Indra kiladri
-
విజయవాడ : దసరా ఉత్సవాలకు ముస్తాబు అవుతున్న దుర్గ గుడి
-
నేడు తెప్పోత్సవం
ఉదయమంతా భక్తితన్మయత్వం.. సాయంత్రం సాంస్కృతిక వైభోగం.. వెరసి ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లింది. వేల సంఖ్యలో తరలివచ్చిన భవానీలతో కొండ సిందూర శోభిమైంది. జగన్మాత కనకదుర్గమ్మ తొమ్మిదో రోజు సోమవారం మహిషాసురమర్దనిగా దర్శనమిచ్చారు. శక్తిస్వరూపిణిని దర్శించుకుని భక్తకోటి తరించింది. మరోవైపు విజయదశమినాడు ఆది దంపతుల జలవిహారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం కృష్ణమ్మ ఒడిలో నిర్వహించిన తెప్పోత్సవం ట్రయల్ రన్ విజయవంతమైంది. సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరాయి. పదో రోజు మంగళవారం మధ్యాహ్నం దేవస్థానం అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్ణాహుతిని నిర్వహించి దసరా ఉత్సవాలను ముగిస్తారు. 9వ రోజు నవమి నాడు అమ్మవారు ఉగ్రరూపమైన శ్రీ మహిషాసురమర్దనీదేవిగా దర్శనమిచ్చారు. ఇక ఆఖరి రోజు దశమి నాడు శాంతస్వరూపిణి శ్రీరాజరాజేశ్వరీదేవిగా కొలువుదీరుతారు. జలవిహారానికి ఏర్పాట్లు పూర్తి.. గత పక్షం రోజులుగా వరద ఉధృతితో పోటెత్తిన కృష్ణమ్మ ప్రస్తుతం శాంతించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లు మూసివేశారు. దీంతో తెప్పోత్సవానికి అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. మంగళవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ గంగా పార్వతీసమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్లు నదీ విహారం చేయనున్నారు. ఈ మేరకు దేవదాయ, జలవనరులు, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు మధ్య తెప్పోత్సవం నిర్వహిస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ప్రకటించారు. కాగా సోమవారం సాయంత్రం తెప్పోత్సవం ట్రయిల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి.. భవానీభక్తులు రాకతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. దీక్షలు తీసుకున్న భక్తులు అమ్మవారి సన్నిధి చేరుకుని హోమ గుండాల్లో పూజాద్రవ్యాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుంటారు. కృష్ణవేణి ఘాట్ భవానీభక్తులతో నిండిపోయింది. కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించిన భక్తులు కృష్ణవేణి ఘాట్‌లో జల్లు స్నానాలు చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాల నుంచి భవానీమాలలు ధరించిన భక్తులు లారీల్లో తరలివస్తున్నారు. బుధ, గురువారంల్లోనూ రద్దీ.. సోమ, మంగళవారాల్లోనే కాకుండా తర్వాత మరో రెండు రోజులు భవానీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. అందువల్ల బుధ, గురువారాల్లోనూ దీక్షల విరమణకు కావాల్సిన ఏర్పాట్లు అధికారులు కొనసాగిస్తున్నారు. అమ్మవారి దర్శనభాగ్యం దక్కేనా! తాడేపల్లి రూరల్ : దేవీ నవరాత్రులు చివరి రోజు అమ్మవారి తెప్పోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరిస్తారు. కానీ గత ఐదేళ్లుగా పక్కనే ఉన్న గుంటూరు జిల్లా వాసులకు మాత్రం కృష్ణమ్మ ఒడిలో హంస వాహనంపై అమ్మవారి దర్శనభాగ్యం కలగడం లేదు. 