత పంచమిని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో సోమవారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాల ఆవరణలోని సరస్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తల్లిదండ్రులు చిన్నారులను తీసుకువచ్చి అక్షరాభ్యాసం చేయించారు. వేద పండితులు చిన్నారుల చిట్టి చేతులతో అక్షరాలు దిద్దించారు. భారీగా తరలివచ్చిన చిన్నారులతో శ్రీ సరస్వతీ శిశుమందిర్ సందడిగా మారింది. అనంతరం అక్షరాభ్యాసం చేయించిన తల్లి దండ్రులకు తీర్థ ప్రసాదాలను అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శరణాలయంలో అక్షరాభ్యాసం... తాండూర్ : వసంత పంచమి సందర్భంగా మండల కేంద్రంలోని సేవాజ్యోతి శరణాలయంలో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వనితా క్లబ్ సభ్యులు చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా సంయుక్త కార్యదర్శి మాచుకారి సంతోష్, వనితా క్లబ్ మండల అధ్యక్షురాలు రాచర్ల వాణి, ప్రధాన కార్యదర్శి బోనగిరి కవిత, కోశాధికారి పుల్లూరి రమ్య, శరణాలయం వ్యవస్థాపకులు గజ్జెల్లి శ్రీదేవి, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. -
సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు
విజయవాడ : చదువుల తల్లి శ్రీ సరస్వతి మాత పుట్టిన రోజు అయిన వసంత పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారు మహాసరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహామండపంలోని యాగశాలలో ఆలయ అధికారులు ఉదయం 8 గంటలకు సరస్వతీ హోమాన్ని నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలి వస్తుండటంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. చిన్నారులకు అక్షరాభ్యాసాలు కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షిస్తూ ఆలయ అర్చకులు అమ్మవారి చెంత పూజలు చేసిన శక్తి కంకణాలను, పెన్నులను విద్యార్థులకు అందజేస్తున్నారు. అంతరాలయం, మహామండపం 6వ అంతస్తుల్లోని ఉత్సవమూర్తిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. బాసర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో వసంతి పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే అమ్మవారికి మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, మహాహారతి చేపట్టారు. ఇవాళ అమ్మవారికి చండీహవనం, వేదపారాయణం, మహాపూజ కార్యక్రమాలతో పాటు సాయంత్రం అమ్మవారిని పల్లకిలో ఊరేగిస్తారు. తెల్లవారుజామునుంచే భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించేందుకు ఆలయానికి వచ్చారు. అమ్మవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. హైదరాబాద్ : నల్లకుంటలోని శంకరమఠం, శ్రీ సీతారామాంజనేయ సరస్వతి ఆలయంలో బుధవారం ఉదయం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శంకరమఠంలో శారదాంబ అమ్మవారు జ్ఞాన సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. న్యూనల్లకుంటలోని శ్రీసీతారామాంజనేయ సరస్వతి ఆలయంలో 108 కలశాల ఆవుపాలతో జ్ఞాన సరస్వతి అమ్మవారికి విశేష అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. విజయనగరం : విజయనగరం రింగు రోడ్డులో గల జ్ఞాన సరస్వతి ఆలయంలో శ్రీ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు. -
బాసరలో వసంత పంచమి వేడుకలు
ఆదిలాబాద్ : చదువుల తల్లి సరస్వతి అమ్మవారి జన్మదిన వసంత పంచమి వేడుకలు బాసర పుణ్య క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. ఏటా మాఘుశుద్ధ పంచమిని అమ్మవారి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. వసంత పంచమి సందర్భంగా బాసర భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. చదువుల తల్లి జన్మదినం సందర్భంగా ఆ సన్నిధిలో అక్షరభ్యాసం చేయిస్తే తమ చిన్నారులు విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈక్రమంలోనే వందలాది మంది చిన్నారులకు అక్షరాభాస్య పూజలు జరుగుతాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తొలి రోజున అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అక్షరాభ్యాసం పూజలు ప్రారంభించారు. ఉత్సవం సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటలకు మంగళ వాయిద్యసేవ, సుప్రభాత సేవలతో ప్రారంభమైంది. రెండున్నర గంటల నుంచి అమ్మవారికి మహేభిషేకం, అలంకరణ, నివేదన నిర్వహించారు. అనంతరం అక్షరాభ్యాస, కుంకుమార్చన పూజలు ప్రారంభమయ్యాయి. మరోవైపు బెజవాడ ఇంద్రకీలాద్రిపై విజయీభవ కార్యక్రమం నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతీ అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి ప్రసాదంగా ఫొటో, పెన్ను, రక్షాబంధన్ అందచేస్తున్నారు.