2014 ముందు దుర్గా ఘాట్ వద్ద ప్రారంభమయ్యే తెప్పోత్సవం గుంటూరు జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ 10 కానా వద్దకు వచ్చి తిరిగి మరలా దుర్గా ఘాట్‌కు వెళ్తుంది. ఈ క్రమంలో మూడుసార్లు భక్తుల దర్శనార్థం కృష్ణానదిలో తెప్పోత్సవం కొనసాగుతోంది. తర్వాతి కాలంలో కృష్ణానదిలో నీటి మట్టం తగ్గడం, మధ్యలో ఒక సంవత్సరం వరదలు రావడంతో గుంటూరు జిల్లా వైపు తెప్పోత్సవ కార్యక్రమాన్ని దేవదాయ శాఖాధికారులు నిలిపివేశారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణానదిలో పూర్తిస్థాయిలో నీటి మట్టం ఉండటంతో గుంటూరు జిల్లా వాసులు ప్రకాశం బ్యారేజీ 10వ కానా వరకు అమ్మవారు తెప్పోత్సవం నిర్వహించాలని కోరుతున్నారు. ప్రకాశం బ్యారేజీపై నుంచి లక్షల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వేచి చూస్తారు. ఈసారైనా తెప్పోత్సవాన్ని చేసే అవకాశం జిల్లా వాసులకు దక్కుతుందో లేదో చూడాలి. -
కనకదుర్గమ్మ దుర్గ గుడిలో వైఎస్ జగన్ పూజలు
-
వైఎస్ జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దుర్గ గుడి ఈవో, ఆర్చకులు
-
దుర్గమ్మ సన్నిధిలో వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: కొలిచెడి వారికి కొంగు బంగారంగా భావించే బెజవాడ కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో కోటేశ్వరమ్మతో పాటు వేదపండితులు జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయనతో పాటు పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పొట్లూరి వరప్రసాద్ తదితరులు ఉన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం జగన్ గవర్నర్‌ను కలిశారు. ఆ తర్వాత తాడేపల్లి బయల్దేరి వెళ్లారు. గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడ గేట్ వే హోటల్లో ఉన్న గవర్నర్‌ను ఇవాళ సాయంత్రం కలిశారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్ అనంతరం కడప పెద్దదర్గాలో, సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి మహానేత ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడ నుంచి నేరుగా బెజవాడ దుర్గగుడికి చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కనకదుర్గమ్మ దుర్గ గుడిలో వైఎస్ జగన్ పూజలు -
తరిగిపోతున్న దుర్గమ్మ మూలధనం!
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో రెండో పెద్ద దేవాలయమైన కనకదుర్గమ్మ దేవస్థానం నిధులు నానాటికీ కరిగిపోతున్నాయి. కొండలా పెరగాల్సిన నిధులు..ప్రవాహంలా కొట్టుకుపోతున్నాయి. అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకల్ని అధికారులు పప్పుబెల్లాల్లా ఖర్చు చేయడం.. అందుకు సంబంధించి ప్రభుత్వం ఒక్కపైసా విదల్చకపోవడమే దీనికి కారణమని విమర్శలొస్తున్నాయి. రూ.215 కోట్ల నుంచి రూ.92 కోట్లకు.. ఐదేళ్ల క్రితం దుర్గమ్మకు రూ.215 కోట్ల డిపాజిట్లు ఉండేవి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు చంద్రశేఖర్ ఆజాద్ కార్యనిర్వహణాధికారి(ఈవో)గా ఉన్నప్పుడు దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇంద్రకీలాద్రిపై దేవాలయాలు తప్ప మిగిలిన భవనాలను కూల్చివేశారు. లక్షలు విలువ చేసే భవానీమండపం, అడ్మినిస్ట్రేటివ్ భవనం, అన్నప్రసాద భవనం, ప్రసాదాల తయారీ భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాలు కూల్చిన ప్రదేశంలో గ్రీనరీ పెంచుతామన్నారే తప్ప కార్యరూపం దాల్చలేదు. కాగా అదే సమయంలో అర్జున వీధిలో భూమి సేకరణ ప్రారంభించారు. సుమారు రూ.42 కోట్లు ఖర్చు చేసి భూమి సేకరించారు. అంతేకాకుండా రూ.10 కోట్లు ఖర్చు చేసి సీవీరెడ్డి చారిటీస్ స్థలంలో భక్తులకు తాత్కాలిక కాటేజ్‌లు నిర్మించారు. ఇక రోడ్ల నిర్మాణాలకు, హంగు, ఆర్భాటాలకు నిధులు మంచినీళ్లలా ఖర్చు చేశారు. దీంతో దేవస్థానం నిధులు తరిగిపోయి ప్రస్తుతం రూ.92 కోట్లకు చేరాయని దేవస్థానం అధికారులే చెబుతున్నారు. వచ్చే ఆదాయమంతా ఖర్చులకే.. దుర్గగుడికి హుండీలు, ఆర్జిత సేవలు, కానుకల ద్వారా ప్రతి నెలా రూ.9 కోట్ల ఆదాయం వస్తుంది. ఇందులో రూ.8 కోట్ల వరకు ఖర్చులయిపోతున్నాయి. ఇందులో సిబ్బంది జీతాలు రూ.3 కోట్లు పోగా, మిగిలిన వ్యయం నిర్వహణ ఖర్చులు. పవిత్ర సంగమం వద్ద జరిగే కృష్ణమ్మ హారతులకు ప్రతి నెలా రూ.5 లక్షలు చెల్లిస్తున్నారు. దత్తత దేవాలయల నుంచి ఆదాయం రాకపోయినా.. ప్రతి నెలా వాటి నిర్వహణకు రూ.లక్ష చెల్లిస్తున్నారు. ఇక రాజధానిలో ప్రభుత్వం నిర్వహించే పూజా కార్యక్రమాల వ్యయాన్ని దుర్గమ్మ ఖాతాలోనే వేస్తూ ఉండటంతో వ్యయం నానాటికీ పెరిగిపోతోంది. కొత్త నిర్మాణాలకు నిధులు నిల్.. భక్తుల కోసం గొల్లపూడిలో ఐదు అంతస్తుల భవనం నిర్మించాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. అలాగే అన్నదానం భవనం నిర్మించాల్సి ఉంది. అయితే మూలధనం తరిగిపోతూ ఉండటంతో ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టారు. దాతలు సహకరిస్తేనే వీటిని నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. భక్తుల అవసరాలకు కాకుండా ప్రభుత్వ పెద్దల అవసరాల కోసం ఖర్చు చేయడంపై భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దసరా ఉత్సవాలకు రూ.8 కోట్ల వ్యయం.. దసరా ఉత్సవాలకు సుమారు రూ.8 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇందులో సుమారు రూ.5 కోట్లు ఇతరశాఖల సిబ్బంది సేవలు వినియోగించుకున్నందుకు చెల్లిస్తున్నారు. దసరా ఉత్సవాలను రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నందున అన్ని శాఖలు ఉచితంగా సేవలు అందించాలి. ఉత్సవాలకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.అయితే ఈ భారమంతా దేవస్థానంపైనే వేస్తున్నారు. గత మూడేళ్లలో రూ.10 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలని దేవస్థానం లెక్కలు చెబుతున్నాయి. అయినా ప్రభుత్వం ఇంతవరకు ఒక్క పైసా విదల్చ లేదు. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల ఆందోళన
-
ఇంద్రకీలాద్రిపై భక్తుల ఆందోళన
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చిన భక్తులకు ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. ఎంతకూ అమ్మవారి దర్శనం లభించకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయ అధికారులు వీఐపీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, దుర్గమ్మ దర్శనానికి తమను అనుమతించడం లేదని భక్తులు మండిపడుతున్నారు. రూ. 3వేలు పెట్టి టికెట్ కొనుకున్నా.. దర్శనం కోసం బారులు తీరడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంకుమపూజ కోసం భక్తులు మండుటెండలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా అందుబాటులోకి లేకపోవడంతో ఆలయ ఈవోను నిలదీశారు. దీంతో భక్తులకు సమాధానం చెప్పకుండానే ఈవో సూర్యకుమారి వెళ్లిపోయారు. శరన్నవరాత్రి వేడుకలు ఇంద్రకిలాద్రిపై వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మవారు ఆదివారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దుర్గమ్మ దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. -
భక్తులపై ప్రైవేట్ సెక్యూరిటీ అత్యుత్సాహం
విజయవాడ: దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవస్థాన ప్రైవేట్ సెక్యూరిటీ భద్రత కట్టుదిట్టం చేసింది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది భక్తులపై అత్యుత్సాహం ప్రదర్శించింది. అమ్మవారి గర్భగుడి దగ్గర దర్శనం చేసుకుంటున్న భక్తులను ఒక్కసారిగా సిబ్బంది బయటకు తోసివేశారు. దాంతో దర్శనానికి వచ్చిన భక్తులంతా ప్రైవేట్ సెక్యూరిటీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దుర్గగుడిపై కొనసాగుతున్న రద్దీ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : దుర్గగుడిలో అమ్మవారి దర్శనానికి బుధవారం భక్తుల రద్దీ నెలకుంది. పుష్కరాలలో ఆరో రోజైన బుధవారం 1.30 లక్షల మంది పుష్కర యాత్రికులు అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ నరసింహన్‌తోపాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ, మంత్రులు శిద్దా రాఘవరావు, ప్రత్తిపాటి పుల్లారావు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు పుష్కర యాత్రికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అమ్మవారి దర్శనానికి ఉచిత క్యూలైన్లతోపాటు శీఘ్రదర్శనం, వీఐపీ దర్శనాలకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో అలంకరించారు. 6వ రోజు ఆదాయం రూ.18. 24లక్షలు పుష్కరాలను పురష్కరించుకుని అమ్మవారి దేవస్థానానికి ఆరో రోజు రూ. 18.24 లక్షల ఆదాయం సమకూరింది. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.14 లక్షలు, మూడు వందల టికెట్ల విక్రయం ద్వారా రూ. 2.10 లక్షలు, రూ.5 వందల టికెట్ల విక్రయం ద్వారా రూ. 57,500, భవానీ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 1.20 లక్షల మేర ఆదాయం సమకూరింది. కేశకండన టికెట్ల విక్రయం ద్వారా రూ. 34,500 ఆదాయం సమకూరింది. -
ఇంద్రకీలాద్రికి పుష్కరశోభ
రెండో రోజు పెరిగిన రద్దీ 60 వేల మందికి అమ్మవారి దర్శనం విజయవాడ(ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై పుష్కర శోభ వెల్లివిరిసింది. కృష్ణా పుష్కరాల రెండో రోజైన శనివారం పుష్కర స్నానానికి యాత్రికులు తరలివచ్చారు. పుష్కర స్నానం పూర్తి చేసుకున్న తర్వాత క్యూలైన్ మార్గం ద్వారా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఒంటి గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. పుష్కరాలను పురష్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కొనసాగింది. రెండో రోజు శనివారం మొత్తం 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్నాం మహా నివేదన అనంతరం రద్దీ మరింతగా పెరగడంతో అమ్మవారి దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మహా మండపంలోని ప్రసాదాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారి మహా ప్రసాదం లడ్డూతో పాటు భవానీ ప్రసాదాలను భక్తులు విరివిగా కొనుగోలు చేశారు. టోల్గేట్ వద్ద వివాదం... తొలి రోజున సినీ నటుడు బాలకృష్ణను ప్రయివేటు వాహనంపై కొండపైకి అనుమతించడంతో పోలీసు రెవెన్యూ అధికారులపై ఈవో సూర్యకుమారి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆలయ ఈవో వ్యవహారంపై గుర్రుగా ఉన్న ఈ రెండు శాఖల అధికారులు ఉత్సవాలలో తాము ఖఠినంగా వ్యవహరిస్తే ఏలా ఉంటుందో దేవస్థాన అధికారులకు తెలిసేలా చేశారు. పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్‌తో పాటు దుర్గగుడి అధికారుల వాహనాలను కొండపైకి అనుమతించలేదు. దీంతో సూర్యకుమారి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. లిఫ్టు సదుపాయం పోలీసు, వీఐపీలకేనా... మహామండపం వైపు నుంచి కొండపైకి ఎవరిని అనుమతించేది లేదని చెప్పిన ఈవో సూర్యకుమారి మాటలు పట్టించుకోవడం లేదు. పోలీసు సిబ్బందితో పాటు వారి బంధువులు, వీఐపీల పేరిట అనేక మంది లిఫ్టు ద్వారా కొండపైకి చేరుకుంటున్నారు. నమూనా ఆలయంలో కల్యాణోత్సవం సంగమం సమీపంలోని నమూనా ఆలయానికి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లు తరలివెళ్లారు. సంగమం వద్ద ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో శనివారం కల్యాణోత్సవం నిర్వహించారు. రెండో రోజు ఆదాయం రూ.9.06 లక్షలు.. పుష్కరాలలో రెండో రోజు దుర్గగుడికి రూ.9.06 లక్షల ఆదాయం వచ్చింది. రూ.500 వీఐపీ టికెట్ల విక్రయం ద్వారా రూ.2.08 లక్షలు, 60,900 లడ్డూ విక్రయాల ద్వారా రూ.6.09 లక్షలు, భవానీ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 67,350లు, కేశకండన ద్వారా రూ. 20,850ల ఆదాయం సమకూరింది. -
దుర్గగుడిపై రద్దీ అంతంతే
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఒకవైపు పవిత్ర పుష్కరాలు, చెంతనే ఉన్న దుర్గమ్మ దర్శనానికి భక్తజనం పోటెత్తుతుందని అంచనా. అయితే ఆలయ ఉన్నతాధికారుల నిర్వాకం వల్ల వేలమంది భక్తజనం అమ్మవారి దర్శనానికి రాకుండానే వెనుదిరిగారు. తొలిరోజునే భారీ గందరగోళం చోటుచేసుకుంది. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం రద్దీ సాధారణమే. శ్రావణ మాసం రెండో శుక్రవారం, పుష్కర రద్దీ అయినప్పటికీ 50 వేల లోపే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మరో వైపున పుష్కరాలలో 22 గంటలు అమ్మవారి దర్శనం కల్పిస్తామని చెప్పినప్పటికీ అది ఆచరణలో సాధ్య పడలేదు. గురువారం రాత్రి 9 గంటలకే అమ్మవారి దర్శనం నిలిపివేసినప్పటికీ శుక్రవారం తెల్లవారుజామున 1 గంటలకు దర్శనం కల్పించాల్సి ఉండగా , అలంకరణలో ఇబ్బందుల కారణంగా తెల్లవారుజామున 5 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. సర్వ దర్శనంలో క్యూలైన్లోనే భక్తుల తాకిడి కనిపించగా, శీఘ్రదర్శనం, రూ. 5 వందల దర్శనం క్యూలైన్లలో రద్దీ నామమాత్రం. బుద్ధా సొంత వాహనంలో బాలకృష్ణ ఇక వీఐపీలను దేవస్థాన వాహనాలపైనే దుర్గగుడి పైకి తీసుకువచ్చి దర్శనం అయిన తర్వాత అదే వాహనంపై సాగనంపుతామని చెప్పారు. అయితే దీనిని ఉల్లంఘిస్తూ సీఎం చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణను స్థానిక ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన వాహనంపై కొండపైకి తీసుకువెళ్లడంతో టోల్గేట్ వద్ద డ్యూటీలో ఉన్న ఆర్డీఓపై దుర్గగుడి ఈవోసూర్యకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై ప్రతాపం మీడియా ప్రతినిధులకు పాస్‌లు లేవనే కారణంతో పోలీసు అధికారులు వారిని పైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. మీడియాకు దేవస్థానం నుంచి ఎటువంటి డ్యూటీ పాస్‌లు ఇవ్వలేదని చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు.ఈవోకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తొలి రోజు ఆదాయం రూ.8.38 లక్షలు పుష్కరాల తొలి రోజున దుర్గగుడికి ప్రసాదాలు, టికెట్ల విక్రయాల ద్వారా రూ. 8,38,818ల ఆదాయం సమకూరింది. వీఐపీ దర్శనం టికెట్లు కేవలం 96 మాత్రమే విక్రయించారు. ఇక 68,400 లడ్డూలను విక్రయించగా రూ. 6.84 లక్షల ఆదాయం సమకూరింది. భవానీ ప్రసాదం విక్రయాల ద్వారా రూ. 71,850ల ఆదాయం సమకూరింది. -
22 గంటలు దుర్గమ్మ దర్శనం
– అంతరాలయ దర్శనం రద్దు – వీఐపీలకు ప్రత్యేక సమయంలోనే ముఖమండప దర్శనం – భక్తులకే ప్రథమ ప్రాధాన్యం – పర్మినెంట్‌గా టోల్ ఫ్రీ నంబర్ – ఈవో సూర్యకుమారి విజయవాడ (ఇంద్రకీలాద్రి) : పుష్కర యాత్రికుల కోసం దుర్గగుడిని రోజుకు 22 గంటలు తెరిచి ఉంచుతామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. పుష్కరాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై చేసిన ఏర్పాట్ల గురించి బ్రాహ్మణవీధిలోని దుర్గగుడి పరిపాలన భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ వైవీ అనూరాధ, దుర్గగుడి ఈవో సూర్యకుమారి వివరించారు. పుష్కరాలు జరిగే సమయంలో అమ్మవారి దర్శనానికి రోజూ రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశామని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మరుసటిరోజు రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను ఐదు క్యూలైన్లలో అనుమతిస్తామని చెప్పారు. రద్దీలో 90 శాతం ఉచిత దర్శనం ద్వారానే అమ్మవారిని దర్శించుకుంటారని భావిస్తున్నామన్నారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నంబర్ ఇక శాశ్వత ప్రాతిపదకన ఉంటుందని చెప్పారు. అంతరాయల దర్శనం రద్దు చేస్తున్నామని, అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు శఠగోపం(పాదుకలు) పెట్టేది, పండితుల ఆశీర్వాదాలు, ప్రసాదాలు అందజేయడాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైనా ముఖమండప దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. రూ.500 టికెట్ కొనుగోలు చేసిన వారికి శీఘ్రదర్శనం కల్పిస్తామన్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకూ, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే వీఐపీలను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులకు ప్రత్యేకంగా బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. వీఐపీలకు పున్నమి ఘాట్‌తోపాటు ఘాట్‌రోడ్డు నుంచి ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటుచేస్తున్నామని, వాటిలోనే కొండపైకి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. వినాయకుడి గుడి నుంచే క్యూలైన్.. వినాయకుడి గుడి నుంచి ఇంద్రకీలాద్రి పైకి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కుమ్మరిపాలెం వైపు నుంచి మరో క్యూలైన్ ఏర్పాటుచేసి టోల్గేట్ వద్ద కలుపుతారు. దర్శనానంతరం మహామండపం, మల్లేశ్వరాలయం మీదుగా కొండ కిందకు దిగేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మూడు ప్రాంతాల్లో ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశామని, భక్తుల రద్దీని బట్టీ రేషన్ విధిస్తామన్నారు. పుష్కరాల్లో రోజుకు 25వేల మందికి అమ్మవారి అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. భక్తులు బఫే తరహాలో అన్నప్రసాదం స్వీకరించాల్సి ఉంటుందన్నారు. తలనీలాలు సమర్పించుకునేందుకు ప్రస్తుతం ఉన్న అరండల్ సత్రాన్ని మూసివేసి, పున్నమి, భవానీ, దుర్గాఘాట్‌లో కేశఖండనశాలలను ఏర్పాటు చేశామని చెప్పారు. దుర్గగుడిపై విధుల నిర్వహణ కోసం రాష్ట్రంలోని ఇతర దేవాలయాల నుంచి 600మంది సిబ్బంది వచ్చారని, మరో వెయ్యిమంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను నియమించామని వివరించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో అమ్మవారి దర్శనం పండిట్ నెహ్రూ బస్టాండ్, రైల్వే స్టేషన్లో కూడా అమ్మవారి మూర్తులను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. అక్కడ అమ్మవారికి ఏక హారతి ఇవ్వడంతో పాటు ప్రసాదాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. -
రేపు రాత్రి నుంచి దుర్గమ్మ దర్శనం రద్దు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా మంగళవారం రాత్రి నుంచి బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం నిలిపివేయనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. సాయంత్రం పూజా కార్యక్రమాల అనంతరం రాత్రి 7.30 గంటలకు దుర్గామల్లేశ్వరస్వామి ఆలయాలతో పాటు ఉపాలయాల తలుపులు మూసివేస్తారని తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, మహా నివేదన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. -
'దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా ఏపీ అభివృద్ధి'
విజయవాడ : దేశం మొత్తం ఆశ్చర్యపోయే రీతిలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ జనవరి 18న స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. వచ్చే నెల నుంచి ఇంటి దగ్గరే పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడా వృద్ధులు ఇబ్బందులు పడకుండా చూస్తామన్ని తెలిపారు. రాజధాని ప్రాంతంలో పంటపొలాలు దగ్దమైన ఘటన రాజకీయ లబ్ది పొందడానికి చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో కరవు నివారణ సాధ్యమన్నారు. చంద్రబాబు తొలుత ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శన అనంతరం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు... సీఎంను ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. తర్వాత నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో బాబు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్‌ను బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్మార్ట్ ఏపీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. -
బాసరలో వసంత పంచమి వేడుకలు
ఆదిలాబాద్ : చదువుల తల్లి సరస్వతి అమ్మవారి జన్మదిన వసంత పంచమి వేడుకలు బాసర పుణ్య క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. ఏటా మాఘుశుద్ధ పంచమిని అమ్మవారి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. వసంత పంచమి సందర్భంగా బాసర భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. చదువుల తల్లి జన్మదినం సందర్భంగా ఆ సన్నిధిలో అక్షరభ్యాసం చేయిస్తే తమ చిన్నారులు విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈక్రమంలోనే వందలాది మంది చిన్నారులకు అక్షరాభాస్య పూజలు జరుగుతాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తొలి రోజున అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అక్షరాభ్యాసం పూజలు ప్రారంభించారు. ఉత్సవం సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటలకు మంగళ వాయిద్యసేవ, సుప్రభాత సేవలతో ప్రారంభమైంది. రెండున్నర గంటల నుంచి అమ్మవారికి మహేభిషేకం, అలంకరణ, నివేదన నిర్వహించారు. అనంతరం అక్షరాభ్యాస, కుంకుమార్చన పూజలు ప్రారంభమయ్యాయి. మరోవైపు బెజవాడ ఇంద్రకీలాద్రిపై విజయీభవ కార్యక్రమం నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతీ అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి ప్రసాదంగా ఫొటో, పెన్ను, రక్షాబంధన్ అందచేస్తున్నారు. -
‘అమ్మ’ ఆదాయానికి టెండర్
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్ల టెండర్ల విషయంలో కాంట్రాక్టర్ల హవా కొనసాగుతోంది. వారికి రాజకీయ నేతలు, ఆలయ సిబ్బంది కొందరు తోడుకావడంతో ఇష్టానుసారంగా టెండర్లను మార్పు చేసుకుంటున్నారు. అదేమని ప్రశ్నించే దేవస్థాన అధికారులను అర్థ, అంగబలంతో అడ్డుకుంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ‘అమ్మవారి’ పైనే భారం వేసి అధికారులు నోరు మూసుకుంటున్నారు. ప్రసాదం కవర్ల టెండర్లలో మాయాజాలం దసరా ఉత్సవాలకు ప్రసాదాల కవర్ల సరఫరాకు అధికారులు ఈ-టెండర్లు పిలిచారు. చాలా మంది కేజీకి రూ.159 నుంచి రూ.163 వరకు టెండర్లు దాఖలు చేశారు. మచిలీపటాన్నికి చెందిన కాంట్రాక్టరు మాత్రం రూ.129కే టెండర్ వేశారు. టెండర్లు తెరిస్తే అతి తక్కువ ధరకు కవర్లు సరఫరా చేసేవారికే కాంట్రాక్టు దక్కుతుంది. దీనివల్ల కాంట్రాక్టర్‌కు లక్షల రూపాయల్లో నష్టం వస్తుంది. టెండర్ల వ్యవహరాన్ని చూసే ఒక గుమాస్తా ఒకరు ఈ విషయం సదరు కాంట్రాక్టర్ చెవిన వేశాడు. మిగిలిన కాంట్రాక్టర్ల కంటే తక్కువ ధరకు టెండర్ వేసినట్లు తెలుసుకున్న ఆ కాంట్రాక్టర్, గుమాస్తాతో కలిసి ఈ-టెండర్లు సైట్‌ను బ్లాక్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ సైట్ తెరుచుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి టెండర్లు పిలిచే అవకాశం ఉందని తెలిసింది. భోజన ప్యాకెట్ల టెండర్లలోనూ గోల్మాల్! దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీల్రాదిపై విధులు నిర్వహించే సిబ్బందికి ఆహార పొట్లాలు సరఫరా చేసేందుకు పిలిచిన టెండర్లులోనూ కాంట్రాక్టర్ల హవా నడిచింది. మూడు సెక్టార్లతో సుమారు మూడు వేల మందికి భోజన ఏర్పాటు చేసేందుకు దేవస్థానం ఈ టెండర్లు పిలిచింది. కాంట్రాక్టర్లకు సరైన అనుభవం లేదంటూ తొలిసారి వచ్చిన టెండర్లను అధికారులు రద్దు చేశారు. కాంట్రాక్టర్లు తమ లాబీయింగ్ ఉపయోగించడంతో రెండోసారి అర్హత లేనివారికే టెండర్లు కట్టబెట్టారు. నేరచరితులు, కొండపైనే అనేక కాంట్రాక్టులు నిర్వహిస్తున్న వారికే టెండర్లు దక్కాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కొంతమంది కాంట్రాక్టర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. పనుల్లోనూ అంతా గోప్యమే దసరా సందర్భంగా నిర్వహించే పనులకు పిలిచే టెండర్ల విషయంలోనూ అధికారులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. క్యూలైన్ల పైన వాటర్ ప్రూఫ్ షామియానాలు, బాణసంచా కోనుగోళ్లు, మైక్ ప్రచారం తదితర 14 పనులుకు ఇటీవల టెండర్లు ఖరారు చేశారు. రాష్ట్రంలో ప్రముఖ దేవస్థానాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినప్పటికీ వారికి నిరాశే మిగిలింది. దేవస్థాన అధికారుల ఆశీస్సులు, రాజకీయనేతల ‘హస్తం’ ఉన్న స్థానిక కాంట్రాక్టర్లే ఈ టెండర్లు దక్కించుకున్నారనే విమర్శిలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల బినామీలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి అమ్మవారి సొమ్ముకు గండి పెడుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు స్పందించి దేవస్థాన టెండర్లపై నిఘా పెట్టాలని భక్తులు కోరుతున్నారు.